డిటెక్టివ్ చంద్రశేఖర్ 3

This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000

థామస్ తన తండ్రి దేవరాజ్ కీ బర్త్ డే tribute ఇస్తుంటే అప్పుడే హీరో రవి కిషోర్ భార్య వనిత వచ్చింది ఒక బొకెట్ తీసుకోని వచ్చింది తనని చూడగానే థామస్ కేక్ కింద పెట్టి ఆమె దగ్గరికి పరిగెత్తుతూ వెళ్లి అమ్మ అని కౌగిలించుకున్నాడు, ఆమె కూడా థామస్ నీ దగ్గరికి తీసుకోని ముద్దు పెట్టింది ఆ తర్వాత ఇద్దరూ కలిసి కేక్ కట్ చేసి నివాళి అర్పించారు ఆ తర్వాత వనిత తన కొడుకును దగ్గరికి తీసుకోని “ఈ రోజు మీ అప్ప బర్త్ డే ఈ రోజే రవి కీ చివరి రోజు కావాలి నేను రాత్రికి సెక్యూరిటీ మొత్తం తగ్గిస్తా నువ్వు నీ పని కానీవ్వు” అని చెప్పి తన కొడుకు కీ కొత్త బైక్ తాళం ఇచ్చి నుదుటి పైన ముద్దు పెట్టి వెళ్ళిపోయింది, అక్కడ శేఖర్ దివ్య ఫోన్ లో తనని చంపడానికి వాడిన రిమోట్ కంట్రోల్ గన్ simulation చూశాడు అది పక్క ప్లాన్ తో చేశారు అని అర్థం అయ్యింది దాంతో వీళ్లు తన ప్రతి అడుగు తెలుసుకుంటున్నారు అని అర్థం అయిన శేఖర్ వెంటనే ఒక ప్లాన్ చేశాడు దాంతో చందన నీ కృష్ణ దెగ్గర ఉండమని చెప్పి రాత్రికి తిరిగి వస్తా అని చెప్పి వెళ్లిపోయాడు, అటు నుంచి ఎయిర్ పోర్ట్ కీ టాక్సీ లో వెళుతూ తన ఫోన్ లో ఒక నెంబర్ కీ ఫోన్ చేశాడు “హలో సౌమ్య నేను బెంగళూరు వస్తున్న నన్ను పిక్ అప్ చేసుకో” అని ఫోన్ పెట్టేసి బెంగళూరు ఫ్లయిట్ ఎక్కి వెళ్లాడు.

ఇంటికి వెళ్లిన తర్వాత వనిత తన అల్మారా లో దాచి పెట్టిన తన పాత ఆల్బం తీసి అందులో దేవరాజ్ ఫోటో చూసింది తనలో గతం తాలూకు జ్ఞాపకాలు తనుకుంటు బయటికి వచ్చాయి.

(1990)

చెన్నై లో ఒక ప్రసిద్ధి చెందిన ప్రొడక్షన్ సంస్థ లో మొదటి సారిగా అడుగు పెట్టింది వనిత అప్పటి వరకు తను ఒక సాధారణ భరతనాట్యం డాన్సర్ ఒక రోజు తన ప్రదర్శన చూడడానికి వచ్చిన ఒక గొప్ప దర్శకుడు ఆమె నాట్యం కీ మెచ్చుకోని అయన తీస్తున్న ఒక సినిమా లో చిన్న పాత్ర కీ అవకాశం ఇచ్చారు కానీ ఆమె అభినయం నచ్చి ఆమెను హీరోయిన్ గా ఫైనల్ చేశారు అప్పటి వరకు ఆమెకి సినిమా లో హీరో ఎవరు అన్నది తెలియలేదు అప్పుడే దేవరాజ్ రావడం చూసి ఆమె షాక్ అయ్యింది అతను చేసే విలన్ పాత్ర ఎప్పుడు క్రూరముగా, అమ్మాయిల పట్ల అసభ్యంగా ఉంటుంది అవి చూసి అతని అందరూ అసహ్యించుకునే వాళ్లు కానీ అతని గురించి తెలియనిది ఏంటి అంటే ఆ సిన్స్ తీసిన తరువాత అతను అందరి దగ్గరికి వెళ్లి క్షమాపణలు చెప్తాడు అంత మంచి గుణం అతనికి ఉంది అని ఎవరూ బయట చెప్పుకోరు తన మీద ఉన్న నెగిటివ్ టాక్ మొత్తం పోగొట్టుకోవడానికి ఈ సారి మంచి క్లాస్ హీరో సినిమా తీయాలని ఈ సినిమా కీ వచ్చాడు.

