This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000
ఎక్కడ నుంచి మొదలుపెట్టాలి రా , మామా “ “మొదట వెళ్లి మీ CEO ని కలువు , నీ జాబ్ ఉందా ఉడిందా అది తెలుసుకో” “అది నిజమే రా మామా, పేషెంట్ వాళ్ళు కేసు పెడుతూ ఉంటె వీళ్ళు ఎదో ఆక్షన్ తీయకుండా , ఇలా చేస్తున్నారు అంటే, నాకు కూడా ఎదో డౌట్ గా ఉంది” “పద అక్కడికే వెళ్దాం కావాలంటే నేను బయట ఉంటా” అంటూ ఇద్దరం CEO ఛాంబర్ వైపు వెళ్ళాము.
నేను బయట ఉండగా , తను లోపలి వెళ్లి ఓ 10 నిమిషాలు తరువాత వచ్చాడు. “ఏ మన్నాడు రా ? , ఉందా , ఉడిందా “ “మద్యలో ఉంది , ప్రస్తుతానికి నేను హాస్పిటల్ కు రావాల్సిన అవసరం లేదు , కేసు ఎదో ఒకటి తేలే వరకు రావద్దు అన్నాడు “ “అలా అయితే , మన కేసు ఎలా ముందుకు జరుగుతుంది, నువ్వు ఇక్కడ వస్తే నే కదా, నీవు లేనప్పుడు ఇక్కడ ఎం జరిగిందో” “నేను రావడానికి నన్ను ఎవ్వరూ ఇక్కడ అడ్డు కోరులే , కాకా పొతే సర్వీస్ లో ఉండను “ “సరే అయితే నీ పేషెంట్ ఉన్న వార్డు కు వెళ్దాం పద , అక్కడ ఎం జరిగిందో తెలుస్తుంది , అలాగే ఆ బాడీ పోస్ట్ mortem రిపోర్ట్ చూడాలి.” “పద, ఆ వార్డుకు వెళ్దాం మొదట అక్కడ నుంచి మొదలు పెడదాం ” అంటూ రెండవ అంతస్తులో ఉన్న పేషెంట్ వార్డ్ కు వెళ్ళాము.
తను సెలవులకు వెళ్ళే ముందు , ఆ పేషెంట్ కి సంబంధించిన కేసు షీట్స్ అన్నీ ఓ కాపీ తీసు కొన్నాడు. వాళ్ళకు అక్కడే పోస్టుమార్టం రిపోర్ట్ కాపీ కూడా దొరికింది. అవన్నీ తీసుకొని కాంటీన్ కు వెళ్ళాము.
అక్కడ టీ ఆర్డర్ చేసి , ఆ కేసు షీట్స్ పరిశీలించ సాగాడు గిరి. నేను కూడా వాటిని చూస్తూ , “నువ్వు ఉన్నంత వరకు ఉన్న షీట్స్ పక్కన పెట్టు వాటితో పెద్దగా అవసరం ఉండదు, నువ్వు వెళ్ళిన రోజున నుంచి చూడు” అంటూ అక్కడున్న షీట్స్ ను డేట్ వైస్ సెపరేట్ చేశాము.
తను సెలవుల మీద వెళ్ళిన రోజున ఉన్న షీట్స్ ముందే సు కొన్నాడు. తను లంచ్ తరువాత వెళ్ళాడు , అప్పటి వరకు ఉన్నా షీట్స్ చెక్ చేసాడు. అంత వరకు నార్మల్ గానే ఉంది.
5 ఓ క్లాక్ కి నర్సు ఒక ఇంజక్షన్ చేసి , కొన్ని టాబ్లెట్స్ ఇచ్చింది , అవి ఇచ్చిన ఓ గంట తరువాత కాంప్లికేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఆ టాబ్లెట్స్ , ఇంజక్షన్ కింద పెన్ తో అండర్ లైన్ చేసాడు.
“ఇంతకు ముందు నువ్వు ఇచ్చినవే కాదా ఇవ్వి కూడా ?”
“అవును , అదే ఇంజక్షన్ , అదే టాబ్లెట్స్ “ “మరి అవ్వే ఇస్తే problem ఎందుకు ఉంటుంది.” “అదే ఇప్పడు మనం తెలుసుకోవాల్సిందే.” “ఆ రోజు ఈ టాబ్లెట్, ఇంజక్షన్ ఇచ్చిన నర్స్ ఎవరు చూడు “ “తన పేరు జయంతి , నాకు తెలుసు “ “అయితే ఉందేమో పిలు , కాంటీన్ కి ఇక్కడే మాట్లాడ దాము.” కాంటీన్ నుంచి లేచి పక్కనే ఉన్న ఎక్ష్ టెన్షన్ కు ఫోన్ చేసి తనని కాంటీన్ కి రమ్మనాడు. ఓ 10 నిమిషాల తరువాత ఓ నర్సు అక్కడికి వచ్చింది, “హాయ్ జయా , ఎలా ఉన్నావు” అన్నాడు గిరి. తనకు హాయ్ చెప్పి నా వైపు చూడసాగింది. నేను కూడా “హాయ్ దుబ్బి ” అన్నాను.
