This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000
తెల్లవారు ఝామున అతనికి మెలకువ వచ్చింది… కళ్ళు తెరిచి చూసే సరికి పక్కన ఆమె లేదు… ఏమైందా అని చూస్తే కనబడలేదు గబగబా బట్టలు వేసుకుని బయటకు వచ్చాడు…వర్షం పూర్తిగా తగ్గిపోయింది…
అప్పుడే సూర్యుడు ఉదయించేందుకు సిద్ధమౌతున్నట్టుగా ఎర్రటి కిరణాలు కొండల మధ్యనుండి ఆకాశంలోకి ఎగసి కనబడుతున్నాయి….ఆమె ఒక బండరాయి మీద రెండు కాళ్ళ మధ్య తల పెట్టుకుని కూర్చుంది … దగ్గరగా వెళ్లి మేడం అని పిలిచాడు… ఆమె పలకలేదు… చిన్నగా ఏడుస్తున్నట్టుగా ఉంది… అతనికి రాత్రి జరిగిందంతా గుర్తుకొచ్చి గిల్టీ గా అనిపించింది…. మేడం అని మళ్ళీ పిలిచాడు… ఆమె తల ఎత్తి చూసింది… ఆమెను చూడగానే అతనికి చిన్నపాటి భయం కలిగింది…ఆమె కళ్ళు బాగా ఎర్రగా ఉబ్బి ఉన్నాయి… ఎంత సేపట్నుండి ఏడుస్తుందో…చెంపల నిండా కన్నీళ్లు చారలు కట్టినట్టు ఉన్నాయి… ముఖమంతా వాడిపోయి ఉంది…
“మేడం … సారి మేడం …” అన్నాడు… ఆమెకు మళ్లీ దుఃఖం తన్నుకొచ్చింది… గట్టిగా ఏడుస్తూ మళ్లీ తలను కాళ్ళ మధ్య పెట్టుకుంది… అతనికి ఏం చేయాలో తెలియక కాసేపు అలాగే నిల్చున్నాడు… ఇప్పుడు ఆమెకు ఏం చెప్పినా ఓదార్చలేనని అనిపించి… కార్ దగ్గరకు వెళ్ళాడు… వేగంగా కార్ టైర్ మార్చేశాడు… తిరిగి ఆమె దగ్గరికి వచ్చాడు… ఆమె ఇంకా ఏడుస్తున్నట్టుగా వెక్కిళ్ళు వినబడుతున్నాయి… అతనికి ఆమెని పలకరించాలంటే భయం వేస్తుంది… కానీ తప్పదు అనుకుంటూ… “మేడం కార్ రెడీ అయింది వెళ్దాం రండి” అంటూ పిలిచాడు… ఆమె కదలలేదు… కాసేపాగి మళ్లీ పిలిచాడు… ఆమె లేచి ఏమీ మాట్లాడకుండా కార్ వైపు నడిచింది.. అతను షెడ్ లోకి వెళ్లి ఇద్దరి బ్యాగులూ తీసుకొని వచ్చాడు… అతను వచ్చేసరికే ఆమె లోపల కూర్చుంది… అతను మౌనంగా కార్ ఎక్కి వేగంగా నడుపసాగాడు…. వెళ్తున్నంత సేపూ ఆమె చిన్నగా ఏడుస్తూనే ఉంది… హైదరాబాద్ శివార్లలోకి రాగానే మేడం ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు… నువు పోనివ్వు చెప్తా అంది.. .కళ్ళు తుడుచుకుని కూర్చుంది…. కొంతదూరం వెళ్ళాక ఒక బస్ స్టాప్ వద్ద కార్ ఆపమంది … అతను కార్ ఆపగానే దిగి అతన్ని వెళ్ళిపోమంది.. అతను ఆశ్చర్యపోతూ మేడం మీ ఇల్లు ఎక్కడో చెప్పండి..అక్కడే డ్రాప్ చేస్తాను అన్నాడు … అక్కర్లేదు నేను వెళ్లి పోగలను అంటూ బస్టాప్ లోకి వెళ్లి నుంచుంది.. అతను ఏమీ అనలేక అక్కడే ఉన్నాడు.. అంతలోనే అక్కడికి ఒక క్యాబ్ వచ్చింది…అతను చూస్తుండగానే ఆమె దాన్ని ఎక్కి పోనివ్వమంది…