మొదటి రోజు అతని చూసి పారిపోయింది వనిత దాంతో రెండో రోజు డైరెక్టర్ కొంచెం మాట్లడి తీసుకోని వచ్చాడు కానీ అతని చూస్తే ఆమెకి జుగుప్సాకరంగా ఉంది ఆ రోజు మొదటి సిన్ రొమాంటిక్ సిన్ వాళ్లు ఇద్దరు కలిసి జలపాతం దెగ్గర రొమాంటిక్ గా మాట్లాడు కోవాలి అది సిన్ కానీ వనిత కీ మాత్రం అతనితో పాటు చేయడానికి ఇష్టం మనసు రావడం లేదు దాంతో తన బాధ అర్థం చేసుకున్న దేవరాజ్ ఆ రోజు తనకి బాగాలేదు రేపు పెట్టుకుందాం షూటింగ్ అన్నాడు అలా వాళ్లు తిరిగి హోటల్ కీ వెళ్ళుతుంటే పెద్ద వర్షం అప్పుడు యూనిట్ వన్ ఎదురుగా ఒక కార్ వచ్చింది అప్పుడు ఆ కార్ అదుపు తప్పి పక్కనే లోయలో పడే వరకు వెళ్లి ఆగింది అందులో ఉన్న ఒక ఆవిడ రోడ్డు మీద పడితే తన నాలుగు సంవత్సరాల కొడుకు మాత్రం ఇంకా కార్ లోనే ఉన్నాడు అది చూసిన దేవరాజ్ వెళ్లి ఆ అబ్బాయ్ నీ కాపాడాడు అప్పుడు తెలుసుకుంది దేవరాజ్ లో ఉన్న మంచితనం గురించి వనిత మెల్లగా తనకు తెలియకుండానే దేవరాజ్ తో చనువుగా ఉండటం మొదలు పెట్టింది.

దేవరాజ్ ఎప్పుడు విలన్ గా చేసిన బయటి జనం అసహ్యించుకున్న సినిమా వాళ్ళు మాత్రం అతని నటన నీ మెచ్చుకున్నేవారు ఇలాగే ఉంటే తన ఉనికి పోతుంది అని భావించిన అప్పటి లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న రవి కిశోర్ రైటర్స్ తో దేవరాజ్ కీ ఎప్పుడు సైకో కారెక్టర్ లు వచ్చే లాగా కథలు రాయమని చేప్పేవాడు దాంతో పాటు వనిత ఫోటో లు చూసి తన మీద మోజు పెంచుకున్నాడు దేవరాజ్ నటన ముందు తన ప్రతిభ పనికి రాదు అని తెలిసి పైగా హీరోగా చేస్తున్నాడు అని తెలిసి ఆ సినిమా ప్రొడ్యూసర్ కనకారావు (D.K. రావు) కీ డబ్బు ఇచ్చి ఆ సినిమా రీలు మొత్తం స్టూడియో లో షాక్ సర్క్యూట్ లో తగలబడిపోయింది అని నమ్మించి ఆ సినిమా తెలుగు రైట్స్ కొని వనిత హీరోయిన్ గా తను హీరో గా చేశాడు రవి కిషోర్ దీని గురించి దేవరాజ్ ఏమీ అనలేదు తన పని తాను చేసుకుంటూ వెళ్ళుతున్నాడు.

