This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000
అలారం శబ్దానికి , ఇద్దరం మేలుకోన్నాము , తన వైపు చూసుకొని సిగ్గుపడి , లేచి బాత్రూం కి పరిగెత్తింది. పని కానిచ్చి తవల్ చుట్టుకొని వచ్చింది. వెళతాను వదిన లేచే లోపున అని తన డ్రెస్ వేసుకొని వెళ్ళింది. తను వెళ్ళిన తరువాత ఓ గంట పడుకొని లేచి రెడీ అయ్యి , హమీద్ కు ఫోన్ చేసి మనము కారులో వెళ్లొద్దు , బైక్ కానీ లేదా స్కూటర్ కాని ఉంటే తీసుకొనిరా అందులో వెళదాము అని చెప్పా , ఈ లోపుల విల్లు ముగ్గరు రెడీ అయ్యారు. సరిగ్గా 8.30 కి కిందకు వచ్చాము టిఫిన్ చేయడానికి , హమీద్ కుడా అప్పుడే వచ్చి మాతో పాటు టిఫిన్ తిన్నాడు. “మరి వీళ్ళను ఏమి చేద్దాము ?” అన్నాను హమీద్ తో “నేను మీతో వస్తా ” అంది పల్లవి “మేము వెళ్ళేది షాపింగ్ కు కాదు , వుంటే ఇక్కడ హోటల్ లో ఉండండి , లేదంటే మా ఫ్రెండ్ ఉన్నాడు అక్కడ వదులుతాను ” “కరెక్ట్ సారూ , మా సార్ వాళ్ళ ఇంటికి పంపుదాము” అన్నాడు హమిదు . వెంటనే ప్రతాప్ కు కాల్ చేసి , విషయం చెప్పి వాళ్ళ ను తీసికెళ్ళ మని చెప్పా. ఓ 20 నిమిషాలలో వాడు, రాణి ఇద్దరు వచ్చారు వాళ్ళ ఆఫీస్ కార్ లో , అందరిని పరిచయం చేసి నేను వచ్చేంత వరకు అక్కడే ఉండమని చెప్పి , మాకు హెల్ప్ కావాలంటే కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేస్తామని చెప్పి వాళ్ళను పంపించేసి. మేము నిన్న వెళ్ళిన చోటకు వెళ్ళాము.
ఆ ఇంటికి కొద్ది దూరం లో ఓ బడ్డి కొట్టు ముందు పార్క్ చేసి , అక్కడే సిగరెట్టూ కొనుక్కొని , చాయ్ కి ఆర్డర్ చేసి వాడి కోసం వైట్ చేయ సాగాము, ఓ 2 సిగరెట్లు , 2 టీ లు అయిపోయిన తరువాత , వాడు బయటకి వచ్చి మా ముందు నుంచే మెయిన్ రోడ్డు మీదకు వెల్లి అటో ఎక్కాడు , ఆ అటో ఫాలో అయ్యాము. సందు లు గొందులు తిరుగుతూ చివరకు ఓ కమ్యూనిటి స్కూల్ లోకి వెళ్ళాడు ఓ ముప్పై నిమిషాలు తరువాత తనతో పాటు ఇంకో గద్దం వ్యక్తి తో బాటకు వచ్చాడు ఇద్దరూ కలిసి అక్కడే ఉన్న స్కూటర్ ఎక్కి వెళ్ళారు . హమీద్ వాళ్ళ వెనుక కొద్దిగా దూరం మైంటైన్ చేస్తూ వేళ్ళ సాగాడు. “మొన్న మనం వెళ్ళినప్పుడు వాడి దగ్గర పిస్తోలు ఉంది కదా , వెంట తెచ్చుకొంటే ఎట్లా ” అని అడిగా హమీద్ ను. “సార్ ను అడిగుంటే , బాగుండేది , కాని ఇప్పుడే లాగా ” “మీ సారూ అడిగుంటే , పెద్ద బటాలియన్ వచ్చేది , ఇలా ఇద్దరం వుండే వాళ్ళం కాదు ” “మొన్న విన్నప్పుడు , వాడు ఎదో సరుకు వస్తుంది , రిసీవ్ చేసుకోవాలి అన్నాడు , ఏమై ముంటుంది ?”. టౌన్ బయటకు వచ్చినట్లు తెలుస్తుంది మరి అలా ఎంత దూరం వెళతారో తెలియదు. ని బండిలో పెట్రోలు ఉందా? “ట్యాంక్ ఫుల్ చేయించా రాత్రే ” సరే పదా చూద్దాం అంటూ ఫాలో అయ్యాము . ఓ 20 k.m వెళ్ళిన తరువాత ఓ టర్నింగ్ లో రోడ్డు పక్క న ఓ చెట్టు కింద బండి ఆపాడు. “మనము ముందుకు వెళ్లి అగుదాము ” అంటూ హమీద్ ను ముందుకు వేళ్ళ మన్నాను. టర్నింగ్ వుండడం వలన మేము వాళ్ళకు కనబడని దూరం వెళ్లి బండిని రోడ్డు దించి బండిని కనబడకుండా ఓ పొదల వెనుక పార్క్ చేసి, ఆ పొదలు వెనక్కి వెళ్ళాము వాడు మా నుంచి తప్పించు కోకుండా. ఆ పొదల వెనుక నక్కి వాడి వైపు చుడసాగాము. అక్కడ వాడేమో అసహనం తో వచ్చి చూసుకుంటూ రోడ్డు వైపు చూడ సాగాడు.