ఇంటికి చెరగానే సరాసరి తన గదిలోకి వెళ్ళిపోయింది.. వాళ్ళ అమ్మ అడిగిన ప్రశ్నలకి పొడిపొడిగా సమాధానాలు ఇచ్చింది…ప్రయాణ బడలిక వల్ల అలా ఉందేమో అని ఆవిడ సరిపెట్టుకుంది… ఆమె మాత్రం ఆరాత్రి నిద్రపోలేదు…ఎంతోసేపు మౌనంగా ఏడుస్తూ కూర్చుంది.. తర్వాత చాలా సేపు ఆలోచించింది… ఎంత ఏడ్చినా జరిగింది వెనక్కిపోదని తనకు తానె సర్ది చెప్పుకుంది… జరిగింది ఒక ఆక్సిడెంట్ అనుకోవాలని … ఒక పీడకలగా మర్చిపోవాలని నిర్ణయించుకుంది.. ఇంటి వాళ్ళతో వీలైనంతవరకు మామూలుగా ఉండేందుకు ప్రయత్నించింది .. ఆ సంఘటన మర్చిపోయేందుకు వీలైనంత బిజీగా ఉండేలా చూసుకుంది … చాలావరకు ఆమె తన ప్రయత్నంలో సఫలమయ్యింది… అయితే రాత్రుళ్ళు మాత్రం ఆమె ఆ విషయంలో సక్సెస్ కాలేకపోయింది… ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపిందో ఆమెక్కూడా తెలియదు…
రెణ్నెల్లు గడిచింది… ఒక రోజు పొద్దున్నే ఆమెను వాళ్ళ అమ్మ లేపింది….
“తొందరగా లేచి రెడీ అవ్వు…ఈరోజు నీకు పెళ్లిచూపులు” అంది…
“ అదేంటి ఇంత సడెన్గా… కనీసం నాకు మాట కూడా చెప్పకుండా..”
“మావయ్య రాత్రి ఫోన్ చేసాడే.. అబ్బాయి పైలట్ అట… మనకి ఎప్పుడు వీలవుతుందో చెప్తే చూసుకోడానికి వస్తామన్నారట… ఈరోజు మంచిరోజు ఉందని ఈరోజే రమ్మన్నాడు మీ నాన్న… నీకు రాత్రే చెబుదామనుకున్నాం కానీ అప్పటికే నువ్ పడుకోవడంతో పొద్దున చెప్పొచ్చని ఊరుకున్నాం …లే లేచి రెడీ అవ్వు వర్జ్యం ఉందని వాళ్ళని తొందరగానే రమ్మన్నాడు మీ నాన్న” అంటూ వెళ్లిపోయిందావిడ.. ..
ఆ మాటే షాకింగ్ గా ఉంది ఆమెకు… అయితే అసలు షాక్ ఆమెకు పెళ్ళిచూపుల్లో పెళ్ళికొడుకుగా ‘అతన్ని’ చూసినప్పుడు తగిలింది… ఆ షాక్ లో ఉండగానే వాళ్ళ అమ్మ అబ్బాయి నచ్చాడా అని అడగడం… ఆమె తలా దించుకుని ఉండడం వల్ల మౌనాన్ని వాళ్ళు అర్ధాంగీకారంగా కాకుండా పూర్ణాంగీకారంగా తీసుకోవడం జరిగిపోయింది. కట్నకానుకలు కూడా ఏమీ వద్దనడంతో ఏకంగా పదిహేను రోజుల్లో పెళ్ళికి ముహుర్తాలు కూడా పెట్టేసారు.. ఆమె తేరుకునే లోపే అన్నీ అయిపోయాయి .. అతను పైలట్ ఏంటో ఆమెకు అర్థం కాలేదు… అతను పైలట్ కాడని తర్వాత చెప్పినా ఎవరూ ఆమె మాట నమ్మలేదు.. ఏం చెప్పి పెళ్లి తప్పించుకోవాలో ఆమెకు తెలియలేదు.. ఒకరోజు అతను ఆమెకు ఫోన్ చేసాడు.. ఫోన్ లిఫ్ట్ చేసి ఆమె హలో అనగానే “మేడం నేను…” అన్నాడు .. వెంటనే ఆమె కాల్ కట్ చేసింది… తర్వాత కూడా అతను ఒకటి రెండు సార్లు ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేసినా ఆమె అవకాశం ఇవ్వలేదు..
