అర్జున్ Part 4

This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000

ఎన్ని రోజులైనా కార్తిక్ సంగతి తెలియకపోవడం తో రియా క్రిస్టినా ని కాస్త గట్టిగా నిలదీస్తే నిజం బైట పడింది క్రిస్టినా రియా కి సారి చెప్పి కార్తిక్ జైల్ లో ఉన్నాడు అని తనని ఒక కేస్ లో గిల్టీ గా భావించి 3 ఇయర్స్ శిక్ష వేశారని చెప్పింది, అది విన్న రియా తనకి కార్తిక్ పైన ఉన్న పిచ్చి ప్రేమ కార్తిక్ తప్పు చేసాదంటే నమ్మడం లేదు దాంతో క్రిస్టినా రియా కి ఒక వీడియో చూయించింది. అందులో ఒక అమాయకమైన అమ్మాయి చావుకు కారణంగా కార్తిక్ అనే NRI ని అరెస్ట్ చేసారని ప్రత్యక్షంగా కారణం కాకపోయినా పరోక్షంగా కారణం అయ్యాడు అని కోర్ట్ తనకి ఒక 3 ఏళ్ళు సాధారణ జైల్ శిక్ష విధించింది అని, తనకి ఐ లవ్ యు చెప్పక పోతే కాల్చుకొని చనిపోతానని రివాల్వర్ తో బెదిరించిన NRI కార్తిక్ తనకి ఆల్రెడీ పెళ్లయింది అని తన భార్య అంటే తనకి చాలా ఇష్టమని మోసం చేయలేను అని ఎంత చెప్పినా వినిపించుకోకుండా రజని అనే అమ్మాయి తన అన్నయ్య ACP అశోక్ సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని చనిపోయింది.

దీన్ని బట్టి కార్తిక్ కి తన భార్య పైన ఎంత ప్రేముందో తెలుస్తుంది ఒక అమ్మాయి నువ్వుంటె నాKయూ ఇష్టం లేదు నన్ను డిస్టర్బ్ చేయకు అని చెప్తే తన లవ్ ని రిజెక్ట్ చేసినందుకు మొహం పైన యాసిడ్ పోయడం లేదంటే కత్తులతో బెదిరించడం చివరికి చంపేయడం లాంటివి చేస్తారు కొందరు అబ్బాయిలు అలాంటిది స్వయానా తనే ప్రేమించు నువ్వు నాకు కావాలి అని అన్నా అడ్వాంటేజ్ తీసుకోకుండా తన మంచితనాన్ని చాటుకున్న కార్తిక్ లాంటి వాళ్ళకి ఇలా శిక్ష పడడం ఆలోచించదగ్గ విషయం.

కాల్చుకుని చనిపోయింది ఒక పోలీస్ సర్వీస్ రివాల్వర్ వల్ల అది ఒక acp చెల్లెలు కాబట్టి నిందితుడికి ఇలా శిక్ష కావాలనే వేయించి ఉంటారు, అంతే వీడియో ఆగిపోయింది, మొత్తం విన్న రియా కన్నీళ్ళతో తో క్రిస్టినా ని చూస్తుంటే తను రియాని ఓదారుస్తూ ఉండగా రియా కార్తీక్ ని అర్జంట్ గా చూడాల్సిందే అని పట్టుపట్టింది ఎంత సముదాయించిన రియా వినిపించుకోకపోయే సరికి ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తానని చెప్పడం తో కాస్త కూల్ అయ్యి రెండు చేయండి నా బిడ్డకి కూడా అని చెప్పింది.