ఆ సినిమా హిట్ అయ్యింది దాంతో వనిత కీ తెలుగు లో అవకాశాలు రావడంతో చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చింది తను మెల్లగా దేవరాజ్ తో ప్రేమలో పడింది దేవరాజ్ కూడా వనిత తో ప్రేమలో పడ్డాడు ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు సరిగ్గా నిశ్చితార్థం ముందు రోజు ఇద్దరు ఒకటే సినిమా లో హీరోయిన్ గా విలన్ గా చేస్తున్నారు డబ్బింగ్ చెప్పడానికి వెళ్లి లేట్ అయ్యి ఇంటికి వచ్చే సరికి చీకటి వర్షం దాంతో వనిత ఆ రాత్రి దేవరాజ్ తో అక్కడే ఉంది అలా రొమాంటిక్ వాతావరణంలో ఇద్దరు ఒకటి అయ్యారు, దేవరాజ్ గురించి వనిత ఇంట్లో మంచి అభిప్రాయం లేదు వాళ్లు మొహమాటం గానే పెళ్లికి ఒప్పుకున్నారు, దేవరాజ్ ఎవరూ లేరు ఉన్నది తన చిన్నప్పటి బెస్ట్ ఫ్రెండ్ జేమ్స్ అతని భార్య మెర్సీ జేమ్స్ కూడా పెద్ద కమెడియన్ సినిమా లో నిశ్చితార్థం జరుగుతుండగా పోలీసులు వచ్చి దేవరాజ్ ఇంట్లో డ్రగ్స్ పట్టుకున్నారు ఆ తర్వాత వనిత ఫ్యామిలీ నిశ్చితార్థం కాన్సిల్ చేసుకున్నారు అవమానం భరించలేక దేవరాజ్ ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇది జరిగిన తరువాత రవి కిషోర్ ముసలి కన్నీరు కారుస్తు వనిత అమ్మ నాన్న నీ తన తో పెళ్లి కీ ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు ఒక రోజు తను గర్భవతి అని తెలుసుకున్న వనిత చెన్నై కీ వెళ్లాలి అనుకుంది కారణం అది దేవరాజ్ బిడ్డ అని తనకి తెలుసు abortion చేయించాలి అని అనుకుంది కాకపోతే వాతావరణం సరిగా లేదని ఫ్లయిట్ కాన్సిల్ అయితే ఇంటికి వచ్చింది అప్పుడు గార్డెన్ లో రవి, DK ఇద్దరు దేవరాజ్ జీవితం ఎలా నాశనం చేశారో తాగి వాగాడం విన్న వనిత ఆ రోజు రాత్రి హోటల్ లో రూమ్ తీసుకోని రాత్రి అంతా ఏడుస్తు ఉంది దాంతో ఈ బిడ్డను కని ప్రపంచానికి తెలియకుండా పెంచాలి అని నిర్ణయం తీసుకుంది డెలివరీ అయ్యాక బిడ్డ చనిపోయాడు అని ప్రపంచానికి నమ్మించి జేమ్స్ దెగ్గర ఉంచి పెంచి వాడికి అన్ని చెప్పి పెంచింది ఇప్పుడు పగ తీర్చుకోవడం మొదలు పెట్టింది.

అలా తన గతం తలచుకొని ఈ రోజు తో తన ప్రియుడి ఆత్మ శాంతి కోసం తన భర్త చావు కబురు వినాలి అని ఎదురు చూస్తోంది.