మీరు , నువ్వు శివా కదూ “నువ్వేనా, నువ్వేంటి ఇక్కడ ” అంది ఓ వైపు ఆశ్చర్య పోతూ
“ఏంటి , వీడు నీకు ఇంతకూ ముందే తెలుసా “ “ఆ తెలుసు , నేను జాబ్ లో చేరిన కొత్తలో , ఇంతకూ నువ్వు ఇక్కడ ఎలా శివా ???” అంది నా వైపు దీక్షగా చూస్తూ “వీడు , నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ , వీల్లకు తెలిసిన అమ్మాయినే నేను పెళ్లి చేసుకుంది. నా కేసు మీద నాకు హెల్ప్ చేయడానికి వచ్చాడు” “ఏంటి తను పోలీస్ ఆఫీసరా “ “కాదు , ఎదో తనకు తెలిసిన విషయాలు హెల్ప్ చేస్తా డులే, ఇంతకూ ఈ చనిపోయిన పేషెంట్ విషయం లో నీకు తెలిసింది ఏమైనా ఉంటె చెప్పు జయా , ఈ కేసు నా మెడకు చుట్టూ కుంది. ఈ కేసు నుంచి బయట పడితేనే నాకు కారియర్ లేదంటే నేను ఫినిష్”
“ఇక్కడ డిస్కస్ చేయడం మంచిది కాదు , ఈవినింగ్ నేను డ్యూటీ దిగగానే నీకు ఫోన్ చేస్తాను , అప్పుడు మాట్లాడు కుందాము” అంటూ బాయ్ శివా సాయంత్రం కలుద్దాం అంటూ తను వెళ్లి పోయింది.
తాగిన చాయ్ కి డబ్బులు ఇచ్చి కాంటీన్ బయటికి వస్తు ఉండగా “ఏంటి రా జయంతి ని దుబ్బి అని పిలిచావు , అదేం పేరు “ “ఓ అదా , నేను తనని అలాగే పిలిచే వాన్ని అప్పుడు “ “ఇంతకూ నీకు తను ఎలా పరిచయం ” అంటూ తన బైక్ కి స్టార్ట్ చేసాడు, నేను కుచోగానే బైక్ ఇంటి వైపు దారి మళ్లించాడు. “నా PG కాగానే నాకు పార్ట్ టైం జాబు వచ్చింది , అప్పుడు తను కూడా అక్కడ నర్స్ గా పని చేసేది. తను అప్పుడు కొద్దిగా బొద్దుగా ఉండేది లే , అందుకే దుబ్బి అని పిలిచే వాన్ని.”
“నన్ను ఇంట్లో దింపి నువ్వు ఇంటికి వెళ్ళు ఈవినింగ్ కలుద్దాం ” అని చెప్పగా వాడు బైక్ మా ఇంటి వైపుకు తిప్పి నన్ను ఇంట్లో దింపి తను ఇంటికి వెళ్ళాడు.
ఇంట్లోకి వెళ్ళగానే నా బుర్రంతా జయంతి పరిచయం అయిన రోజుల్లోకి వెళ్ళింది.
నా డిగ్రీ కాగానే , B.Ed. , MCA ఎంట్రెన్స్ రెండు రాసాను , నాకు రెండింటి లో మంచి ర్యాంక్ వచ్చింది దానికి తోడూ నాకు NCC “C” సర్టిఫికేట్ ఉండడం వలన సీట్ ఈజీ గా వస్తుంది. ఎందుకైనా మంచిది అని డిగ్రీ కాలేజీ లో లెక్చరర్ గా ఉన్న మా చిన్నాన్నని సలహా అడిగాను. అప్పటి మా ఆర్థిక పరిస్థితి ద్రుష్టి లో పెట్టుకొని , నన్ను B.Ed. లో చేరమన్నాడు.
ఓ సంవత్సరం B.Ed. చదివి , తిరిగి MCA ఎంట్రన్సు రాసి అనంతపురం SKU లో క్యాంపస్ లో సీట్ సంపాదించాను. అలా MCA పరీక్షలు రాసి ఇంటికి వెళ్ళిన ఓ 10 డేస్ కి నాకు యూనివర్సిటీ నుంచి ఓ కాల్ లెటర్ వచ్చింది.
నవోదయా స్కూల్ లో కంప్యూటర్ instructor గా పార్ట్ టైం జాబ్ ఉంది వచ్చి చేరు అని. ఆ కాల్ లెటర్ పట్టుకొని నవోదయా స్కూల్ కి వెళ్లాను.
అన్నీ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని వచ్చే వారం నుంచి వచ్చి చేరు అని చెప్పాడు ప్రిన్సిపాల్ , అది రేసిడేన్సీయల్ కావడం వళ్ళ ఇంకో అతనితో కలిసి ఓ quarter కూడా ఇచ్చారు. అక్కడే పిల్లల తో పాటు తినడం quarter లో ఉండడం. వాళ్ళు చెప్పిన డేట్ కి చేతిలో ఓ సూట్ కేసు తో వాళ్ళు అలోకే ట్ చేసిన quarter కు వచ్చాను. నాతొ పాటు నాగరాజు అనే ఓ హిందీ టీచర్ , ఆ quarter ని షేర్ చేసుకుంటాడు.
మొదటి రోజు ప్రేయర్ తరువాత ప్రిన్సిపాల్ స్టాఫ్ రూమ్ లో అందరిని ఇంట్రడ్యూస్ చేసాడు. అప్పుడు చూసాను జయంతి ని బొద్దుగా తెల్లగా ఉంది. తను కూడా నాలాగే పార్ట్ టైం నర్సు గా వచ్చింది. తనకి uniform ఉండేది స్కూల్ టైం లో అందుచేత ఎప్పుడు తెల్ల చీరలో కనబడే ది.
నాకు కంప్యూటర్ ల్యాబ్ చూపించారు , నాకు క్లాసు రూమ్ అదే , ల్యాబ్ అదే స్కూల్ టైం లో.
This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000