This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000
అప్పుడే స్నానంచేసి బాత్రూంలోంచి బయటకొస్తూనే అమ్మా లగేజ్ సర్దడం అయిపోయిందా అంటూ గట్టిగా అరిచాడు రఘు.ఆ అరుపులు విన్న సుధ అయిపోయింది నీదే ఆలస్యం అంటూ రఘు గదిలోకొచ్చింది.ఊరికి వెల్లే సంగతి తెలిసికూడా ఇంత లేటేంటిరా తొందరగా కానీ నేనెల్లి టిఫిన్ ప్యాక్ చేస్తా అనుకుంటూ వంట గదిలోకి వెల్లపోయింది.సీనుగాడు ఎప్పుడూ ఇంతే ఎప్పుడన్నా పని ఉన్నప్పుడే ఎక్కడికి వెలతాడో తెలియదు అంటూ ఫోన్ చేయసాగాడు.ఫోన్ రింగయింది కానీ ఎత్తడం లేదు.అప్పుడే వస్తున్న సీనుని చూసి ఏంట్రా వాడికి ట్రైన్ టైం అవుతుంది ఇప్పుడా వచ్చేది వాన్ని తొందరగా రమ్మను అని చెబుతున్న సుధకు ఏదో చెప్పబోయిన వాడు ఆగిపోయి ….సరే అంటీ అంటూ రఘు గదిలోకి వెళ్లాడు.
అరే రఘూ ఇంకా రెడీ అవలేదా అంటుండగానే ఇప్పుడారా వచ్చేది అని అరిచాడు కోపంగా.అవేమీ పట్టించుకోకుండా పదరా ట్రైనుకి లేటయిపోతుంది అంటూ బ్యాగు బుజానేసుకొని బయటకు వస్తున్నడు సీను.రఘుకూడా సీను వెనకాలే హాల్లోకి వచ్చేసరికి రఘూ ఇదిగోరా టిఫిన్ అంటూ సుధ రఘుకి టిఫిన్ బ్యాగ్ అందించి వారి వెంటనే బైకు దగ్గరకొచ్చింది అక్కడికి చేరాక ఫోను చేయ్యరా అని చెప్పింది. సరే అమ్మ బాయ్…..అనిచెప్పి బయలుదేరిపోయరు.
సరిగ్గా గంట తరువాత సికింద్రాబద్ రైల్వే స్టేషను చేరుకున్నారు. ట్రైను కదలడానికి ఇంకా పది నిమిషాలు టైం ఉంది. అవి ఇవి కొద్దిసేపు పిచ్చాపాటి మాట్లాడుతుండగా మధ్యలో రఘు కలగజేసుకొని నేనొచ్చేసరికి గడ్ న్యూస్ చెప్పలిరా అన్నాడు.సరేరా ఆ ప్రయత్నంలోనే ఉంటా. నే ఫోన్లో చెప్తాలే గాని ముందు నువ్వు పదట్రైనెక్కు బండి కదులుతూంది. రఘు ట్రైనెక్కి సీనుకి బాయ్ చెప్పి కంపార్టుమెంటులోకి తన సీటు వెదుక్కంటూ వెళ్ళి కూర్చున్నాడు.
కూర్చున్నక బ్యాగు సీటు కింద పెట్టి తిరిగి అటూయిటూ చూస్తన్నాడు ఏవైనా పిట్టలు కనబడతాయేమోనని.లాభం లేదు అన్నీ చుచ్చు పురుగులే కనబడ్డాయి. ఒక్కసారిగా నీరసం ఆవహించింది.కొద్దిసేపటికి పక్కనున్న వారు ఎవరైతేనేం వాళ్లేమి జీవితాంతం నావెంట ఉండరుగా అనుకుంటూ పరిచయం చేసుకోవడం కోసం షేక్ హండిస్తున్నట్లుగా చెయ్యి చాపి నా పేరు రఘు అన్నడు.పక్కనున్నతను తన పేరు చెప్పేలోపే అతని పక్కనున్నావిడ ఒసే రాణీిఇఇఇ…….అంటూ గట్టిగా కేకేసీది ఆ అరుపులకు చెవ్వులొక్కసారి గోళ్ళుమన్నయి.
ఆవిడంత గట్టిగా అరవడం వల్ల పక్కనున్న వారంతా ఆవిడని గుర్రున చూశారు తప్ప ఏమనలేకపోయారు ఎక్కడ మా మీద అరిచి గోలపెడుతుందోనని.ఆవిడ కేకలు విన్న రాణి తమ దగ్గరకు సమీపిస్తున్నప్పడు అటు చూశా. అంతే ఒక్కసారిగా నా…..గండె ఆగినంత పనైంది. అగ్గది అక్కడ మొదలైంది. తనని చూస్తేనే నా ఒంట్లో వెయ్యి వాట్ల విద్యుత్ ప్రవేశించినట్లైంది.అంతే నా గుండే……… జారీ ………గలంతయ్యంది.హార్టు బీటు పెరిగి హర్టటాకొచ్చినంత పనైంది.