టికెట్స్ బుక్ అయ్యాక రియా తన బిడ్డ ని తీసుకొని ఇండియా కి బయలుదేరి ముంబై లో ల్యాండ్ అయ్యింది తన భర్త కార్తిక్ ఏ జైల్ లో ఉన్నాడో తెలుసుకుని కలవడానికి వెళ్ళింది, కార్తిక్ ని ఉసల వెనక చూసి రియా గుండె తరుక్కు పోయింది, తనని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకె కార్తిక్ కి ఈ కష్టాలన్నీ అని ఏడుస్తూ కార్తిక్ తో అంది దానికి కార్తిక్ రియా నీదేం తప్పు లేదు ఎప్పుడు నువ్వు అలా అనుకోకు ఎక్కువ టెన్షన్ కూడా తీసుకోకు త్వరలోనే బైటికి వస్తాను అని భరోసా ఇస్తే రియా కార్తిక్ తో తనకో సర్ప్రైజ్ అని బిడ్డని చూయించింది,

కార్తిక్ జాన్ (నామకరణం అయ్యే వరకు ఇదే పేరు తో పిలుచుకుందాం) నిచేసి ఏ బాబు ఎవరు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావ్ అని అడిగితే రియా నిజం చెప్పక (చెప్తే తన పైన ఉన్న విశ్వమంత ప్రేమ ద్వేషం లా మారుతుందని) జాన్ ని అడాప్ట్ చేసుకుందామనుకున్నాను మీరు ఇక్కడ జైల్ లో నేను ఒంటరి దాన్ని అయిపోతానని ప్రస్తుతానికి వీడికి పేరేం పెట్టలేదు ముద్దుగా జాన్ అని పిలుస్తున్నాం క్రిస్టినా ఈ పేరు సజెస్ట్ చేసింది అంటూ జాన్ ని కార్తిక్ కి ఇచ్చింది.

కార్తిక్ జాన్ని ఎత్తుకుని వీడికి మా నాన్న పేరు పెడదాం ఏమంటావ్ అంటూ వాడి బుగ్గపై ముద్దు పెడుతూ అన్నాడు రియా కి అది నచ్చలేదు దిగులు గా మొహం పెట్టేసింది తనకేమో బాబుకు కార్తిక్ నాన్న పేరో ఇంకేదో పేరు కాదు బాబుకు వాడి నాన్న పేరే పెడదామని ఉంది ఎందుకంటే బాబు అచ్చం తండ్రి పోలిక ఎలాగూ తండ్రి ఈ లోకం లో లేడు అందుకే బాబుకి సంజయ్ అన్న పేరే పెడదామనుకుంది.

రియా మొహం దిగులు గా ఉండడం చూసి కార్తిక్ కి అర్థం అయిపోయింది రియా కి తన ఐడియా నచ్చలేదు అని అందుకే రియా తో తనకి నచ్చిన పేరే పెట్టుకోమని తను మాత్రం బాబుని ముద్దుగా తన తండ్రి పేరు తోనే పిలుస్తాను అంటాడు రియా కి కార్తిక్ చెప్పిన మాట నచ్చి సంతోషంగా అక్కడి నుండి వెళ్లిపోతుంటే కార్తిక్ తనని పిలిచి ఇక తనని కలవడానికి మళ్ళీ రావొద్దు అని చెప్తాడు రియా అలాగే అని బాబుని తీసుకొని రిటర్న్ ఫ్లైట్ లోమల్లి యు యెస్ కి వచ్చేస్తుంది.

తిరిగొచ్చాక క్రిస్టినా తో తనకో జాబ్ చూడమని చెప్తే చూసి పెడుతుంది మంచి జాబ్ కంపెనీ క్వార్టర్స్ కంపెనీ కార్ అన్ని ఉండడం తో రియా బాబు తో ఒక కేర్ టెకర్ ని బాబు తో ఉంచి జాబ్ చేసుకుంటూ బాబు ని చూసుకుంటూ మధ్య మధ్య లో హాస్పిటల్ లో అర్జున్ గురించి తెలుసుకుంటూ వాడి ట్రీట్మెంట్ కి కావాల్సిన మనీ ఆరెంజ్ చేస్తూ కార్తిక్ ఎప్పుడెప్పుడు జైల్ నుండి రిలీజ్ అవుతాడా అని ఎదురుచూస్తూ కాలం గడుపుతుంది.

