This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000
రాజా నీ తీసుకోని ఫ్లాట్ కీ వెళ్లిన తర్వాత మధు “అసలు ఎవడే వీడు ఇంతకీ ఇంటికి ఎందుకు తీసుకోని వెళ్లదాం” అన్నావు అని అడిగింది దానికి రీతిక ఇందాక డ్రైవింగ్ లో ఉంటే రాజా కీ హుస్సేన్ నుంచి ఫోన్ వచ్చింది అది రీతిక తీసింది “అల్లుడు ఆ గోపాల్ రెడ్డి మనుషులు నీ కోసం అన్ని హాస్పిటల్స్ దెగ్గర ఉన్నారు జాగ్రత్తగా ఉండు ”
అని అన్నాడు దాంతో రీతిక రాజా ఏదో డేంజర్ లో ఉన్నాడు అని అర్థం అయ్యింది అందుకే రిస్క్ వద్దు అని ఇంటికి తీసుకోని వచ్చారు ఆ తర్వాత రాజా తనకు ఎలా పరిచయం అని చెప్పింది దాంతో మధు ఒకసారి రాజా నీ చూస్తే అప్పుడు గుర్తు పట్టింది వాడు తన చిన్నప్పుడు స్కూల్లో ఫ్రెండ్ అని వెంటనే వాడి షర్ట్ చించి తన సర్జరీ కిట్ తో భుజం లో ఉన్న బుల్లెట్ తీసి కత్తి పోట్లు కీ కుట్లు వేసి తన దగ్గర ఉన్న ఒక injection ఇచ్చింది ఆ తర్వాత ఇద్దరూ వేరే రూమ్ లోకి వెళ్లి పడుకున్నారు మరుసటి రోజు ఉదయం వెళ్లి రాజా నీ చూశారు కానీ వాడు ఇంకా చలనం లేకుండా ఉన్నాడు దాంతో మధు వాడి పల్స్ చెక్ చేసి
“రీతు బ్లడ్ పోవడంతో వీడు కోమ్మా లోకి వెళ్లే ఛాన్స్ ఉంది అర్జెంటు గా వీడిని హాస్పిటల్ కి షిఫ్ట్ చేయాలి” అని చెప్పింది కాకపోతే హాస్పిటల్ కీ వెళ్లితే రిస్క్ అని అర్థం అయిన రీతు ముందు వద్దు అని చెప్పింది కాకపోతే మధు నేను ముందు వెళ్లి తన హాస్పిటల్ లో పొజిషన్ చూసి ఫోన్ చేస్తా ఆ తర్వాత వాడిని తీసుకోని రమ్మని చెప్పింది, మధు హాస్పిటల్ కీ వెళ్లే దారిలో పోలీసులు ఫుల్ గా ప్రతి బండి చెక్ చేసి పంపిస్తున్నారు అందరి దెగ్గర రాజా ఫోటో ఉంది దాంతో మధు రీతు కీ ఫోన్ చేసి బయట పొజిషన్ గురించి చెప్పింది, దాంతో మధు హాస్పిటల్ కీ వెళ్లి రాజా డ్రైవింగ్ లైసెన్స్ లో ఉన్న బ్లడ్ గ్రూప్ గురించి ఫోన్ చేసి కనుకోని ఆ బ్లడ్ తీసుకోని వేరే మందులు తీసుకోని ఇంటికి వచ్చింది ఆ తర్వాత రాజా కీ బ్లడ్ ఎక్కించి కొన్ని injections, టాబ్లేట్స్ ఎలా ఎప్పుడు ఇవ్వాలి అని చెప్పి తిరిగి హాస్పిటల్ కీ వెళ్లింది మధు.
