అర్జున్ Part 1

This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000

ఈ కథ పార్ట్ 2/3 లాగా అనుకోవాలి దీనికి ముందు కధ ARJUN REDDY అనే థ్రెడ్ లో ఉంటుంది ఆ కథ కి కంటిన్యూ గా ఈ కథ ని రాస్తున్నాను మా అన్నయ్య మొదలెట్టిన సంజయ్ రెడ్డి అనే కధ ని నాకు నచ్చిన విదంగా మార్చి రాయడానికి ఈ థ్రెడ్ మొదలెట్టాను

CHARACTERS

ARJUN [HERO] – Age 25,

FATHER – SANJAY REDDY, MOTHER – PREETI, SIBLINGS – 3 SISTERS

THEY ARE

1ST SISTER – PARINEETHA [PARI] – AGE 24

2ND SISTER – POORNIMA [POORI] – 24

3RD SISTER PRANEETHA – AGE 22

SIDE HERO – KARTHEEK – AGE 32, HIS WIFE RIYAA – AGE – 30

KARTHEEK’S SISTER – ANUPAMA (ANU)- AGE – 24 ARJUN’S NURSE – – AGE 21

లొకేషన్ ముంబై లీలవతి హాస్పిటల్

రూం నెంబర్ 1704, 3/6 బెడ్ పై ఒక అబ్బాయి వయసు సుమారు 25 ఉండొచ్చు ఆ పక్కనే ఒక భార్యాభర్తల జంట భర్త వయసు 30 కి ఎక్కువ భార్య వయసు 30 కి తక్కువ ఉండొచ్చు ఆ దంపతుల లో భార్య బెడ్ పై ఉన్న అబ్బాయి కుడి చేతిలో చెయ్యేసి తన నుదుటికి ఆనించుకుని బాధ పడుతుంది, భర్త తన భార్య కుడి భుజం పై చెయ్యేసి తనని ఓదారుస్తున్నాడు వాళ్లకు ఎదురుగా ఒక నర్స్ రెగులర్ చెక్ అప్ చేస్తూ ఉంది మరో రెండు నిమిషాలలో తన చెక్ అప్ పూర్తి చేసుకుని బైటికి వెళ్లిపోయిన నర్స్ తన మొహానికి ఉన్న మాస్క్ తీసి ఫ్రాక్ లోంచి హాంకీ తీసుకుని కళ్ళు తుడుచుకుని వేరే పేషెంట్స్ ని అటెండ్ చేయడానికి వెళ్ళిపోయింది ఇక్కడరూంలో నర్స్ వెళ్లిపోగానే మళ్ళీ ఏడుపు మొదలెట్టిన భార్యని ఓదారుస్తూ బెడ్ పైన పడున్న పేషెంట్ తో అరేయ్ ఇంకెన్ని సంవత్సరాలు ఇలా పడుంటావ్ రా ఒక్కసారి కళ్ళుతెరిచి మీ వదిన్ని చూడు ఒకటి కాదు రెండు కాదు ఆరు సంవత్సరాలుగా ఇలా నిద్రపోతూనే ఉన్నావ్ నీకు బోర్ కొట్టడం లేదా కళ్ళు తెరువరా ప్లీస్ అంటూ కుడి తొడ పై చేయి వేసి కదుపుతున్నాడు.

రెండు నిమిషాల తరువాత వార్డ్ బాయ్ వచ్చి ఆ జంట ని డాక్టర్ పిలుస్తున్నారు అని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు డాక్టర్ ఎదో రిపోర్ట్ చూస్తూ వీళ్లు రాగానే కం ఇన్ అని చూస్తున్న రిపోర్ట్ పక్కన పెట్టి టేక్ యూఅర్ సీట్ అంటూ లేచి ఎక్సరే చూడడానికి ఏర్పాటు చేసి పెట్టిన చోటుకి వెళ్లి దానిలో చూస్తూ ఆ జంట తో సీ మిస్టర్ మీరు బలవంత పెడుతున్నారని పేషెంట్ కి ఇంత కేర్ తీసుకుంటునం కానీ మాకైతే రిపోర్ట్ చూస్తుంటే పేషెంట్ లో ఇంప్రూవ్మెంట్ ఎం కనిపించడం లేదు ఆరేళ్ళ క్రితం జరిగిన సర్జరీ రిపోర్ట్ పరంగా ఆ సర్జరీ తన బాడీ పై తగిలిన దెబ్బలకి ఉపయోగ పడింది కానీ తల కు తగిలిన గాయానికి ఏ రకమైన సర్జరీ చేయలేదు దీన్ని బట్టి పేషెంట్ ప్రమాదం జరిగినప్పుడు ఎదో షాక్ లోకి వెళ్ళిపోయాడు తన బ్రెయిన్ అక్కడే ఆగిపోయింది అప్పటినుండి ఇప్పటివరకు తనకి స్పృహ రాలేదంటే ఇక మీదట కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పలేం తన బ్రెయిన్ డెడ్ అయ్యింది ఎదో ఒక మిరకల్ జరిగితే తప్ప మేమైతే ఏమి చేయలేం.

