This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000
ఆ రాత్రి నన్ను ఒక లక్షసార్లయినా ముద్దుపెట్టుకుంది ఉష. నేను మనసుని ఎంత అదుపులో పెట్టుకున్నానో నాకు తెలుసు. ఆమె మహోన్నత వక్ష శిఖరాలు నా కళ్ళముందు కదలాడుతున్నా నేను చేతులు చాచలేదు. నా గుండెల మీద తలవాల్చి నిద్రపోయిందామె.
ఉదయమే టెలిఫోన్ నిద్రలేపింది. ఆమే రిసీవర్ అందుకుంది.
హోటల్ సావన్ కాంటినెంటల్ ఎం.డి. రాత్రి ఫోన్ చేస్తారని ఎంతో ఎదురుచూసానని చెప్పాడట. నీతో పాటు గదికెవరో కుర్రాడొచ్చాడట. నిజమేనా, అని అడిగాడట. నిజమే అని చెప్పి ఫోన్ పెట్టేసింది. రూం ఖాళీ చేసి బొంబాయిలో ఆమెకు తెలిసిన ఒక ఎడ్వకేట్ దగ్గరకెళ్ళాం. నన్ను ఫ్రంట్ రూంలో కూర్చోబెట్టి ఆమె లోపలికెళ్ళి, నలభై నిముషాల తర్వాత వచ్చి, నన్ను లోపలికి రమ్మని పిలిచింది.
అప్పటికే అగ్రిమెంట్ టైప్ చేసి సిద్ధంగా వుంచాడు ఎడ్వకేట్ థీరూబాయ్ పటేర్కర్. “ఒకసారి చదువుకో అభినయ్” అంది ఉష. “అక్కర్లేదు” “సంతకం చేసేముందు చదువుకోవాలి…” అన్నాడో అడ్వకేట్. “తర్వాత ఎప్పుడయినా చదువుతాను…” అని పెన్ అందుకున్నాను. సంతకాలు చేసాం. ఆ ఎడ్వకేట్ గారి సెక్రటరీ ఒకతను, టైపిస్ట్ ఒకమ్మాయి, ఇంకెవరో అతని ఫ్రెండ్ ముగ్గురూ సాక్షి సంతకాలు చేసారు. కారులో అక్కడనుంచి బాలాజీ గుడికి వెళ్ళాం.
అంతా ఉష ఇష్టమే. నేను ఏమీ పట్టించుకోలేదు. గుళ్ళో వేంకటేశ్వరస్వామి సమక్షంలో మంత్రోచ్ఛారణ జరిగింది. మేము దండలు మార్చుకున్నాం. సంతకాలూ చేసాం. ఫీజు చెల్లించేసాను.
ఎడ్వకేట్ థీరూబాయ్, అతని సెక్రటరీ ఉత్తమ్, టైపిస్ట్ స్వరూప, మిత్రుడు కిషన్ లాల్… మమ్మల్ని వివాహ శుభ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేసాడు. హోటల్ లో అందరం బోజనాలు చేసాం. “శోభనం మా యింట్లో… ఐ మీన్ మన యింట్లో…” అన్నాను. ఆమె ఒప్పుకుంది. నాకెంతో థ్రిల్లింగ్ గా వుంది. నేను, నా భార్య ఉషతో బొంబాయి వదిలిపెట్టి హైదరాబాదుకి పయనమయ్యాం. ఎయిర్‌పోర్ట్ కి కారొచ్చింది.
డ్రయివర్ బాబూరావ్ నన్ను ఉషని అరక్షణం ఆశ్చర్యంగా చూసి, మరుక్షణం వినమ్రంగా చేతులు జోడించాడు. పెళ్ళికూతురు గెటప్ లో ఉష ముద్దుగా వుంది. బ్యాక్ సీట్ లో కూర్చున్నాం. నా గుండెల మీద వాలిపోయింది. కస్తూరిబా కాలనీ దాటి జయంత్*పూర్ ప్రాంతాల్లోకి కారు ప్రవేశిస్తోంటే—ఉషతో చెప్పాను. “అదిగో చూడు… ఇక్కడ నుంచీ అంతా మా భూములే. అదిగో ఆ దూరంగా కనిపిస్తోంది చూడు—అదే మన ఇల్లు” అని.