దేవరాజ్ కీ ఎప్పటి నుంచో ఒక కళ ఉంది టాలెంట్ ఉండి అభివృద్ధి లోకి రాలేని పేద పిల్లలకు యాక్టింగ్ స్కూల్ పెట్టి వాళ్ళని తీర్చిదిద్దాలి అని అందుకే తన ఇంటి కార్ గ్యారేజ్ లోనే ఒక హాల్ లాగా తయారు చేసి స్కూల్ పెట్టాలి అని అనుకున్నాడు కానీ అది నెరవేరక ముందే తను చనిపోయాడు, ఆ తర్వాత జేమ్స్ తన స్నేహితుడు కోసం తనే ఒక స్కూల్ మొదలు పెట్టాడు తనకు పిల్లలు లేకపోవడంతో తరుణ్ నీ (థామస్ అసలు పేరు) దత్తత తీసుకుని పెంచి మంచి హీరో చేయాలి అనుకున్నాడు కానీ పేరు మార్చిన, పెంపకం మారిన రక్తం లో కలిసిన విలన్ అనే గుర్తింపు మాత్రం మారలేదు అందుకే స్కూల్ లో తనతో పాటు కోచింగ్ తీసుకుంటూ ఉన్న దివ్య DK ఇంట్లో పని చేస్తోంది అని తెలిసి తనకు దెగ్గర అయ్యాడు థామస్ మెల్లగా దివ్య నీ ప్రేమ లో పడేశాడు దాంతో థామస్ ప్రేమ నిజం అని నమ్మిన దివ్య DK తనతో ప్రవర్తించే తీరు అప్పుడప్పుడు రూమ్ లోకి పిలిచి రేప్ చేయడం అవి వీడియో తీసి బ్లాక్మెయిల్ చేయడం గురించి చెప్పింది దాంతో థామస్ దివ్య నీ అడ్డుపెట్టుకోని DK నీ చంపాలీ అని ప్లాన్ చేశాడు రోజు సాయంత్రం దివ్య DK కుక్కని వాకింగ్ కోసం తీసుకోని వచ్చేది అదే టైమ్ లో థామస్ కూడా అదే పార్క్ కీ వచ్చి రోజు దానికి చికెన్ ముక్కలు వేసి మంచిగా చేసుకున్నాడు అది వాడి మాట వినడం మొదలు పెట్టగానే దానికి రోజు ట్రైనింగ్ ఇవ్వడం మొదలు పెట్టాడు థామస్ ముందు దాని టైమ్ కీ alert అవ్వడం నేర్పించాడు, ఆ తర్వాత మెల్లగా DK ఫోటో చూపించి దాని మీద ఎటాక్ చేయమని చెప్తే అది ఫోటో నీ నాకడం మొదలు పెట్టింది.

దాంతో ఏమీ చేయాలో అర్థం కాక ఉన్న థామస్ కీ ఒక ఐడియా వచ్చింది DK వాడే perfume నీ దివ్య నీ కొట్టుకోని రమ్మని చెప్పి ఆ కుక్క కీ కళ్లకు గంతలు కట్టి ఆ Perfume వాసన చూపించి ఆ తర్వాత టైమ్ సెట్ చేసి థామస్ గొంతుతో దానికి ఎటాక్ అని చెబితే అది దివ్య మీదకు వెళ్లేది అప్పుడు థామస్ దాని స్టాప్ అంటే ఆగిపోతుంది ఇక్కడ రెండు ఛాన్స్ లు ఉన్నాయి ఒకటి అది థామస్ గొంతు కీ అయిన ఎటాక్ చేయాలి లేదా perfume వాసన కావాలి అలా దానికి ట్రైనింగ్ ఇచ్చారు అలా ఆ రోజు DK కేరళ కీ షూటింగ్ కీ వెళ్ళుతున్నాడు అని తెలుసుకుని అక్కడ ఎటాక్ చేయిస్తే ప్రాబ్లమ్ ఉండదు అని ప్లాన్ చేసి 10 గంటల టైమ్ కీ దివ్య ఫోన్ చేసింది అప్పుడు థామస్ కూడా పక్కనే ఉన్నాడు వాళ్లు టైమ్ పన్నెండు గంటలకు పెట్టి కుక్క తో మాట్లాడాలి అని దివ్య అంటే DK కుక్క చెవి దగ్గర ఫోన్ పెట్టాడు దాంతో గడియారం శబ్దం perfume వాసన, థామస్ గొంతు ఒకేసారి రావడంతో కుక్క DK మెడ కొరికి చంపింది, కానీ వాళ్లు ఊహించని విషయం ఏంటి అంటే ఈ కేసు లోకి చంద్రశేఖర్ వస్తాడు అని ఆ రోజు రాత్రి చందన, శేఖర్ perfume వాసన గురించి మాట్లాడుతూ ఉండటం థామస్ విన్నాడు శేఖర్ అబ్బాయ్ ఆ Perfume వాడుతున్నాడు అని అనుకున్నాడు అని దివ్య తో ఆ బాటిల్ తీసుకోని రమ్మని చెప్పాడు అమ్మాయి మీద శేఖర్ కీ డౌట్ రాలేదు అనే ధైర్యం తో అలా చెప్పాడు కానీ శేఖర్ దివ్య నీ అడ్డంగా కనిపెట్టేసాడు దాంతో రవి కిషోర్ DK శవం చూసి వస్తుంటే గుంపులో నుంచి కాలు అడ్డు పెట్టి కింద పడేసి ఒక injection ఇచ్చాడు దాంతో కిషోర్ కీ హార్ట్ స్ట్రోక్ వస్తుంది అని అనుకున్నాడు ఆ తర్వాత దివ్య నీ అక్కడి నుంచి తప్పించి తీసుకోని వెళ్లిపోయాడు.