చూస్తూ చూస్తూ బాబు కి 5 ఏళ్ళు వచ్చేస్తున్నాయి వాడిని స్కూల్ కి వెళ్తున్నాడు ఇక్కడ కార్తిక్ జైల్ నుండి రిలీజ్ అయ్యే టైం కూడా దగ్గరికొస్తుంది 3 ఏళ్ల రియా సింగిల్ మదర్ గా తన బాబు ని చూసుకుంటూ అటు మామ కొడుకు అర్జున్ ని చూసుకుంటూ ఆఫీస్ పనుల్లో కూడా బాగా రాణిస్తూ బాగానే డబ్బులు కూడబెట్టింది.

మొత్తానికి కార్తిక్ జైల్ నుండి రిలీజ్ అయ్యే డేట్ రావడం తో ఆఫీస్ లో రీసైన్ ఇచ్చేసి బాబు కి కేర్ టెకర్ గా ఉన్న బేబీ సిట్టర్ ని కూడా పనిలోంచి తీసేసి ఇన్నేలుగా బాబుకు ఏ లోటు రాకుండా చూసుకున్నందుకు తనకి మంచి రకం ఇచ్చి బాబుని తీసుకొని ముంబై లో ల్యాండ్ అయ్యింది కార్తిక్ ని రిసీవ్ చేసుకొని ఇప్పుడు మన ఫ్యూచర్ ప్లన్స్ ఏంటి ఎం చేద్దాం అని అడిగితే, కార్తిక్ ఇక్కడే ఒక బిసినెస్ స్టార్ట్ చేద్దాం మీ మామయ్య బిసినెస్ అన్ని ఆయన పోయిన వెంటనే క్లోస్ అయ్యాయి అదే పేరుతో అదే బిసినెస్ మళ్ళీ ఇక్కడ ముంబై లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్న అని రియా తో చెప్తే దానికి తను ఒప్పుకుని ఈ మూడేళ్ళ గా తను సంపాదించిందంతా కార్తిక్ కి చూపిస్తూ ఈ మూడేళ్లు తను ఎం చేసింది అన్నది చెప్పింది.

భార్య సంపాదన ఉపయోగించడం ఇష్టం లేక పోయినా అప్పు లా వాడుకోవచ్చు కదా అనుకుని బిసినెస్ స్టార్ట్ చేసాడు తన మేనమామ పెట్టిన పేరే పెట్టినందుకు రియా చాలా సంతోషంగా ఉంది బిసినెస్ ఇనగరేషన్ పార్టీ తో పాటే తన బిడ్డ బారసాల నామకరణం ఫంక్షన్ పెట్టి బిడ్డ కి తనకి నచ్చిన పేరే పెట్టమనడం తో రియా బిడ్డ కి ఆ బిడ్డ తండ్రి పేరు పెడతాను అని సంజయ్ అని పెట్టింది కార్తిక్ కి కూడా సంజయ్ అంటే అభిమానం ఉండడం తో ఆ పేరు తన బిడ్డ కి పెడతాను అంటే ఏమి అభ్యన్తరం చెప్పలేదు.

బిడ్డకి సంజయ్ అని పేరు పెట్టినా ఇంట్లో ముద్దుగా వాడిని జాన్ అనే పిలవడం అందరికి అలవాటైపోయింది కార్తిక్ కోరిక మెరకు అతనొక్కడే తన బిడ్డని తన తండ్రి పేరు తో పిలుస్తుంటాడు, రోజులు గడుస్తున్నాయి ఒక సంవత్సరం లోపే తన బిసినెస్ లో బాగా రాణించాడు గొప్పగా కాకపోయినా ఒక మాదిరిగా లాభాలు పొందాడు.