“మైగాడ్! ఎంత ప్రశాంతంగా వుంది! చుట్టు ప్రక్కల ఎక్కడో దూరం దూరంగా విసిరేసినట్లున్న యిల్లు!” అంది. కొంచెం ఎత్తు మీద వుంది మా యిల్లు. చాలా విశాలమయిన ఖాళీ స్థలం. ఎత్తైనా కాంపౌండ్ వాల్. పెద్ద ఇనుప గేట్. గేట్ వరకూ విశాలమైన రోడ్డు. గేటు దగ్గరకి రాగానే హారన్ మోతవిని గేట్ కీపర్ మరిడయ్య పరుగున వచ్చి గేటు తెరిచాడు. “బాప్ రే! నూరు కుటుంబాలు ఇందులో కాపురం చేసుకోవచ్చు. ఇదంతా మీదేనా?” అంది ఉష విస్మయంగా. “కాదు! మనది!!” అన్నాను. పోర్టికోలో కారు ఆగగానే తోటమాలి, వంటవాడు, వంటమనిషి అందరూ పరుగు పరుగున వచ్చారు.
“నమస్తే అయ్య… నమస్తే అయ్య…” అంటూ చుట్టు మూగారు. “అమ్మగారు-బొంబాయిలో పెళ్ళి చేసుకున్నాం!” అందరికంటే పెద్దవాడైన సాంబయ్యతో చెప్పాను. మళ్ళీ ఉషకి వినమ్రంగా నమస్కరించారు. ఉష చుట్టూ చూస్తోంది. నా కర్ధమయ్యింది.
“ఈ అందమైన గార్డెన్ అంతా సాంబయ్య మహిమే!” నవ్వుతూ అన్నాను. పల్చటి లాన్. క్రోటాన్స్ మొక్కలు. పూలతోట. రంగు రంగుల పువ్వులు, ఇంద్ర భవనం లాంటి బంగళా. “అంతేకాదు, వెనకవైపు స్విమ్మింగ్ పూల్ కూడా వుంది…!” అన్నాను. “బ్యూటిఫుల్!” అందామె ఆనందంగా. ఆమె పల్వరుస ముత్యాల్లా మెరుస్తోంటే, పెళ్ళికూతురు గెటప్ లో ఆమె నవ్వుతుంటే, దేవకన్యలా దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. సాంబయ్య తలుపులు తెరిచాడు.
మొజాయిక్ ఫ్లోరింగ్, గోడలకి ఖరీదైన తైల వర్ణచిత్రాలు. ఖరీదైన కార్పెట్. సోఫా. టీపాయ్. ఫ్రిజ్. టివి. పైనుంచి వ్రేలాడుతున్న అందమైన షాండ్*లియర్స్. గోడలకి ఒక మూల గిటార్. మేడమీదకి మెట్లు. “సింగారి! శాస్త్రితో చెప్పి మంచి టిఫిను, కాఫీ, చెయ్యించి తీసుకురా” అన్నాను. సింగారి మా విశ్యామైన పనిమనిషి. శాస్త్రి మా సూపర్ వంటవాడు. మేడమీదకి వెళ్ళాం నేనూ, ఉష. పది పన్నెండు గదులున్నాయి మేడమీద, నాలుగు విశాలమైన బెడ్ రూమ్స్, ముందువైపు సిట్ ఔట్ పేము కుర్చీలు.
ఇండోర్ ప్లాంట్స్ తో చాలా అందంగా డెకరేట్ చేసాడు సాంబయ్య. యిల్లంతా ఎప్పటికప్పుడు అద్దంలా శుభ్రంగా మెరుస్తూ ఉంచుతుంది సింగారి. కనిపించడానికి నల్లగా, కౄరంగా, లావుగా, చిన్న సైజు ఏనుగు పిల్లలా వున్నా, ఓపికగా పనిచేసే మంచి పనిమనిషి సింగారి. “నేను ఊహించలేదు అభినయ్! ఇంత పెద్ద ఇల్లు! ఇంతమంది నౌఖర్లు! నువ్వింత ధనవంతుడవని నేను అనుకోలేదు!” అంది ఉష. “ఇదంతా నాన్న గొప్పతనం. ఆయన నాన్న గొప్పతనం!” అన్నాను. “ఈ పనివాళ్ళంతా ఇక్కడే వుంటారా?” అంది ఉష. ఆమె ఉద్దేశ్యం నాకర్ధమయింది.