(ప్రస్తుతం)

థామస్ స్కూల్ లో లార్డ్ హెన్రీ డ్రస్ నీ తాకుతూ ఆ పాత్ర నీ తనలోకి తీసుకుంటూ ఉన్నాడు జేమ్స్ కీ అర్థం అయ్యింది వాడు విలన్ పాత్ర తప్ప ఇంకోటి చేయడు అని అందుకే ఇదే చివరి సారి మొదటిసారి అని వార్నింగ్ ఇచ్చి ఆ పాత్ర చేయడం కోసం ఒప్పుకున్నాడు జేమ్స్ డ్రామా ఈవెంట్ వాళ్ళకి ఇన్విటెషన్ లో వేయడానికి ఒక ప్రమోషన్ వీడియో కావాలి అని అడిగితే చందన నీ పిలిపించి షూట్ చేయిస్తున్నాడూ అప్పుడు థామస్ రాజు గెటప్ లో వచ్చి డైలాగ్ చెప్పడం మొదలు పెట్టాడు.

“you won’t deserve this world brother rest in paradise” అని చెప్పి కత్తి తో ఫాదర్ నీ చంపిన సిన్ రికార్డ్ చేసింది చందన.

అప్పుడే న్యూస్ లో దివ్య చనిపోయిన విషయం వస్తుంది దాంతో థామస్ షాక్ అయ్యాడు పైగా గన్ సెట్ చేసింది తనే కాబట్టి దాని పైన వేలు ముద్రలు ఉంటాయి అని భయపడి వెంటనే స్పాట్ కీ వెళ్లాడు అక్కడ పోలీసులు శవాన్ని తీస్తు ఉండగా థామస్ ఎవరికి కనిపించకుండా ఆ బిల్డింగ్ పైన ఉన్న సెల్ టవర్ ఎక్కి గన్ తీసి కిందకి దిగాడు గన్ నీ పార్ట్లు పీకి వేరు వేరు చోట్ల చెత్తకుండి లో పడేసి వెళ్లిపోయాడు.

అక్కడ శేఖర్ బెంగళూరు లో ల్యాండ్ అయ్యాడు అప్పుడు తనని పిక్ అప్ చేసుకోవడానికి వచ్చిన సౌమ్యా “ఇప్పుడు నువ్వు చేయబోయే పని ఎంత రిస్కో నీకు అర్థం అవుతుందా” అని అంది “నాకూ వేరే దారి లేదు ఇంతకు మించి ఇంకో బెటర్ ఆప్షన్ లేదు” అని కార్ ఎక్కాడు.

