అందమైన అనుభవం

This website is for sale. If you're interested, contact us. Email ID: storyrytr@gmail.com. Starting price: $2,000

“ఏరా తమ్ముడూ ట్రైను బయలుదేరిందా?” ఫోనుచేసి అడిగింది అక్క సుమతి. “ఇప్పుడే బయలుదేరింది. ఈ వర్షాలవల్ల దార్లో ఎంత ఇబ్దంది అయ్యిందో తెలుసా!’ అన్నాడు తుషార్, ‘అవునూ, నేనంత కష్టపడి టిఫిన్ చేసిస్తే నువ్వు కారులోనే మర్చిపోయి వెళ్ళిపోయావు. సర్లే జాగ్రత్త, టైన్లో అడ్డమైన చెత్తా తినకు. వెళ్ళగానే ఫోన్ చెయ్యి అనీ సుమతి ఫోను పెట్టేసింది. మెల్లిగా సీట్లో వెనక్కువాలాడు తుషార్. ఏసీ బోగీ కిటికీలోనుండి బయట పడుతున్న వానను చూస్తుండగానే, టైను క్రమేపీ స్పీడు అందుకుని గమ్యం వైపు పరుగులు తీసింది.

కాజీపేట స్టేషన్లో ఆగింది ట్రైన్. తుషార్ కిందకుదిగి రెండు ఇంగ్లీష్ నవల్స్, ఓ వాటర్ బాటిల్ కొనుక్కుని సీటు దగ్గర కొచ్చాడు. తన సీట్లో అందమైన అమ్మాయి! నోటమాట రానివాడిలా ఉండిపోయాడు.

‘అమ్మా అమూల్య జాగ్రత్త, మధ్య మధ్యలో ఫోను చేస్తూ ఉండు. ఉంటాను అంటూ తండ్రి జాగ్రత్తలు చెప్పడంతో సరే నాన్నా మీరు దిగండి. టైను కదులుతోంది’ అంది ఆమె. ఆ మాటలతో ఈ లోకంలోకి వచ్చిన తుషార్ మేడమ్ ఈ కింది బెర్త్ మీదా అడిగాడు నవ్వుతూ.

ఔనండీ, అందుకేగా కూర్చున్నాను’ చిన్నగా నవ్వుతూ అంది అమూల్య.

చంద్రోదయంలా ఎంతో హాయిగా ఉంది ఆమె నవ్వు. అందమైన పలువరస, విరిసీ విరియని ఎర్రగులాబీ మొగ్గల్లాంటి పల్చటి లేలేత అధరాలు. నిర్మలమైన ప్రేమను కురిపిస్తున్న చిలిపి నీలి కళ్ళు. జీన్స్ మీద బ్లూ టీ షర్టు వేసుకుని కురులను లూజగా గాలికి వదిలేసింది. అందమైన కోలముఖం, చుబుకం కింద నల్లటి చిన్న పుట్టుమచ్చ, చెవులకు వేలాడుతున్న పింక్ కలర్ డేంగిల్స్. మెడలో ‘ఎ’ అక్షరం ఉన్న చిన్న లాకెట్ అబ్బా చూపులకు ఎంత అందంగా ఉంది అనుకున్నాడు తుషార్. తననే తేరిపారచూస్తుండటంతో, అమూల్య కాస్త గర్వపడింది. సిగ్గుతో వెనక్కు జరిగి మీది పైబెర్తా, పర్వాలేదు కూర్చోండి అంది సీటు చూపిస్తూ. “థాంక్యూ అంటూ ఆమె ఎదురుగా కూర్చున్నాడు పుస్తకాలను ప్రక్కకు పెడుతూ, మెల్లగా కిటికీ లోంచి బైటకు చూస్తున్నాడేగానీ ఆమెను క్రీగంట గమనిస్తూనే ఉన్నాడు. అమూల్య కూడా చాటుగా అతన్ని చూస్తూ ‘అబ్బా ఎంత బాగున్నాడు. అచ్చు హీమాన్లా, హండ్సంగా, మగసిరిగల మగాడిలా ఉన్నాడు’ అనుకుంది.

‘మేడమ్! ఎంతవరకు ప్రయాణం మెల్లిగా మాట కలిపాడు తుషార్.

‘కాశీకి, మరిమీరు?” చిన్నగా నవ్వుతూ అడి గింది అమూల్య.