సంపాదించిన దానిలో కొంత సేవింగ్స్ కొంత అర్జున్ ట్రీట్మెంట్ మిగతాది ఇంటికార్చులకి పిల్లాడి స్కూల్ ఫీస్ కి సరిపోయేది, అవును సంజు జూనియర్ ఇప్పుడు స్కూల్ కి కూడా వెళ్లడం మొదలెట్టేసాడు, ఎంతగా గతాన్ని మర్చిపోదామన్న అప్పుడప్పుడు తన ఫ్యామిలీ మెంబెర్స్ గుర్తొస్తూనే ఉంటారు ఇద్దరికి పైగా అర్జున్ కూడా ఇంకా కోలుకోవడం లేదని ఇంకాస్త బాధ.

డబ్….. డబ్…..డబ్…… మేడం… మేడం…. తలుపు తీయండి మేడం బాబు స్కూల్ నుండి వచ్చే టైం అయ్యింది మేడం… మేడం… అంటూ నర్స్ కార్తిక్ రియా ల బెడ్రూం డోర్ బాడుతూ పిలిస్తే రియా లేచి రూం డోర్ తెరిచి ఎం మాట్లాడ కుండా అర్జున్ ఉన్న రూం కి వచ్చి ఒకసారి చూసి కిచెన్ వైపు వెళ్లి కాసిన్ని మంచినీళ్లు తాగి బైటికి వెళ్ళిపోతుంది.

ఫ్లాష్ బ్యాక్ అయిపోయింది.

ఇప్పుడు ప్రస్తుతానికి వద్దాం.

ఒకసారి పాత్రల పరిచయాన్ని గుర్తు చేసుకుందాం. ముఖ్యమైన పాత్రలో అర్జున్ ఉంటాడు ప్రస్తుతానికి బెడ్ పైన పేషెంట్ గా ఉన్న త్వరలోనే కొలుకుంటాడు కథలో హీరో పాత్రని పోషిస్తాడు, ఇకమిగితా పాత్రలు. ముందుగా కార్తీక్ కథలో సైడ్ హీరో గా అనుకుందాం తన భార్య రియా సైడ్ హీరోయిన్ ఇంకా రియా బిడ్డ జూనియర్ సంజయ్ (జాన్), అర్జున్ కి గత నాలుగేళ్లుగా ట్రీట్మెంట్ లో సహాయపడుతున్న నర్స్ (తన పేరు తరువాత తెలుసుకుందాం). కార్తిక్, రియా ల కామన్ ఫ్రెండ్ క్రిస్టినా అండ్ ఫ్యామిలీ కార్తిక్ ఫ్రెండ్ అశోక్ అండ్ హిస్ ఫ్యామిలీ. ప్రస్తుతానికి వీళ్ళు మిగితా వాళ్ళగురించి కథతో పాటు పరిచయాలు చేస్తాను.

రియా jr. సంజు ని తీసుకురాడానికి స్కూల్ కి స్కూటీ తీసుకుని వెళ్ళింది ఇక్కడ కార్తిక్ ఆఫీస్ లో ఎవరో మినిస్టర్ p a తో మాట్లాడుతున్నాడు, కార్తిక్ కి ఎదో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని పిలుచుకు రమ్మన్నాడని PA చెప్తే రేపు మార్నింగ్ కలుస్తానని చెప్పమని వాడిని పంపించేసాడు,

రియా తన 5 ఏళ్ల బిడ్డ ని తీసుకుని తిరిగి ఇంటికి వచ్చింది వాడు రాగానే బిద్దిగా బాత్రూం కి వెళ్లి మొహం కాళ్ళు చేతులు కడుక్కుని కిచెన్ లో చైర్ వేసుకుని అటక పైన ఉండే, వాడికి ఇష్టమైన ఒక బొమ్మ తో ఆడుకుంటుంటే అది చూసి రియా వాడి దగ్గరనుండి దాన్ని లాక్కుని వాడి చేయి పట్టుకుని అర్జున్ గదిలోకి తీసుకెళ్లి అర్జున్ ని చూపిస్తూ, చూడు బాబాయ్ కి బాలేదు నువ్వు దీనితో ఆడితే బాబాయ్ కి డిస్టర్బ్ అవుతుంది అంటుంది.