(అసలు శేఖర్ తీసుకున్న ఆ రిస్కీ ఆప్షన్ ఏంటి అనేది నెక్స్ట్ అప్డేట్ లో)

సౌమ్యా కార్ ఎక్కి “చూడు శేఖర్ నా లైఫ్ లో నువ్వు నాకూ చాలా పెద్ద సహాయం చేశావు అంతే కాకుండా నా కోసం జైలు కూడా వెళ్లావు కాదు అన్నను కానీ ఇప్పుడు తీసుకున్న నిర్ణయం చాలా రిస్క్ మళ్లీ ఒకసారి ఆలోచించుకో ఒకవేళ ఏదైనా తేడా జరిగితే అర్జున్ కీ నువ్వు కూడా ఉండవు” అని అంది దాంతో శేఖర్ “అవును అర్జున్ మొన్న టెస్టు లో 1st వచ్చాడు కదా ఫోన్ చెయ్యి మాట్లాడాలి ” అని అన్నాడు దాంతో సౌమ్యా తన ఫోన్ లో వీడియో కాల్ న్యూయార్క్ కీ చేసింది అక్కడ ఒక పెద్ద కంపెనీ లో చైర్మన్ శారదా, సౌమ్యా ఫోన్ తీసి “హే సిస్టర్ ఎలా ఉన్నావు ” అంటు సౌమ్యా నీ పలకరించీ తరువాత శేఖర్ వైపు చూసి “హే బేబి ఎలా ఉన్నావు ఇన్ని రోజులకు నేను గుర్తుకు వచ్చాన అసలు అర్జున్ ఎన్ని సార్లు అడిగాడో తెలుసా డాడీ ఎప్పుడు వస్తాడు అని ఫైనల్ గా ఈ రోజు ఫోన్ చేసావు ఉండు” అని చెప్పి అర్జున్ కీ కాన్ఫరెన్స్ కాల్ లో కలిపింది అప్పుడు అర్జున్ శేఖర్ నీ చూసి ఉత్సాహంగా “డాడీ నేను టెస్ట్ లో 1st వచ్చాను చూడు” అంటూ ప్రొగ్రెస్ కార్డ్ చూపించాడు దాంతో శేఖర్ సంతోషించాడు “నువ్వు చాంపియన్ నాన్న ఆంటీ కీ గిఫ్ట్ ఇచ్చాను నీకు పంపిస్తుందీ” అని చెప్పి ఫోన్ పెట్టేసాడు ఆ తర్వాత సౌమ్యా శేఖర్ వైపు చూస్తూ “ఈ సారి ఏమీ పంపించాలి బాబు మీ బాబు కీ ” అని అడిగింది దానికి శేఖర్ “గిటార్” అన్నాడు సరే అని సౌమ్యా కూడా తల ఆడించి కార్ నీ సెంట్రల్ జైలుకు తీసుకోని వెళ్లింది ఆ తర్వాత శేఖర్ ఒక సూట్కేస్ తీసుకోని లోపలికి వెళ్లి ఒక ఖైదీ నీ పలుకరించి వచ్చేసాడు ఆ తర్వాత సౌమ్యా శేఖర్ నీ ఒక హాస్పిటల్ కీ తీసుకుని వెళ్లింది అక్కడ ఉన్న డాక్టర్ తన లాకర్ నుంచి ఒక injection తీసి ఇచ్చింది దాని ఒక ఐస్ బాక్స్ లో పెట్టి తిరిగి ఎయిర్ పోర్ట్ కీ వెళ్లాడు సౌమ్యా జాగ్రత్త అని చెప్పి వెళ్లిపోయింది, శేఖర్ ఫ్లయిట్ లో కూర్చుని చందన గురించి తలచుకొని కళ్లు మూసుకున్నాడు.