‘అరె నేనూ అక్కడికే వర్షాల వల్ల, ఫ్లైట్లన్ని క్యాన్సిల్ కావడంతో, ఇలా బయలుదేరాల్సి వచ్చింది. అవునూ, మీరు అక్కడ చదువుతున్నారా?” తుషార్ అడిగాడు. “అబ్చే లేదండీ బెనారస్ యూనివర్సిటీ సెమినార్లో పోస్టర్ ప్రెజెంటేషన్ కి వెళుతున్నాను” అంది ఆమె.

‘ నేను కూడా అక్కడికే, పేపరు ప్రెజెంటు చెయ్యడానికే వాటే కో ఇన్ఫిడెంస్’ తుషార్ నవ్వుతూ అన్నాడు. ‘అబ్బా నవ్వితే ఇంకా అందంగా ఉన్నాడు’ అనుకున్న అమూల్య మౌనంగా కిటికీవైపు తల తిప్పింది.


తుషార్ చెబుతున్న మాటల్ని ఆసక్తిగా వింటోంది అమూల్య. మధ్యమధ్యలో చిరునవ్వులు చిందిస్తోంది. అతడిలో ఏదో ఆకర్షణ. తెలియకుండానే ఆమెలో ఓ రకమైన ఇష్టం ఏర్పడ సాగింది. “లవ్ ఎట్ ఫస్ట్ సైట్” అంటే ఇదేనేమో అనుకుని నవ్వుకుంది అమూల్య. అతని కంపెనీ క్రమేపీ ఆనందాన్ని ఇవ్వసాగింది. అంతలోనే రాత్రి తొమ్మిదైపోయింది.

‘తినడానికి ఏమైనా తెచ్చుకున్నారా? నవ్వుతూ అడిగింది.

హడావిడిలో అక్క ఇచ్చిన టిఫిన్ కార్లోనే మరచిపోయాను. పేంట్రీలో ఏమీ రావని తెలిసింది. ఈ రాత్రికిక ఉపవాసమే” అంటూ వాటర్ బాటిల్ అందుకున్నాడు తుషార్.

‘నా టిఫిన్ ఉంది. షేర్ చేసుకుందాం’ అంది అమూల్య చొరవగా.

‘సరే అయితే చెరిసగం పంచుకుందాం” అన్నాడు కొంటెగా ఇద్దరూ హాయిగా నవ్వుకుని, కబుర్లు తింటూ టిఫిన్ పూర్తిచేసారు. తొలి పరిచయంలోనే తుషార్, అమూల్య బాగా కనెక్టై పోయారు. ‘తొలి ప్రేమ” అంటే ఇదేనేమో!


“అమ్మయ్య మీ దయవల్ల కడుపు నిండింది. ఇంక ఆ పడక సంగతి కూడా చూస్తే ఓ పనై పోతుంది” అన్నాడు తుషార్.

“మాటలు కోటలు దాటుతున్నాయి. ఏంటి సంగతి అమూల్య చురక వేసింది నవ్వుతూ.

‘సరే, సరే ఇంతకీ నన్ను ఎక్కడ పడుకో మంటారు, పైనా, కిందా మళ్ళీ కొంటెగా అడిగాడు తుషార్. ఆ కొంటెతనాన్ని ఆమె ఎంజాయ్ చేస్తోందిగానీ, ఆ స్పీడుకు బ్రేకులు వేస్తూ, “ఆ డైలాగులే వద్దన్నది, తిన్నగా మాట్లాడండి అంది గంభీరంగా. సారీ! పైన నాకు చోటు సరిపోదు. అభ్యంతరం లేకపోతే నేను కింద పడుకుంటా. అయినా మీరు ఒప్పుకుంటారు లెండి, మీది అసలే జాలిగుండె అన్నాడు ఆమె బాడీ లాంగ్వేజ్ను అబ్జర్స్ చేస్తూ. పై బెర్తుమీద నీట్గా ఆమెకు పక్క వేసి, ఓకే మేడం. గుడ్ నైట్ ఎండ్ స్వీట్ డ్రీంస్’ ఆమె వంక అదోలా చూసి కింద బెర్తు మీద నడుం వాల్చాడు.


This website is for sale. If you're interested, contact us. Email ID: storyrytr@gmail.com. Starting price: $2,000