పెళ్లయ్యాక మొదటిరాత్రి శోభనం గదిలో గానీ అతనికి ఆమెతో మాట్లాడే అవకాశం రాలేదు… తీరా అవకాశం వచ్చాక అతనికి మాట్లాడాలంటే భయంవేస్తుంది .. ఎలాగోలా గొంతు పెగుల్చుకుని
“ మేడం …” అన్నాడు…
ఆమె చురుగ్గా చూసింది..
“ మేడం మీరలా కోపగించుకోకండి … నేను చెప్పేది వినండి”
“ ఏం చెప్తావ్… తేరగా దొరికిందని ఆరోజు నన్ను అనుభవించావ్… ఇంకో అమ్మాయిని చేసుకుందామని ఈ ఇంటికి వచ్చావ్.. నీ టైం బాగాలేక ఇక్కడా నేనే ఉన్నాను… కాబట్టి ఛాన్స్ మిస్ అయ్యానని బాధ పడుతున్నావ్.. అంతే కదా నువ్ చెప్పేది…” అంది ఆవేశంగా…
“మేడం మీరు పొరపడుతున్నారు… నేను ఇంకో అమ్మాయిని చేసుకుందామని ఈ ఇంటికి రాలేదు.. మిమ్మల్ని చేసుకుందామనే వచ్చాను… “
“అబద్ధం .. నీకు నా అడ్రస్ ఎలా తెలుసు…”
“ఆరోజు మీరు ఎక్కిన క్యాబ్ ని ఫాలో అయ్యాను…తప్పు దిద్దుకుందామనే…. పెళ్ళిచూపులకి ఈ ఇంటికి వచ్చాను…”
“అదే నిజమైతే ఇన్నాళ్లు ఎందుకు ఆగావ్…”
“ దానికి రెండు కారణాలున్నాయి… ఒకటి మీ మనస్థితి కుదుటపడకపోవడం…..”
“అది నీకెలా తెల్సు.. “
“మేడం నేను ఆరోజు నుండీ మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను గనుక….”
“ఎలా…”
“ఆరోజు నేను ఇక్కడే అంటే ఈ ఊళ్ళోనే ఉన్నాను.. రోజూ మిమ్మల్ని అబ్సర్వ్ చేస్తున్నాను.. సమయం కోసం వెయిట్ చేస్తున్నాను… ”
“సరే రెండో కారణం ఏంటో…”
“మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియలేదు… ఆఖరికి మీ మావయ్యని కలుసుకొని ఎవరి ద్వారానో మీ గురించి తెలిసిందని చెప్పి పెళ్లిచూపులు ఏర్పాటు చేయించాల్సి రావడం…”
“అందుకేనా పైలట్ అని అబద్ధం చెప్పావ్….”
“మేడం అది అబద్ధం కాదు….”
“అంటే ఈ రెండు నెలల్లో క్యాబ్ డ్రైవర్ నుండి పైలట్ అయిపోయావా…”
“నేను క్యాబ్ డ్రైవర్ అని ఎవరు చెప్పారు…”
“కాదా…”
“కాదు”
“మరి ఆ రోజు….”