“ఇలా వైట్ చేయడం ఎందుకు సారూ , వెళ్లి వాన్ని బొక్కలో తోస్తే అన్ని బయటకు వస్తాయిగా ” “వాణ్ణి బొక్కలో తోస్తే , అసలు ఎం జరుగుతుందో తెలిదుగా , వాడి వెనుక ఎవరూ వున్నారో తెలియదు కొద్దిగా వోపిక పట్టు” కొద్ది సేపటికి ఎదో పెద్ద వేహికల్ వస్తున్నా శబ్దం విని అక్కడ వాళ్ళు ఇద్దరు అలెర్ట్ అయిపోయారు , వాళ్లతో పాటు మేము కుడా అలెర్ట్ అవుతూ చుడ సాగాము. ఓ లారి వాళ్ళ పక్క వచ్చి ఆగింది , వాళ్ళలో వాళ్ళు ఏమో మాట్లాడుకొని ,మేము ఫాలో అవుతూ వచ్చిన వాడు లారీ లోకి షిఫ్ట్ అయ్యాడు. స్కూటరు ముందు దారి చూపు తుండగా , లారీ వాళ్ళను ఫాలో ఆయింది . “హమీద్ , వాళ్ళను ఎట్టి పరిస్తితుల్లో మనం మిస్ కాకూడదు అంటూ , నివెల్లి బండి తీసుకోని రా నేను రోడ్డు మీదకు వస్తాను ” హమీద్ తను బండి పార్క్ చేసిన ప్లేసుకు పరుగెత్తు కెళ్ళాడు. “ఈ లోపల నేను రోడ్డు మీదకు వచ్చాను” హమీద్ రాంగానే స్పీడుగా వెళ్లి టౌన్ ఎంట్రెన్సు లో ఆ లారీని పట్టుకున్నాము. వాడు ఇందాక స్కూటర్ పిక్ చేసుకున్న స్కూలు దగ్గరకే వచ్చింది. “హమీద్ , ఇప్పడు ఆ లారిలో ఏముందో తెలుసుకోవాలి ” “సార్ ఈ ఏరియా చాలా టెన్షన్ ఏరియా , ఈ చిన్న గొడవ జరిగినా పెద్ద పెద్దోళ్ళు వచ్చేస్తారు” “వాళ్ళు అందులో ఏముందో ఇప్పుడే అఫ్ లోడ్ చేస్తారంటావా ” “పగలు ఆఫ్ లోడ్ చేస్తే ఏమి ఇబ్బంది కరమైన వి లేనట్లే , రాత్రి ఆఫ్ లోడ్ చేస్తే నే చెప్పలేము. ” “నేను మద్యానం వరకు ఇక్కడే ఉందా , నీవు వెళ్లి ని పనులు చూసుకొని వచ్చేయ్, ఆపైన నేను వెళ్లి తిని వస్తా అని చెప్పి హమీద్ ను పంపేసాను ” రోడ్డుకు కొద్ది దూరంలో ఓ కాక హోటల్ ఉంటే అందులోకి వెళ్లి చాయ్ , సిగరెట్ ఆర్డర్ చేశా, మద్య మద్యలో ఆ స్కూలు ముందరున్న లారీ వైపు వో కన్నేసి కుచోన్నా . 4 గంటలకు హమీద్ వచ్చాడు , తనను అక్కడే వుంది ఆ బండి తీసుకోని ప్రతాప్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. “రేయ్ చిన్న హెల్ప్ చేయరా , ఓ డ్రైవర్ ని పంపి వీళ్ళని ఇంటిదగ్గర దిగ పెట్టి రామ్మనవా నాకు ఈ రాత్రికి పని ఉంది”. వాడు వెంటనే ఆఫీస్ కు ఫోన్ చేసి ఓ కానిస్టేబుల్ ను రమ్మన్నాడు. ఆడవాళ్ళు ప్రతాప్ వాళ్ళ ఫ్యామిలి తో బాగా కలిసి పోయారు. “అక్కా , మీరు డ్రైవర్ తో వెళ్ళండి నేను రేపు పొద్దున వస్తాను. ఇక్కడ పని చూసుకొని” “అందరం రేపు పొద్దున్నే పోదాములే ” అంది పల్లవి “మీ నాన్న కంగారు పడతాడు , మీరు వెళ్ళండి ” అంటూ వాళ్ళని కారు ఎక్కించి , వెళ్ళిన వెంటనే ఫోన్ చేయి , అట్లే శాంతా వాళ్ళ తాతకు చెప్పు అని పంపిచ్చి నేను హమిద్ దగ్గరకు వెళ్ళా. “ఏమైనా గమనించావా ” ” ఏమి లేవు సారూ , కాని మా గద్దపోల్లు మాత్రం చాలా మంది వస్తూ పొతూ వున్నారు. ”
This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000