డాక్టర్ చెప్పినదంత విన్న జంట ఎంతో బాధతో డాక్టర్ ని వేడుకుంటున్నారు ఎలాగైనా తనని కాపాడమని కానీ డాక్టర్ దేవుడిపై భారం వేయండి కావలంటే పేషెంట్ ని మీరు ఇంటికి కూడా తీసుకెళ్లొచు అని చెప్తే సరే అని ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకుని ఒక నర్స్ ని ప్రైవేట్ గా మాట్లాడమని చెప్పి డిశ్చార్జ్ చేయించుకుని ఇంటికి తీసుకెళ్లడానికి బైటికి వచ్చారు వాళ్ళ వెనకే గత 4 ఏళ్ల గా పేషెంట్ ని తానే చేసుకుంటున్న నర్స్ కూడా వీళ్ళ తో పాటు కార్ ఎక్కింది ముందు భార్య భర్తల జంట వెనక నర్స్ ఒడిలో తల పెట్టుకు పడుకున్న పేషెంట్.

4 గంటల ప్రయాణం తరువాత ఒక ఇంటి గేట్ ముందు కార్ ఆగింది అక్కడే గేట్ దగ్గర ఉన్న సెక్యురిటి సహాయం తో కార్ డిక్కీ లో ఉన్న వీల్ చైర్ లో పేషెంట్ ని కూర్చోబెట్టి నర్స్ వెనక నుండి నెడుతూ ఉంటే తన వెనక ఆ జంట కొంత దూరం నడిచాక లిఫ్ట్ ఎక్కి 7 అంతస్తులు చేరాక ఫ్లాట్ నో 7042 డోర్ లాక్ తీస్తూ లోపలికి వెళ్లారు అందరూ లోపలికి వెళ్ళగానే లోపల నుండి డోర్ లాక్ వేసుకుంటూ ఒక బెడ్రూం లోకి వెళ్లి కాస్త సదిరి పేషెంట్ ని ముగ్గురు కలిసి బెడ్ పై పడుకోబెట్టి నర్స్ తో చూసుకో అని చెప్పి జంట బైటికి వస్తూ భర్త భార్య తో నేను ఇక ఆఫీస్ కి వెళ్తాను జాగ్రత్త ఏదన్నా ఎమర్జెన్సీ అయితే రిసెప్షన్ కి కాల్ చెయి అని ఇద్దరు తమ బెడ్రూం లో దూరి భర్త స్నానం చేసి రెడి అవుతుంటే భార్య మంచం పై బోర్లా పడి మళ్ళీ బాధపడుతూ ఉంది. భర్త స్నానం చేయి రెడి అయ్యాక తన భార్య ని ఉరుకో బెట్టి రూమ్ బైటికి వెచ్చి పేషెంట్ ఉన్న రూమ్ దగ్గరికి వచ్చి నర్స్ తో ఆఫీస్ కి వెళ్తున్న మేడం ని కూడా కాస్త చూస్తుండు అని వెళ్ళిపోయాడు.

నర్స్ ఆవిడ పడుకున్న రూంకి వచ్చి మేడం పేషెంట్ కి స్పాంజ్ బాత్ చేయించాలి కాస్త హాట్ వాటర్ ఎక్కడ ఉంటాయో చెప్తారా అని అడిగితే లేచి బాత్రూం లో ఒక బకెట్ లో హాట్ వాటర్ నింపి తీసుకో అంటూ తనకి ఇచ్చి నర్స్ బైటికి వెళ్లిపోగానే డోర్ వేసుకొని మళ్ళీ బెడ్ పై పడి ఎదో ఆలోచనల్లో పడింది.