సీట్లో కూర్చున్న తను అక్కడ కొత్తగా కనపడ్డ నన్ను చూసింది. అప్పుడే మా ఇద్దరి చూపులు కలుసుకున్నాయి.అక్షణం అలాగే ఆగిపోతే ఎంత బాగుంటుందో అనుకున్నాను. అంతలోనే పక్కన కూర్చుని ఉన్న అంకుల్ నన్ను పిలుస్తున్నారు. ఇష్టం లేకపోయినా అతని వైపు తిరగాల్సొచింది.అతనేదో అడిగాడు నాకర్ధంకాలా.మళ్లీ తనే నా పేరు చంద్రం అని ఎదురుగా కూర్చున్న ఆవిడ అతని భార్యని ఆవిడ పేరు సులోచన ఆపక్కన సత్యవతి ఆవిడ చెల్లెలు అమె పక్కనున్నతను ఆమె భర్త రాజారాం అతని ఒల్లో కూర్చున్న పిల్లాడు రాహుల్*. ఇకపోతే మన స్వప్నసుందరి చూపిస్తూ ఇది నాఒక్కగానొక్క కూతురు రాణి అన్నాడు ఏదో సాదించిన వాడిలా…….నేను నన్ను పరిచయం చేసుకుంటూ నా పేరు రఘు అని చెప్పాను…….
కాసేపు నిశబ్దంగా ఎవరూ ఏమీ మాట్లాడలేదు. ఆ తరువాత బాబు ఎడుస్తుండు.ఎంతసేపటికీ ఆపడం లేదు.అందరూ వారివారి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ తన ఏడుపు ఆపడంలేదు. ఇటివ్వండంటీ అని బాబును తీసుకుని డోర్ దగ్గరకు వెళ్లి బయటకి చూపిస్తూ కబుర్లు చెబుతుంటే ఏడుపు ఆపాడు.ఏడ్వడం లేదుగా అని మేమున్న సీటు దగ్గరగా వచ్చేసి బాబుని వాళ్ళమ్మకు ఇచ్చాను. కాసేపు చంద్రం అంకుల్ నేను కబుర్లతో కాలక్షేపం చేశాము. అలా అతనితో మాట్లాడుతూ నేను రాణిని ఓరకంటితో చూస్తూనే ఉన్నా………….
ఆడవాల్లను ఎవరయినా చూస్తుంటే ఆ చూపులు వాళ్లకి ఇట్టే తెలుస్తుందంట.ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు.కానీ నా విశయంలో మాత్రం రుజువయింది. నా చూపులు తను గమనించిందని తెలియగానే నేను చప్పున తల దించుకున్నాను తనింకా నన్నే చూస్తుంది.చంద్రమంకులేదేదో చెబుతున్నాడు.నాకదేం వినబడటం లేదు.రాణి ముఖం చూడటం తప్ప.అలా ఎంతసేపు చూసుకుంటున్నామో మాకే తెలియదు………….అప్పుడే అటుగా చాయ్ చాయ్….అంటూ వస్తున్న అరుపులకు ఈ లోకంలోకోచ్చాము……. ………రాజారాం అంకుల్ ఆ అబ్బాయిని పిలిచి అందరికి ఇవ్వమన్నాడు.అందరితోపాటు నాక్కూడా ఇచ్చాడు. చాయ్ తాగి కసేపు వాళ్లతో మాట్లాడి చంద్రం అంకుల్ నాకు నిద్రొస్తుంది.నే పడుకుంటానని పై బెర్తుకెక్కి పడుకున్నా……. కాసేపటికి నాకెదురు బెర్తుపై రాణి ప్రత్యక్షమైంది. నమ్మలేకపోయా….ఎందుకంటే తను నిద్రొస్తుందని పైకెక్కిందా లేక లైనెయ్యడానికా………తెల్చుకోలేని పరిస్తితి.
ఎందుకంటే ఇందాక నే చూస్తున్నానని తెలిసి కూడా తన చూపు తిప్పకుండా నన్నె చూస్తుంది.ఇప్పుడు కూడా తను చూస్తుంటే నేనే తల తిప్పవలసోస్తుంది.తన కళ్ళలోకి సూటిగా చూడలేక పోతున్నాను. వీధుల్లో పులిలా తిరిగే మగవాళ్ళు ఇంట్లోకొచ్చేసరికి పిల్లిలా ఎందుకు మారతారో నాకాక్షణం తెలిసింది…నా ఆలోచనల్లొనుండి తేరుకొని మళ్లీ అటు చూశా.తనింకా నన్నే చూస్తుంది. తన చూపులో ఏదో శక్తి ఉందనిపించింది. ఇంతకు ముందు నేను కలిసిన ఆడాల్లలో లేని ఆకర్షణేదో తనదగ్గర ఉందనిపించింది.అప్పుడే ఫిక్సయ్యాను తననెలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని.ఇదంతా మమ్మల్ని కిందనుంచొకరు గమనిస్తున్నారని నాకప్పుడు తెలియదు. తననలా చూస్తూ ఎప్పడు నిద్ర పోయానో నాకేతెలియదు.
This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000