“ఆరోజు ఏం మీరేం చేశారో గుర్తు తెచ్చుకోండి…. నేను ఫోన్ మాట్లాడుతుంటే హడావిడిగా వచ్చి కార్ ఎక్కి తొందరగా పోనీ పోనీ అన్నారు…. నన్ను క్యాబ్ డ్రైవర్ అనుకున్నారని తెలుసినా మీకు చాలా అర్జంట్ ఏమోనని నేను తీసుకెళ్లాను… అక్కడికి తీసుకెళ్లి వదిలేద్దామనుకున్నా… కానీ బ్యాగ్ కార్లోనే ఉంచి వెళ్లిపోయారు… రాగానే హోటల్ అన్నారు… అప్పుడు చెప్పాలనుకున్నా… అయితే మిమ్మల్ని మొదటి సారి చూసినపుడే మీ మీద నాకు కొంచెం ఇష్టం ఏర్పడింది… అందుకే మీరు రమ్మన్నచోటికల్లా వచ్చాను… మీరు హైదరాబాద్ రమ్మన్నపుడు కూడా మిమ్మల్ని ఇంకొన్ని గంటలు చూడాలనే వచ్చాను… కానీ ఆరాత్రి అలా అనుకోని సంఘటన జరిగాక నాకు చాలా బాధేసింది…”
“అయితే నువ్ నిజంగా క్యాబ్ డ్రైవర్ కాదా…”
“కాదు… ఆ రోజు మా ఫ్రెండ్ ని డ్రాప్ చేద్దామని స్టేషన్ కి వచ్చాను… ”
“ అయితే ఇక్కడికి నన్ను పెళ్లి చేసుకోవాలనే వచ్చావా..”
“అవును…”
“ఎందుకని..”
“ఎందుకంటే రెండు కారణాలు… ఒకటి నా వల్ల తప్పు జరిగింది కాబట్టి… .. దానికి మించి నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి…”
ఆ మాట విని ఆమెకు పట్టరాని సంతోషం కలిగింది.. ఒక్కసారిగా అతన్ని గట్టిగా కౌగిలించుకుంది… మొహమంతా ముద్దులతో ముంచెత్తింది….
అంతలోనే అతన్నుండి విడివడి తలదించుకుని కూర్చుండి పోయింది…
“ఏమయింది “ అడిగాడు అతను…
“మీకు నా మీద అసహ్యం లేదా…”
“ఎందుకు…”
“ముక్కూ మొహం తెలియని ఒక అపరిచితునితో సెక్స్ చేశానని, నా క్యారెక్టర్ మీద అనుమానం కలగలేదా…”
“లేదు… దానికీ రెండు కారణాలు ఉన్నాయి…
ఒకటి.. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఆ పని చేశామో నాకు తెలుసు… అందులో తప్పేమన్నా ఉంటే అది ఇద్దరిది అవుతుంది కానీ నీ ఒక్క దానిది కాదు….
రెండు.. ఒకవేళ నీది బ్యాడ్ క్యారెక్టర్ అయ్యుంటే తెల్లవారినప్పటి నుండి నువ్ అంతగా బాధపడేదానివి కాదు…”
ఈ సమాధానంతో అతను ఆమెను పూర్తిగా జయించాడు..
“మీరెంత మంచి వారండీ… మీరు నన్ను పెళ్లిచేసుకోవడం నా అదృష్టం….” అంది ఆమె అతని భుజంపై తలవాలుస్తూ…
“దానికీ రెండు కారణాలున్నాయి….”
“దేనికి”
“నిన్ను పెళ్లి చేసుకోడానికి”
“ ఏమిటో అవి…”
“ఒకటి… నువ్ చాలా అందంగా ఉంటావు… ఇంత అందమైన భార్య దొరకడం చాలా కష్టం…”
“ఉమ్మ్.. రెండోది….”
“రెండోది … ఆ రాత్రి మనం బట్టలు విప్పాక నువ్ చాలా బాగా కో-ఆపరేట్ చేశావ్… అంత బాగా కో-ఆపరేట్ చేసే భార్య దొరకడం కూడా చాలా కష్టమట….” అన్నాడు అతను నవ్వుతూ..
“చీ మిమ్మల్నీ….” అంటూ ఆమె అతనిపై పడటంతో అతను బెడ్ పై వెల్లకిలా పడ్డాడు… అతని ఒక చెయ్యి బెడ్ పక్కన ఉన్న స్విచ్ పై పడడం వల్ల లైట్ ఆఫ్ అయింది… అందువల్ల ఏవో చప్పుళ్ళు, మూలుగులు మాత్రం వినబడ్డాయి తప్ప.. ఆ తర్వాత అక్కడ ఏం జరిగిందో తెలియలేదు…
అందుకని ఈ కథ ఇక్కడితో ఆపేస్తున్నాను…
మీ లక్ష్మి
This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000