అలా సాయంత్రం వరకు రాజా లేవలేదు తరువాత రీతు అదే రూమ్ ల్ laptop లో ఏదో యాక్షన్ సినిమా చూస్తూ ఉంది అందులో గన్ పేలిన శబ్దం తో ఉలికిపాటు తో లేచి కూర్చున్నాడు రాజా ఆ తర్వాత రాజా ఒక వేళ లేస్తే ఒక injection ఇవ్వమని చెప్పింది అది ఇవ్వగానే రాజా బాగా ప్రశాంతంగా పడుకున్నాడు, ఆ తర్వాత మధు కీ ఫోన్ చేసి చెప్పింది రీతు అప్పుడు మధు “వాడు గట్టోడే మామూలుగా అయితే ఎవడైనా చస్తాడు, లేదా కోమ్మా లోకి పోతారు వీడు బ్రతకడం మనకు పెద్ద రిలీఫ్ ఏదైనా అయ్యి ఉంటే మనం జైలుకు వెళ్లాల్సి వచ్చేది సరే ఇంటికి వస్తున్న వాడిని పడుకోని” అని చెప్పి ఫోన్ పెట్టేసింది,
ఆ తరువాత ఇద్దరు భోజనం చేసి మరుసటి రోజు రాత్రికి ఇంటికి వెళ్లాలి అని బస్ టికెట్ బుక్ చేస్తుంటే రావడం లేదు రీతు కీ అప్పుడే టివి లో మన మోడీ గారు “ఈ రోజు రాత్రి నుంచి ఏప్రిల్ 14 వరకు దేశం కంప్లీట్ లాక్ డౌన్ అవుతుంది ” అని చెప్పారు దాంతో మధు, రీతు ఇద్దరు ఒకరి మొహలు ఒకరు చూసుకోని రాజా ఉన్న రూమ్ వైపు చూశారు, మరుసటి రోజు ఉదయం రాజా నిద్ర లేచి బయటకు వచ్చి ఓళ్లు విరుచుకుంటు ఉన్నాడు కిచెన్ లో ఉన్న మధు రాజా నీ చూసి వాడు ఓళ్లు విరుచుకుంటు ఉంటే expand అయిన వాడి బాడి చూసి కూర లో ఉప్పు వేస్తూ అలాగే చూస్తూ ఉంది, ఇక్కడ ఫ్రీడ్జ్ దెగ్గర ఉన్న రీతు కూడా బాటిల్ లో నీలు తాగుతూ రాజా బాడి చూసి కను రెప్ప వేయకుండా అలాగే చూస్తూ నిలబడి ఉంది.(ఈ రెండు రోజులు వాడిని సరిగా చూడలేదు వాడి 6ft సిక్స్ ప్యాక్ బాడీ నీ ఒక గ్రీక్ దేవుడు నీ చేసినట్లు చూస్తున్నారు వాడిని ఇప్పుడు)
అప్పుడు రాజా రీతు వైపు చూసి చుట్టూ చూడడం మొదలు పెట్టాడు తరువాత ఓళ్లు విరిచినపుడు వాడి కుట్లు ఉడి నొప్పి రక్తం వచ్చింది దాంతో ఆరిస్తే మధు బయటికి వచ్చి చూసింది మధు నీ చూడగానే రాజా లోపలికి వెళ్లి తలుపు లాక్ వేసుకున్నాడు “రేయ్ ఎందుకు నేను అంటే ఇంకా భయపడుతున్నావు నేను నిన్ను చాలా రోజుల క్రితమే క్షమించేసా నేను లోపలికి రావాలి ప్లీజ్ తలుపు తీయి”
అని చెప్పింది మధు దాంతో రాజ భయం తోనే తలుపు తీసాడు ఆ తర్వాత మధు వాడిని కూర్చోమని చెప్పి కుట్లు వేసి బాడి క్లీన్ చేసింది ఆ తర్వాత రీతు కూడా వచ్చి జరిగింది చెప్పి అసలు ఏమీ జరిగింది అని అడిగింది దాంతో రాజా మొత్తం చెప్పాడు జరిగింది విన్న తర్వాత “ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్లలేవు నీ కోసం కూడా ఎవరూ రారు నువ్వు ఇక్కడే సేఫ్ రెస్ట్ తీసుకో తరువాత మాట్లాడుకుందాం” అని చెప్పి రీతు మధు తో కలిసి బయటికి వచ్చింది ఇద్దరు తలుపుకు అనుకోని “he is hot, he is sexy”