Jr. సంజు బెడ్ పైన ఉన్న అర్జున్ ని చూసి మమ్మి బాబాయ్ ఆ ఎవరు బాబాయ్ అంటే బాబాయ్ కి జరం వచ్చిందా అని అర్జున్ దగ్గరికి వెళ్తుంటే పక్కనే ఉన్న నర్స్ వాడిని ఆపింది ఆ నర్స్ ని చూపిస్తూ మమ్మి చూడు బాబాయ్ దగ్గరికి పోనివట్లేదు అని అనగానే రియా వద్దు కన్నా బాబాయ్ కి బాలేదు గా తగ్గిన తరువాత వెల్దువు ఇలా రా ని మిల్క్ టైం అయింది రా అంటూ jr సంజు ని చేయి పట్టుకుని తీసుకెళ్తుంటే, వాడు విడిపించుకుని నర్స్ ని తప్పించుకుని అర్జున్ బెడ్ దగ్గరికి వెళ్లి అర్జున్ నుదుటి పై చేయి పెట్టి చూసాడు,

అంతా నార్మల్ గానే ఉన్న తెలీక మమ్మి బాబాయ్ కి ఎం కాలేదు చూడు చల్లగా ఉంది ఇక్కడ నాకు జరం ఉన్నప్పుడు చాలా వేడిగా ఉంటుంది గా అని అంటుంటే రియా వాడితో ముందు ఇటు రా నువ్వు అని వాడిని లాక్కెలింది, ఇక్కడ అర్జున్ నుదుటి పై చేయి పడగానే వాడి ఒంట్లో చలనం వచ్చింది, చిన్నగా వేళ్ళు కలిపాడు కానీ అది ఎవరు గమనించలేదు, నర్స్ కూడా చూడలేదు,

కాసేపటికి కార్తిక్ కూడా ఆఫీస్ నుండి ఇంటికి రాగానే అందరూ కలిసి భోజనం చేశారు jr సంజు కి ముందే భోజనం తినిపించి పడుకోబెట్టేసింది రియా, భోజనం చేస్తూ కార్తిక్ రియా తో మినిస్టర్ తనని కలవడం గురించి చెప్పాడు, ఇంకా కొన్ని ఆఫీస్ విశేషాలు మాట్లాడుతూ బొంచేసి పడుకుండి పోయారు. నర్స్ కి ఎక్కడ పడుకోపెట్టాలో తెలీక ఆలోచిస్తుంటే నేను పేషెంట్ దగ్గరే ఉంటాను మేడం అని అర్జున్ రూంలోకే వెళ్ళింది.

రాత్రి 2-3 గంటల మధ్య అర్జున్ కి మళ్ళీ మెల్లిగా స్పృహ వచ్చినట్టు అయ్యి కాస్త కళ్ళు తెరిచి చూసాడు మళ్ళీ పడుకున్నాడు, నర్స్ తన దగ్గరే ఉంటాననింది కానీ రాత్రంతా చూసుకుంటానని చెప్పలేదు గా సరిగ్గా పొద్దున 5-5:30 మధ్యలో అర్జున్ ఒకేసారి తనకి ఊపిరి ఆడనట్టు చేస్తూ గట్టి గట్టిగా ఊపిరి పీలుస్తుంటే అప్పుడప్పుడే మెలకుంటున్న రియా కి ఆ చప్పుడు వినిపించింది నర్స్ ఆల్రెడీ మేలుకుంది కానీ తనకి ఎం చేయాలో అర్థం కావడం లేదు ఇటు అటు పరుగులు తీస్తుంది ఆక్సిజన్ మాస్క్ తేవడం మర్చిపోయారు, అవసరం ఉండదేమో అని అనుకున్నారు.

