This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000
ఈ నవల రాయాలనే ఆలోచన తెన్నేటికి పది సంవత్సరాలుగా వుందని నాకు తెలుసు. అతడు నాకు చూచాయిగా ఈ కథ గురించి చెప్పినప్పుడు ఆంధ్ర రాష్ట్రాన్ని ఉర్రూతలూగిస్తున్న సరికొత్త సినిమా పాట “ఓలమ్మీ తిక్క రేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా?” అది ఏ సంవత్సరంలోనో నాకు సరిగ్గా గుర్తులేదు. మా రోజుల్లో ఆచార్య ఆత్రేయ “లేవనంటావా? నన్నే లేపమంటావా? పెట పెటలాడే పచ్చి వయసు పైపైకొచ్చింది” “మెరిక చేనులో వాడు దున్నుతుంటే చూడాలి వాడి జోరు, వాడు తోడుతుంటే తీరుతుంది వయసుపోరు�” అని పాటలు రాస్తుంటే “ఛీ పాడు, బూతు.
ఆయన ఆత్రేయ కాదు బూత్రేయ” అని ముక్కున వేలేసుకున్నారు. రానురానూ సినిమాల్లోనూ, పాటల్లోనూ సెక్స్ అనేది ఉధృతమౌతునే వున్నా అది సర్వ సామాన్యమైపోయింది. వాన పాటలు, డబుల్ మీనింగ్ పద ప్రయోగాలు సర్వ సహజమైపోయాయి. జనం వాటిని ఆదరించినంతగా వేటినీ ఆదరించకపోవడంతో సినిమాలని రెండురకాలుగా విభజించి ఆనందిస్తున్నారు. కళాత్మక చిత్రాలు, వ్యాపారాత్మగా చిత్రాలు.
తెలుగు నవలా సాహిత్యంలో కూడా వ్యాపారాత్మక నవలలు రాకపోలేదు. వ్యాపారాత్మక నవలల్లో బహుశా యండమూరి వీరేంద్రనాథ్ అనబడే ఓ సంచలనాత్మక రచయితదే అగ్రస్థానం అయ్యుంటుందని నా ప్రగాఢ విశ్వాసం. అందుకు కారణం ఎవరి నోట విన్నా ఆయన పేరే. ఈ మధ్యకాలంలో వస్తున్న నవలల ధోరణి నాకంతగా తెలీదు. నేను చలం అభిమానిని. ఆయన మైదానం, ప్రేమ లేఖలు, మ్యూజింగ్స్ దాదాపుగా కంఠోపాఠంగా అప్పజెప్పగల వ్యక్తినంటే అతిశయోక్తి కాదండోయ్. తర్వాత తర్వాత వడ్డెర చండీదాస్ నాకు నచ్చాడు.
అతని అనుక్షణికం ఓ మూడు నాలుగుసార్లు చదివాను. తెన్నేటి పత్రికా సంపాదకుడుగా వుంటూ ఎంతటి సృజనాత్మక కనబరిచేవాడో నాకు జ్ఞాపకం వుంది. అతని సంపాదకత్వంలో వెలువడిన స్రవంతి, హారిక వారపత్రికలు అడపా దడపా చూస్తుండేవాడిని. నేటి పాఠకులకి ఏం కావాలో బాగా తెలిసిన వాడు తెన్నేటి. ట్రెండ్ సెట్టర్ ఔనో కాదో గానీ ట్రెండ్ రీడర్ అని చెప్పొచ్చును.
మా పిల్లలు అడియో వీడియో క్యాసెట్లు తెచ్చి వింటూండడం, సినిమాలు చూస్తుండడం మూలంగా…. నా దృష్టి మధ్య మధ్యలో ‘రజనీష్ ఫిలాసఫీ’ ‘జిడ్డు కృష్ణమూర్తి ఐడియాలజీ’ల మీంచి మళ్ళి….వాటి మీద పడకుండా ఆపలేకపోవడంచేత…. నా మెదడు కంప్యూటర్ లో అప్రయత్నంగా రికార్డ్ అయిపోయిన కొన్ని సినిమా పాటల తాలూకు పల్లవులో చరణాలో ట్యూన్స్ తో సహా వల్లె వేయగలను. రసవంతమైన గమ్మత్తు పాటలు అవి. “జారిందమ్మో జారిందమ్మో పైట కొంగు జారిందమ్మో! మారిందయ్యో…. మారిందయ్యో…. ‘పువ్వుకు’ రంగు మారిందయ్యో….” అనే ఒక పాటలో పువ్వు అనేచోట శ్రద్ధగా వినండి.
సినీ మాయాజాలం అర్ధం ఔతుంది. “మదన జనక నీ నెత్తి మీద టోపీ వెనక్కి జరిగిందేమిటో, పడుచు గుమ్మ పూకొరకు గుడిశెలో నేరక దూరిన పాపమే” అని ఓ పాటలో…. “ఏందిబే ఎట్టాగ వుంది ఒళ్ళు ఎక్కడో గుచ్చావు చేప ముల్లు…. ఓసినీ ఇంకాస్త ముందుకెళ్ళు, సఠ్టిలో సరుకేదో నింపుకెళ్ళు” అని ఓ చోట…. ఇలా చెప్పుకుంటూపోతే ఓ వెయ్యికి పైగా నేనే టీకా తాత్పర్యాలతో సహా నొక్కి వక్కాణించగల పాటలున్నాయి.
This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000