(2014 బెంగళూరు)

ఒక కార్ వేగంగా హైవే మీద వెళ్తుండగా సడన్ గా డివైడర్ నుంచి ఒక లారీ వచ్చి కార్ నీ గుద్దింది బోల్తా పడిన కార్ లో నుంచి బయటకు వచ్చాడు శేఖర్ ఆ కార్ డ్రైవింగ్ సీట్ లో ఉన్న అతని బయటకు లాగాడు “కిరణ్ కళ్లు తెరచి చూడు, కిరణ్ కళ్లు తెరువు” అని మొహం మీద కొట్టి లేప్పడానికి చూశాడు కానీ కిరణ్ లో చలనం లేదు అప్పుడు వెనుక డ్రైవర్ సీట్ లో ఉన్న 8 నెలల గర్భిణి అయిన చందన నీ బయటకు లాగి “చందు కళ్లు తెరువు, చందు చూడు చందు” అని కొట్టి లేప్పడానికి చూసి ఏడుస్తూ ఉన్నాడు అప్పుడే వాళ్ళని గుద్దీన లారీ నుంచి ఒక 55 సంవత్సరాల వ్యక్తి మొహం మీద రక్తం కారుతుంది అయిన కూడా గన్ తీసుకోని శేఖర్ వైపు వచ్చాడు అతని రాక పసిగట్టిన శేఖర్ తన షూ లో ఉన్న సీక్రెట్ కత్తి తీసి వెనకు ఎగిరి ఆ వ్యక్తి గొంతులో కత్తి దింపాడు అతను అక్కడే చనిపోయాడు, కిరణ్ చెవిలో నుంచి రక్తం వస్తుంది అప్పుడే పోలీసులు, అంబులెన్స్ తీసుకోని వచ్చారు శారదా, సౌమ్యా చందన నీ హాస్పిటల్ కీ తీసుకుని వెళ్లుతున్నారు శేఖర్ నీ పోలీసులు తీసుకోని వెళుతున్నారు అప్పుడు స్ట్రెచర్ పైన ఉన్న చందన ఆరి కాలి వెనుక నుంచి రక్తం రావడం చూసిన డాక్టర్ లోపల బేబీ చనిపోయింది అని చెప్పడం విన్నాడు శేఖర్ దానికి గట్టిగా గుండెలు బాదుకుంటు ఏడిచాడు ఆ తర్వాత ఎయిర్ హోస్టెస్ వచ్చి శేఖర్ నీ లేప్పితే ఈ హడావిడి గా లేచి తన మొహం కీ అంటిన చెమట తుడుచుకొని హైదరాబాద్ వచ్చింది అని తెలుసుకొని కిందకు దిగాడు.