ఫ్లాష్ బ్యాక్ 6 ఏళ్ల క్రితం ఎం జరిగింది

పెళ్లి రోజే హనీమూన్ కి బయలుదేరిన రియా ఇంకా కార్తిక్ నెల రోజులు ఎక్కడెక్కడో విదేశాలు తిరిగి తిరిగి ఇండియా కి తిరిగొచ్చాక తమని రిసీవ్ చేసుకోడానికి ఎవరన్నా వస్తున్నారా లేదా కనుక్కుందామని చూస్తే ఎవరి మొబైల్ కలవడం లేదు RGI ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యాక కూడా ట్రై చేస్తే ఎవరిదగ్గరా రెస్పాన్స్ లేదు దాంతో వాళ్లే టాక్సీ మాట్లాడుకుని విష్ణు ఇంటికి వచ్చారు చూస్తే ఇంటికి తాళం వేసి ఉంది బాగా దుమ్ము ఒట్టి చాలా రోజులుగా ఎవరు వాదనట్టు కనిపిస్తుంది ఆ చోటు అది చూసి కాస్త కంగారు పడ్డా అందరూ మామయ్య ఇంట్లోనే ఉండుంటారు అని రియా అనుకుని కార్తిక్ తో ఇంకో టాక్సీ మాట్లాడు సంజయ్ మామయ్య ఇంటికి వెళ్దాం అని చెప్తే అలాగే అంటూ సంజయ్ ఇంటికి వెళ్లారు ఇద్దరు.

అక్కడ కూడా ఎవరు కనిపించక పోవడం తో ఈసారి కాస్త భయం ఎసింది ఇద్దరికి చుట్టూ అంత కాళీ ఏరియా ఉండడం తో అక్కడ ఎవరినైనా అడుగుదామన్న వివరాలు ఏమి తెలియవు అని ఇప్పుడు ఎం చేద్దాం అని అనుకుంటుంటే అటు ఒక కెనెటిక్ హొండా లో ఒక ముసలోడు వస్తూ కనిపించే సరికి వాడిని ఆపి తాతయ్య ఒక్కనిమిషం మీరు ఇక్కడే ఉంటారా ఈ ఇంట్లో వాళ్ళు మీకు తెలుసా కాస్త తెలిస్తే ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారో చెప్పగలరా అని కార్తిక్ అడిగితే.

వాళ్ళని గుర్తు పట్టి బాబు గారు గోరం జరిగిపోయింది బాబు గారు చాలా అన్యాయం జరిగిపోయింది ఆ దేవుడు ఇంత కఠినాత్ముడు అనుకోలేదు బాబుగారు మొత్తం అందరిని కట్టకట్టుకు తోలుకుపోయాడు బాబుగారు అని వాళ్ళ కళ్ళ దగ్గర పడి ఏడుస్తూ అరుస్తున్నాడు.

తాతయ్య లే ఏంటిది ఒక్క ముక్క అర్థం కాలేదు అర్థమయ్యేలా చెప్పు ఎం జరిగింది. ఇంతకు మీరెవరు, బాబుగారూ నేను యూ ఇంట్లో సెక్యురిటి పని చేసే వాడి తండ్రిని బాబు మీ కుటుంబం మొత్తం తో పాటు నన్ను నా కోడలిని మనవరాలిని అన్యాయం చేసి వెళ్ళిపోయాడు బాబు.

ఏమైంది తాత ఎక్కడి కి వెళ్ళాడు మీ అబ్బాయి మా ఫ్యామిలీ వాళ్ళు ఎక్కడ ఉన్నారో మీకు తెలుసా తెలిస్తే చెప్పండి మేము నిన్ను కూడా అక్కడికి తీసుకెళ్తామ్. అని రియా అడిగింది.

ఎం చెప్పమంటారు అమ్మాయిగారు ఎలా చెప్పమంటారు ఎక్కడున్నారని చెప్పమంటారు మనం వెళ్లగలిగే ఛోటయితే గా చెప్పడానికి ఒక్కసారి అక్కడికి వెళ్తే మళ్ళీ తిరిగి రాని చోటుకు వెళ్లిపోయారు అని ఎలా చెప్పమంటారు అంటూ ఏడుస్తూ ఉన్నాడు ముసలోడు.