రియా సౌండ్ విని కార్తీక్ ని లేపి ఇద్దరు అర్జున్ రూంకి వచ్చారు సతమతమవుతున్న నర్స్ ని చూసి వాళ్ళు కూడా ఎం చేయాలో తెలీక అటు ఇటు పరుగులు తీస్తూ కార్తిక్ డాక్టర్ కి కాల్ చేస్తూ ఉంటే ఆడు ఎత్తడం లేదు అర్జున్ ఊపిరి తీసి తీసి ఆపేసాడు, అంకంసిఎస్ అయిపోయాడు అది చూసి నర్స్ ఓహ్ నో…. అని అరుస్తూ అర్జున్ అర్జున్ యూ కాంట్ దు దిస్ టు మీ అర్జున్… అర్జున్ అంటూ వాడి గుండెల పై ప్రెస్ చేస్తూ నోట్లోకి గాలి ఉదుతూ వాడిని బ్రతికించడానికి ప్రయత్నిస్తుంది, రియా కార్తిక్ కూడా కళ్ళ నిండా నీళ్ల తో అర్జున్ ని ఎలాగోలా బ్రతికించడానికి ప్రయత్నిస్తూ రూం అంత చిందర వందర చేస్తూ గోల గోల చేస్తుంటే jr. సంజు కి మేలుక వచ్చి రూం నుండి బైటికి వచ్చి ఆ చప్పుడు ఎక్కడ అని అర్జున్ రూంలోకి వెళ్ళాడు.

రూంలో అందరూ గందరగోళం చేస్తుంటే 5 ఏళ్ల వీడికి ఎం అర్థం అవుతుంది మమ్మి అంటూ అర్జున్ కాళ్ళ దగ్గర పడి ఏడుస్తున్న రియా దగ్గరికి వెళ్లి మమ్మి ఏమైంది మమ్మి ఇక్కడ ఎం చేస్తున్నావ్ బాబాయ్ కి డిస్టర్బ్ అవుతుంది గా అంటూ రియా కన్నీళ్లు తుడుస్తూ అర్జున్ కాళ్ళని తాకి బాబాయ్ బాబాయ్ జరం తగ్గిందా అని అడుగుతుంటే అర్జున్ పడుకున్న బెడ్ పక్కన ఉన్న ECG స్క్రీన్ లో చిన్నగా ఫుల్స్ పెరుగుతుంటే సౌండ్ వస్తుంది అది చూసి రియా jr. సంజు ని ఎత్తుకుని అర్జున్ మొహం దగ్గరికి వెళ్లి అర్జున్ ని ECG స్క్రీన్ ని చూస్తూ అర్జున్ అర్జున్ అని పీలుస్తుంటే.

Jr. సంజు బాబాయ్… బాబాయ్.. అని అర్జున్ ఎడమ భుజం పై చేయి వేసి పిలవంగానే అర్జున్ మెల్లిగా కళ్ళు తెరిచి కళ్లెదురుగా ఉన్న నర్స్ ని చూసి కాస్త ఎడమ పక్కాగా మొహం తిప్పి jr. సంజు ని తనని ఎత్తుకుని నించున్న రియా ని చూసి మళ్ళీ మొహం కుడి వైపుకి తిప్పి నర్స్ ని చూస్తూ తన వంక చేయి చాచి ఎదో మాట్లాడాలని ప్రయత్నిస్తుంటే నర్స్ వాడి చేయి పట్టుకుని తన గుండెలకు హద్దుకుని వాడి పై పడి థాంక్ గాడ్ అర్జున్ నువ్వు లేచావ్ థాంక్ గాడ్ థాంక్ యు వెరీ మచ్ అని లేచి వాడి వంక చూస్తూ వాడేదో చెప్పడానికి ప్రయత్నిస్తుంటే అదేదో తెలుసుకోవాలని నర్స్ కూడా శ్రద్ద పెడుతుంటే అప్పుడే కార్తిక్ కి కాల్ వస్తుంది.

This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000