ఎయిర్ పోర్ట్ బయట కృష్ణ శేఖర్ కోసం ఎదురుచూస్తున్నాడు కృష్ణ నీ చూసి వెంటనే గట్టిగా కౌగిలించుకున్ని ఏడ్వడం మొదలు పెట్టాడు శేఖర్ “నిన్ను చాలా బాధ పెట్టాను మామ నన్ను క్షమించు” అని చెప్పి జీప్ ఎక్కాడు శేఖర్ కృష్ణ శేఖర్ వైపు చూస్తూ పిచ్చి ఎక్కిందా వీడికి అని అనుకోని జీప్ ఎక్కాడు ఆ తర్వాత శేఖర్ తన దగ్గర ఉన్న బాక్స్ లో నుంచి injection తీసి కృష్ణ కీ ఇచ్చాడు “మామ ఎప్పుడైనా చందన తల నొప్పి అని అన్న లేదా కళ్లు తిరిగి పడిపోయిన ఈ injection రెండు నిమిషాల్లో ఇవ్వు” అని చెప్పాడు, “అసలు ఏంటి రా ఇది ఏమీ జరుగుతుంది” అని అడిగాడు కానీ శేఖర్ మౌనంగా ఉండడం చూసి ఇంక ఏమీ అడగలేదు ఇద్దరు కలిసి హాస్పిటల్ కి వెళ్ళారు సెక్యూరిటీ తక్కువ ఉండటంతో అనుమానం వచ్చి శేఖర్ కృష్ణ తో అవసరం అయితే మెసేజ్ చేస్తా అని చెప్పి లోపలికి వెళ్ళాడు ఆ తర్వాత డాక్టర్ లాగా డ్రస్ వేసుకుని రవి కిషోర్ రూమ్ వైపు వెళుతుంటే సడన్ గా చందన వచ్చి శేఖర్ నీ పట్టుకుని “అసలు ఎక్కడికి వెళ్లావు పొద్దున ఫోన్ చేస్తే తగలలేదు” అని అడిగింది అప్పుడే శేఖర్ వాళ్ల నాన్న రావడంతో చందన నీ తీసుకోని పక్కనే ఉన్న రూమ్ లోకి వెళ్ళాడు, తలుపు చాటు నుంచి తన తండ్రి నీ చూస్తూ ఉండగా చందన శేఖర్ పెదవి పైన ముద్దు పెట్టింది దాంతో శేఖర్ చందన నీ ఇంకా దెగ్గర గా తీసుకోని పెదాలు జురుకున్నాడు ఆ తర్వాత కరెంట్ పోయింది దాంతో అనుమానం వచ్చిన శేఖర్ చందన నీ గట్టిగా కౌగిలించుకున్ని “I love you” అని చెప్పి రవి కిషోర్ రూమ్ వైపు వెళ్లాడు.

డోర్ వెనుక ఏదో నీడ ఉంది అని గమనించిన శేఖర్ ఆ తలుపు నీ వెనకు తోసి తన బరువు మొత్తం పెట్టి ఒత్తి పెట్టాడు తలుపు వెనుక దాకున్న థామస్ ఊపిరి ఆడక తలుపు నీ ముందుకు తోయడానికి చూశాడు అప్పుడే ఎవరో శేఖర్ తల పైన గట్టిగా ఫైర్ extinguisher తో కొట్టారు దాంతో శేఖర్ కింద పడ్డాడు అప్పుడు వనిత థామస్ నీ తీసుకోని వాడిని లిఫ్ట్ లో టాప్ ఫ్లోర్ కీ పంపించి అక్కడి నుంచి పారిపోయిందీ శేఖర్ మెట్లు ఎక్కి పై ఫ్లోర్ కి వెళ్ళాడు దారి లో కృష్ణ కీ మెసేజ్ పంపించాడు రెండు స్ట్రీట్ ల చివర ఒక బిల్డింగ్ దగ్గరికీ రమ్మని మెసేజ్ చేశాడు, కృష్ణ చందన నీ తీసుకోని జీప్ లో అక్కడికి వెళ్లుతున్నాడు అప్పుడు శేఖర్ బిల్డింగ్ ల పై నుంచి జంప్ చేస్తూ వెళ్లుతున్న థామస్ నీ వెంబడిస్తు వెళ్లాడు ఆ తర్వాత శేఖర్ మెసేజ్ చేసిన బిల్డింగ్ దగ్గరికి కృష్ణ చందన రాగానే వాళ్ల జీప్ పైన ఒక మనిషి పడ్డాడు ఇద్దరు కిందకి దిగి చూస్తే ఆ మనిషి శేఖర్ వాడి శరీరం నిండా బుల్లెట్స్ దిగి ఉన్నాయి కృష్ణ పల్స్ చూశాడు లేదు గుండె కూడా కొట్టుకోవడం లేదు శేఖర్ చనిపోయాడు అని అర్థం అయిన చందన గట్టిగా అరిచింది దాంతో కళ్లు తిరిగి పడిపోయింది అప్పుడు కృష్ణ తనకు శేఖర్ ఇచ్చిన injection గురించి గుర్తుకు వచ్చింది వెంటనే ఆ injection ఇచ్చి చందన నీ పోలీసులు వస్తున్నారు అని శేఖర్ శవం అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.

This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000