రియా ఆ ముసలోడు అన్నది విని నో…….. అని అరిచి స్పృహ తప్పి పడిపోతుంటే కార్తిక్ తనని పట్టుకుని మెల్లిగా కింద కూర్చుంటూ తనని ఒళ్ళో పడుకోబెట్టుకుని రియా రియా అని పిలుస్తూ తనని నిద్ర లేపుతుంటే ముసలోడు తన బండిలో ఉన్న మంచి నీళ్ల డబ్బా లోంచి నీళ్లు రియా మొహం పై చల్లి తనని స్పృహలోకి తెచ్చి అమ్మాయిగారు ఇప్పుడు ఎలా ఉంది.

కార్తిక్… కార్తిక్ తాతయ్య …. తాతయ్య ఇప్పుడెమన్నాడు ప్లీస్ కార్తిక్ అంటూ ఏడుస్తూ తాను విన్నదంతా గుర్తు చేసుకుంటూ అసలు ఏం జరిగింది అని కార్తిక్ ని అడుగుతుంటే కార్తిక్ తనని ఓదారుస్తూ ఉరుకో రియా ప్లీస్ టెన్షన్ పడకు రిలాక్స్ ప్లీస్ ముందు మనం హాస్పిటల్కి వెళ్దాం అని రియా ని ఎత్తుకుని ఒక ఆటో మాట్లాడుకుని హాస్పిటల్ కి వెళ్లారు ముగ్గురు. హాస్పిటల్ లో కి ఎంటర్ అవ్వగానే casualty లో అడ్మిషన్ తీసుకొని చెక్ అప్ కోసం లైన్ లో వెయిట్ చేస్తూ ఉంటే అటు నుండి వెళ్తున్న ఒక ఇద్దరు డాక్టర్ లు వాళ్ళ వెంట 3 నర్స్ లు వెళ్తూ ఎదో మాట్లాడుకుంటూ ఉంటే కార్తిక్ వాళ్ళ మాటలు విన్నాడు.

డాక్టర్ గత వన్ మంత్ గా పేషెంట్ తాలూకు వాళ్ళను కాంటాక్ట్ చేయలేక పోతున్నాం కండిషన్ కూడా క్రిటికల్ గానే ఉంది ఇప్పటికే 3 సర్జరీ లు చేసాం 70℃ బర్న్స్ అయినా పేషెంట్ ఇంకా ప్రాణాలతో ఉండడం ఇట్స్ ఆ మిరాకల్ అనే చెప్పాలి.

యెస్ డాక్టర్ మీరు చెప్పింది నిజమే ఇట్స్ ఆ మిరాకల్ ఇన్ ఆ మెడికల్ హిస్టరీ కానీ పేషెంట్ ఎవరో కాదు నా బెస్ట్ ఫ్రెండ్ కి ఫ్రెండ్ కొడుకు తనని కాపాడితే గాని అసలు ఏం జరిగింది వాళ్ళ వాళ్ళు కాంటాక్ట్ లోకి కూడా ఎందుకు రావడం లేదు అన్నది తెలుస్తుంది మీరు ఎం కంగారు పడకండి హాస్పిటల్ బిల్ సంగతి నేను చూసుకుంటాను వాళ్ళ వాళ్ళని వెతికే పని నా ఫ్రెండ్ అశోక్ చూసుకుంటాడు మనం పేషెంట్ ట్రీట్మెంట్ గురించే ఆలోచించాలి.

కార్తిక్ ఇది విని ఎందుకో తనకి ఏదోలా అనిపించి ఆలోచనల్లో పడ్డాడు ఇంతలో వాళ్ళ నెంబర్ రావడం తో రియా ని చెక్ అప్ కి పంపి ముసలోడిని అక్కడే ఉండమని ఇందాక వెళ్లిన డాక్టర్స్ ఎక్కడికి వెల్లరో అటు వైపుకి వెళ్లి వాళ్ళని వేటుకుంటు ఉంటుంటే ముసలోడు కార్తిక్ ని వెతుక్కుంటూ వచ్చి డాక్టర్ రమ్మన్నాడు అంటే డాక్టర్ ని కలవడానికి వెళ్ళాడు.