అని ఒకేసారి అన్నారు దాంతో ఇద్దరు ఒకరి వైపు ఒకరు కొంచెం కోపంగా చూసుకున్నారు అప్పుడే రీతు కీ రాజీవ్ (తన కాబోయే భర్త) నుంచి ఫోన్ వచ్చింది కానీ కట్ చేసింది, ఈలోగా మధు కిచెన్ లోకి వెళ్లి రాజా కీ ఇష్టం అని క్యారెట్ హల్వా చేసి రాజా ఫ్రెష్ అయ్యి వచ్చాడు అప్పుడే దాంతో మధు “రేయ్ నీకు ఇష్టం అని క్యారెట్ హల్వా చేశాను పైగా ఇప్పుడు నీకు బ్లడ్ కూడా కావాలి కదా” అని ఇచ్చింది ఇది అంతా సోఫా లో కూర్చుని చూస్తున్న రీతు కొంచెం కుళ్లుకుంది అప్పుడు రాజా గోడ పైన రీతు ఇద్దరు లేడీస్ తో దిగిన ఫోటో చూస్తూ
రాజా : మా శారదా పిన్ని ఫోటో ఏంటి ఇక్కడ నీకు వాళ్లు తెలుసా
రీతు : మా నాన్న వాళ్ల కజిన్ సిస్టర్ అంటే ఆనంద్ మామ నీకు బాబాయ్ ఆ
రాజా : అవును మా నాన్న సొంత తమ్ముడూ ఆనంద్
రీతు : అంటే వెంకట్ మామ కొడుకు ఆ నువ్వు అంటే నువ్వు నాకూ
రాజా : బావ
ఇలా వాళ్లు మాటలాడుకోవడం చూసి మధు కూడా కుళ్లుకుంది రాజా తనకు బావ అని చెప్పేసరికి తన రూట్ క్లియర్ అని అర్థం అయ్యింది రీతుకు.
ఇది ఇలా ఉంటే ఊరిలో యాదవ్ కీ ఎవరో ఫోన్ చేశాడు “సార్ ఇప్పుడు ఆ ల్యాండ్ నీ మనం ఏమి చేయలేము మా రెడ్డి కూడా పాయ పైగా లాక్ డౌన్ అంట ఒక నెల ఆగండి ఆ నా కొండె నీ ఆడి కుటుంబం నీ తెచ్చి సంతకాలు పెట్టిస్తా” అని ఎవరికో ఫోన్ చేశాడు ఇది అంత గోపాల్ రెడ్డి ఫోన్ ట్రాపింగ్ లో వింటూ ఉన్నాడు.
ఇండియా లో ముఖ్యంగా తెలంగాణా లో అధిక కరోనా కేసులు రావడం మొదలైన రోజులు అవి మధు డాక్టర్ కావడంతో తనకి ఒక టీం ఇచ్చి లీడ్ చేయమని చెప్పారు దాంతో మధు 24 గంటల పాటు హాస్పిటల్ కరోనా పేషెంట్స్ మధ్య తిరుగుతూ భోజనం, కనీసం మంచి నీళ్లు కూడా తాగలేని పరిస్థితుల మధ్య ఉంది ఈ గ్యాప్ లో రీతు తనకు రాజా మీద మొదలైన క్రష్ నీ ప్రేమ, పెళ్లి దాక ఎలా తీసుకోని వెళ్లాలి అని రోజుకు ఒక అటెంప్ట్ చేయడం మొదలు పెట్టింది కాకపోతే రాజా మాత్రం మధు కీ ఫోన్ చేసి తన concern చూపించేవాడు దాంతో మధు రాజా తనని ఇష్టపడుతున్నాడు అని భ్రమ లో పడింది ఇలా రోజూ రాజా పక్కన ఉన్న తనని కాకుండా మధు మీద ధ్యాస పెట్టడం తో కోపం వచ్చిన రీతు మధు కీ ఫోన్ చేసింది
రీతు : ఏంటి నువ్వు ఒక్కదానివే కష్టపడుతున్నట్లు వాడి ముందు బిల్డ్ అప్ ఇస్తున్నావ
మధు : హే ఏమీ మాట్లాడుతున్నావు బ్రైన్ ఉందా అసలే చాలా చిరాకు లో ఉన్న డిస్టర్బ్ చేయకు రీతు
రీతు : అవునే నాకూ బ్రైన్ లేదు వచ్చి రిపేర్ చేస్తావా
మధు : సరే ఇక్కడి దాక వచ్చింది కాబట్టి ఇంక ఆగేది లేదు నేను ఇంటికి వస్తున్న వాడినే అడుగుదాం sanitizer లు బయట పెట్టు అని చెప్పి ఫోన్ పెట్టేసి u ఇంటికి హడావిడి గా వచ్చింది మధు.