“నా అనుమతి లేకుండా ఎవరూ లోపలికి రారు. అందరూ ఔట్ హౌస్ లో వుంటారు” అన్నాను. “ఐసీ…” అంది ఉష ఏదో ఆలోచిస్తూ. “ఒక్క సాంబయ్యే…ఎక్కడో ఇరవై కిలోమీటర్ల దూరంలో వుంటాడు. వారం పదిరోజులకోసారి వెళ్ళొస్తుంటాడు” అన్నాను. “ఒక ఆరు నెలల వరకూ వీళ్ళందరినీ మాన్పించేయకూడదూ? నీకు నేను, నాకు నువ్వేగా. ఇంత పెద్ద ఇంట్లో మనిద్దరమే వున్నామనుకో…ఎన్నెన్ని సరదాలు చేసుకోవచ్చో తెలుసా? ఒంటి మీద నూలుపోగు లేకుండా, అసలు బట్టలు వేసుకోవాలనే సంగతే మర్చిపోయి, నాలుగైదు రోజులు ఇల్లంతా తిరగాలని నాకో ఆశ…” అంది ఉష నా మెడ చుట్టూ చేతులు పోనిచ్చి. “ఛి…” అన్నాను.
“ఇదిగో. ఆ ఛి…అనే మాట ఇంకెప్పుడూ ఉపయోగించకు. ఏమిటా ఛి…నీ పిచ్చి…” అందామె. నేను మాట్లాడలేదు. ఆమె నన్ను గట్టిగా ముద్దు పెట్టుకుంది. “మరి వంటపనులూ, యింటిపనులూ, గార్డెనింగ్ అవన్నీ ఎవరు చేస్తారు?” ఆమె చెంపలు నిమురుతూ అడిగాను.
“నీకో రహస్యం తెలుసా? అందమైన ఆలోచనలు, అందమైన శృంగార జీవితం కలిగిన ఆడది ఇంటి పనులన్నీ తనే స్వయంగా చేసుకోడానికి ఉత్సాహపడుతుంది. అసలు నా చేతివంట ఎంత రుచిగా వుంటుందో తెలుసా? ఒకసారి నా చేతివంట రుచి చూసినా, నాతో ఒకసారి సెక్స్ రుచి చూసినా మళ్ళీ మళ్ళీ కావాలని అనిపిస్తుంది తెలుసా? దాంపత్య సుఖం అందుకోవటం అందించటం తరలిసిన స్త్రీ రుచికరమైన వంటకాలు చెయ్యటంలో ఆరితేరి వుంటుంది…” అంది ఉష.
“రియల్లీ…ఏదీ రుచి చూపించు మరి?” అన్నాను ఆమెను మీదకి లాక్కోబోతూ. “ముందు ఏది రుచి చూస్తావూ? ఫుడ్డా? బెడ్డా?” కొంటెగా చూస్తూ అడిగింది. “నీ యిష్టం…” అన్నాను. అదే క్షణంలో సింగారి___ “రావొచ్చా అయ్యా?” అని అడిగింది గది బైటనుంచి. “ఆఁ…. రా!” అన్నాను ఉషకి కొద్దిగ దూరంగా జరుగుతూ. ట్రేలో టిఫిన్ ప్లేట్స్, కాఫీ పాట్ పట్టుకుని వచ్చింది సింగారి.
ఆరోజు మధ్యాహ్నమే భోజనాలయ్యాక— నౌకర్లందరనీ పిలిపించాను. వాళ్ళని అకారణంగా పనిలోంచి తీసెయ్యడానికి నా కెందుకో బాధ అనిపించింది. ముఖ్యంగా తోటమాలి సాంబయ్య. నా చిన్నతనం నుంచి ఈ యింట్లో పని చేస్తున్నాడు. డ్రయివర్ బాబూరావ్, వంటవాడు శాస్త్రి, గేటు కీపరు మరిడయ్య, పనిమనిషి సింగారి, తోటమాలి సాంబయ్య— అందరికీ ఆరు నెలల జీతం ఒక్కసారిగా ఉచితంగా చేతికిచ్చేసరికి వాళ్ళు ఆశ్చర్యపోయారు.
“ఈరోజు నుంచి మీరు మానెయ్యండి. మీకెక్కడా ఉద్యోగం దొరకకపోతే నాకు ఫోన్ చెయ్యండి, నేను ఉద్యోగంలో చేర్పిస్తాను. ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది వస్తే నన్ను కలవండి…” అని నిర్మొహమాటంగా చెప్పేసాను. వాళ్ళ మొహాల్లో బాధ గమనించినా నేను చలించలేదు. ఉష ఆనందం ముందు వాళ్ళ బాధ నా మీద ఎలాంటి ప్రభావం చూపించలేదు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ మందిరంలో నేనూ. ఉషే. ఇద్దరమే.
This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000