డాక్టర్ రియా ని చెక్ చేసాక నో ప్రాబ్లెమ్ మీరు కాస్త నీరసంగా ఉన్నారంతే ప్రెగ్నెన్సీ లో ఇవన్నీ కామన్ కాస్త కేర్ తీసుకోండి సరిపోతుంది అని చెక్ అప్ రూమ్ నుండి బైటికి వస్తుంటే రియా డాక్టర్ ని పిలిచి డాక్టర్ ఎం మాట్లాడుతున్నారు నేను ప్రేజ్ఞాన్ట్ ఆ ఓహ్ గ్రేట్ అని ఆనంద పడిపోతుంటే డాక్టర్ తనని చేసి ఏంటిది ఇంతలా ఎక్సైట్ అవుతుంది ఎదో ఇప్పుడే ఈ న్యూస్ తెలిసినట్టు అనుకుని ఏంటి మేడం ఎదో ఈ న్యూస్ ఇప్పుడే తెలిసినట్టు అంతలా సంతోషిస్తున్నారు మీకు వొమిట్ అవుతునప్పుడు చెక్ అప్ చేయించుకోలేదా ఏంటి.

లేదు డాక్టర్ ఇదే ఫస్ట్ టైం లాస్ట్ త్రి డేస్ గా వొమిట్ అవుతుంది కానీ క్లైమేట్ చేంజ్ ఫ్లైట్ జర్నీ వల్ల అనుకున్న పెళ్లిరోజే నైట్ హనీమూన్ కి 1 మంత్ తరువాత ఇప్పుడే తిరిగొచ్చాను థాంక్స్ డాక్టర్ థాంక్యూ వెరీ మచ్ ఈ న్యూస్ మా హస్బెండ్ కి చెప్పండి తాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు.

ఓరిని ఇదేందీ రా బై పెళ్లై నెలే అయ్యిందంటుంది మరి ప్రెగ్నెన్సీ ఏమో 12 వీక్స్ దాటింది బహుశా పెళ్లికి ముందే తొందర పడ్డారేమో లే మనకెందుకు ఓకే థెన్ మీరు వెళ్లొచ్చు నేను మీ హస్బెండ్ తో మాట్లాడుతాను తనను కొన్ని టిప్స్ ఇవ్వాలి అని రూమ్ నుండి బైటికి వచ్చి ఎదురుగా ఉన్న టేబుల్ ముందు ఒక ముసలోడు ఇంకా ఒక యంగ్ మాన్ ని చూసి సో మిరెనా తిన హస్బెండ్ మిస్టర్ …, కార్తిక్ సర్ మై నేమ్ ఇస్ కార్తిక్.

ఓకే కార్తిక్ దేర్ ఐస్ నో ప్రాబ్లెమ్ శుడ్ టెక్ సం రెస్ట్ థాట్స్ఇట్, సర్ అక్టుఅలీ షి హర్డ్ ఏ న్యూస్ అండ్ స్పృహ తప్పి పోయింది తన ఫ్యామిలీ వాళ్లంతా పోయారని ఇదిగో ఈ ముసలాయన చెప్పాడు అంతే ఆ విషయం విని ఇలా అయ్యింది తనకేం ప్రాబ్లెమ్ లేదు గా.

వాట్…….? వాట్ ఆర్ యు టాకింగ్…? ఈడేంటి ఏదేదో చెప్తున్నాడు అంటే వీడికి విషయం తెలీదా అనుకుంటూ ఉంటే యెస్ డాక్టర్ 1 మంత్ బ్యాక్ మా పెళ్లి జరిగింది ఆ రోజు నైట్ ఫ్లైట్ లొనే మేము హనీమూన్ టూర్ వెళ్ళాం మార్నింగ్ ఏ తిరిగొచం మా వైఫ్ వాళ్ళ ఫామిలీ లో ఎవరు కాంటాక్ట్ లో లేరు ఇంటికి వెళ్లి చూస్తే తాళాలు ఉన్నాయి చాలా రోజులుగా ఎవరు ఇంటికి వచ్చినట్టే లేరు అంత పాడుబడిపోయి ఉంది ఇల్లంతా ఇంతలో ఇతను ఈ విషయం చెప్పాడు.

ఓకే ఓకే ఇదంతా నాకెందుకు కానీ మీరు మీ వైఫ్ ని కాస్త కేర్ఫుల్ గా చూసుకోండి షి నీడ్స్ లాట్ ఆప్ రెస్ట్ ఓకే థాంక్యూ థాంక్యూ డాక్టర్ అని ముసలోడు కార్తిక్ ఇద్దరు బైటికి వచ్చారు వరండా లో రియా ని చూసి తాను నవ్వుతూ ఉండడం చూసి హమ్మయ్య డాక్టర్ ఎదో ఇంజక్షన్ ఇచుంటాడు అందుకే విన్నదంతా మర్చిపోయి ఉంటుంది.

This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000