తరువాత బయట అంతా క్లీన్ చేసుకొని స్నానం చేసి వచ్చి రాజా కోసం చూసింది కాకపోతే రాజా ఫోన్ పట్టుకొని షాక్ అయ్యి కూర్చున్న రీతు దగ్గరికి వెళ్లి ఆ ఫోన్ లోకి చూసింది మధు అందులో రాజా ఎవరో అమ్మాయితో కలిసి ఉన్న ఫోటో లు చూసి రీతు తో పాటు మధు కూడా షాక్ అంతకంటే ముఖ్యంగా గా వాళ్లు ఇద్దరు lip to lip కిస్ చేసిన ఫొటో చూసి ఇంకా షాక్ అయ్యారు అప్పుడే రాజా లోపలీ నుంచి బయటకు ఫోన్ వెతుక్కుంటూ వచ్చాడు అప్పుడు రీతు చేతిలో తన ఫోన్ చూసి అడిగి తీసుకున్నాడు అప్పుడు తన ఫొన్ లో ఉన్న
అమ్మాయి చూసి నవ్వుతూ లోపలికి వెళ్లుతుంటే మధు “రాజ్ ఎవరూ ఆ అమ్మాయి” అని అడిగింది, దానికి రాజా నవ్వుతూ “నా ex గర్ల్ ఫ్రెండ్” అని చెప్పాడు దానికి మధు, రీతు ఇద్దరు ఊపిరి పీల్చుకున్నారు “అవునా బ్రేక్ అప్ ఎందుకు అయ్యింది బావ” అని అడిగింది రీతు “తను చనిపోయింది నిజం ఏంటి అంటే వాళ్ల అమ్మ నాన్నే తనని చంపేసారు” అని నవ్వు చెదరకుండా చెప్పాడు దానికి మధు “అసలు ఏమీ జరిగింది” అని అడిగింది.
“తన పేరు హారిక డిగ్రీ లో నా పక్క బ్రాంచ్ కాలేజీ మొదటి రోజే welcome ceremony లో ప్రిన్సిపల్ స్పీచ్ కట్ చేసి పాటలు పెట్టి స్టేజీ మీద డాన్స్ చేశాను దాంతో కాలేజీ లో ఫాలోయింగ్ పెరిగింది అందులో ఒక అమ్మాయి నాతో ప్రేమలో పడింది రోజు నా బైక్ దెగ్గర లెటర్ పెట్టేది రోజు ఆ లెటర్ చదవక పోతే నేను ఉండలేను అనే లాగా నను తన కళ్లలో ఎలా కనిపిస్తున్నానో రాసి పెట్టేది తనకు లేని ధైర్యం నాలో చూసి మెల్లగ నాలాగే అవ్వడం మొదలు పెట్టింది ఒక రోజు కాలేజీ లో ట్రేడిషనల్ డే అప్పుడు తను ఒక పింక్ కలర్ లంగా ఓణీ లో నడుము కింది దాక ఉయ్యాల ఊగుతున్న జడ తో అటు ఇటు తిరిగిన డిస్టర్బ్ కానీ నా గుండె తన
ఒక కంటి చూపు సూటిగా నా వైపు విసిరి ఎలా ఉన్నా అన్నట్లు కను రెప్ప ఎగురవేసింది ఆ ఒక చూపు తో నా చిన్ని గుండె అదుపు తప్పింది ఆ రోజు తనను క్లాస్ రూమ్ లోకి లాగి కిస్ చేశా తను కూడా నను ఆపాలని అనుకోలేదు నను వదిలీతే ఉండలేదు అన్నట్లు నను గట్టిగా కౌగిలించుకుంది, ఆ తర్వాత నుంచి మా ప్రేమ కథ మొదలు అయ్యింది మా నాన్న పిసినారితనం గురించి నీకు తెలుసు కదా మధు ఒక రూపాయి కూడా ఇచ్చే వాడు కాదు అలా ఫ్రెండ్స్ తో బయటకు వస్తే ఎప్పుడు నా బిల్ కూడా అందరి ముందు కట్టెది నను ఎప్పుడు ఎక్కడ డౌన్ ఫాల్ కానీవలేదు, తన అమ్మ నాన్న కూడా స్టీరిక్ట్ అయిన నాతో ఉంటే భయం లేదు అని చెప్పేది ఇంత అద్భుతంగా సాగిపోతున జీవితం లో ఒకే ఒక్క తప్పు చేశా ఫైనల్ ఇయర్ అయిపో వచ్చింది తన బర్త్ డే కూడా వచ్చింది అదే రోజు నేను వాళ్ల ఇంటికి వెళ్లి మా ప్రేమ విషయం చెప్పా వాళ్ల నాన్న నను పైనుంచి కిందకు చూసి ఒకటే ప్రశ్న వేశాడు నా కులం ఏంటి అని చెప్పాను దాంతో ఆయన నవ్వి వాళ్ల కుక్క నీ పిలిచి దానికి
ఒక biscuit వేసి దాని బ్రతుకు నా బ్రతుకు ఒకటే అన్నట్లు మాట్లాడాడు ఆ తర్వాత నాకూ కోపం వచ్చి నా ముందు ఉన్న కాఫీ తీసి వాడి మొహం మీద కోటా దాంతో వాళ్లు నను బయటికి తోసి హరిక నీ హౌస్ అరెస్ట్ చేశారు, ఆ క్షణం నువ్వు ఉంటే బాగుండు అనిపించింది మధు అరె నా బాధ అర్థం చేసుకునే నా బెస్ట్ ఫ్రెండ్ లేదు కానీ తన నమ్మకం నేనే కదా పాడు చేశాను అన్న బాధ, హరిక లేదు అనే కోపంతో ఒకడి నే బ్రతికే వాడిని బాధ షేర్ చేసుకునే ఫ్రెండ్స్ లేరు, నీకు గుర్తుందా మధు ఆ రోజు మన స్కూల్ లో జరిగిన గొడవ తరువాత నేను నిద్ర పోతున్న టైమ్ లో నా సొంత అమ్మ నాన్న నను చంపాలీ అని ప్రయత్నం చేశారు ఎక్కడ పరువు పోతుందో అని అందుకే అప్పటి నుంచి నా ఫ్యామిలీ తో కూడా నా భావాలు పంచుకోవడం మానేశా,
ఫైనల్ ఎగ్జామ్స్ కీ కూడా హరిక రాలేదు ఎగ్జామ్స్ అయిపోయిన వారం కీ పేపర్ లో హరిక చనిపోయిన వార్త వచ్చింది నాకూ తెలుసు తను ఆత్మహత్య చేసుకున్నే పిరికిది కాదు అయిన ఎగ్జామ్స్ రాయని అమ్మాయి ఎగ్జామ్స్ లో ఫెయిల్ అవుతా అనే భయం తో ఎందుకు ఆత్మహత్య చేసుకుంటుంది కానీ ఏమీ చేయలేని పరిస్థితి అలా ఒంటరి జీవితం కీ అలవాటు పడ్డా కానీ తను ఈ ఫోన్ మేమొరి లో నా హార్ట్ మేమొరి లో ఎప్పటికీ ఉంటుంది నేను తనని ఎప్పుడు మిస్ అవ్వను ” అని చెప్పి రూమ్ లోకి వెళ్లి పడుకున్నాడు.
అంత విన్న తర్వాత రీతు, మధు ఇద్దరికి కళ్లలో నీళ్లు తిరిగాయి మధు రీతు వైపు చూసి “మన అమ్మాయిలు ఎప్పుడైనా అబ్బాయి తో క్లోజ్ గా ఉంటే వాళ్లు మన స్నేహం నీ ప్రేమ అని ఎలా అనుకుంటారో వాడు ఎప్పుడు నను ఒక ఫ్రెండ్ లాగా బావించి నా మీద concern చూపిస్తుంటే నేను దాని ప్రేమ అనుకోవడం కూడా అంతే తప్పు అని అర్థం అయ్యింది నేను ఎప్పటికీ వాడు కోరుకునే మంచి ఫ్రెండ్ గానే మిగిలిపోతా అదే వాడు నా మీద చూపించే ఆప్యాయత కీ నేను ఇవ్వగలీగే గొప్ప స్నేహ కనుక so don’t worry babe నీ రూట్ క్లియర్ ” అని చెప్పి వెళ్లింది దాంతో రాజా గతం తెలిసిన తరువాత ఆ రోజు ఎందుకు అలా ఉన్నాడు ఎందుకు అంత చిరాకు లో ఉన్నాడు ఆ కోపం ఎందుకు అని అర్థం అయ్యింది రీతు కీ అప్పటి నుంచి నిజంగా రాజా నీ ప్రేమించడం మొదలు పెట్టింది.
This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000