మనసున మనసై (సీరియల్ 1వ భాగం)

This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000

మనసున మనసై..!

అందరికీ హాయ్..

ఇప్పటిదాకా నేను రాసిన కథలు చదివిన మీరు నాకు మంచి సపోర్ట్ ఇచ్చారు. ఇప్పు నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకొని, కొన్ని ఫాంటసీలను జోడిస్తూ… రాస్తున్న సీరియల్ ‘‘మనసున మనసై’’. దీనిని కూడా ఇంతకు ముందు రాసిన కథల్లాగే మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను.

:: 1వ అధ్యాయం ::

మా నాన్నగారికి ట్రాన్స్ఫర్ అవ్వటం వల్ల కర్నూలు నుంచి విజయవాడకి షిఫ్ట్ అయ్యాం..

2010 దసరా ఉత్సవాలు కావటంతో నగరమంతా కూడా చాలా అందంగా ముస్తాబై వుంది..

ఎక్కడ చూసినా జనం.. రద్దీతో నిండిపోయాయి విజయవాడ రహదారులు..

అదే సమయంలో నేను మా, అమ్మా నాన్నలతో అడుగు పెట్టాను..

ఊరిలోకి వెళుతుండగానే దూరంగా కొండమీద నుంచి దుర్గమ్మ గుడి కనిపించింది, కొంచెం ముందుకెళ్ళగానే కృష్ణమ్మ తన మీదుగా వెళ్ళమంటూ మమ్మల్ని ఆహ్వానించినట్లు అనిపించింది.

అప్పటిదాకా నాకు తెలీదు.. నాకోసం పుట్టిన అమ్మాయి నా బంగారు కొండ బెజవాడలో భద్రంగా ఎదురు చూస్తోందని..

నాన్నగారు అప్పటికే మా కోసం మేముంటానికి వీలుగా లబ్బీపేటలో ఇల్లు ఒకటి చూసేశారు.

మా లగేజీ లారీ కరెక్ట్ గా వెళ్ళి మా ఇంటి ముందు ఆగింది.

ఆ రోజు దుర్గాష్టమి. ఇంటిలో చేరాం… పాలు పొంగించాం…

మరుసటిరోజు మహర్నవమి ఇల్లంతా సర్దేసుకొని బాగా అలసిపోవటంతో మేం గుడికి వెల్దామనుకున్నా కూడా వెళ్ళలేక పోయాం.. తర్వాత రోజు విజయదశమి..

బెజవాడంతా పండగ వాతావరణం నెలకొంది.

ఆరోజు అమ్మవారికి చాలా ఇష్టమైన రోజట.. అందుకే నన్ను తీసుకొని మా అమ్మ,నాన్న అమ్మవారి కొండకు బయల్దేరారు..

నాకు పూజలు, గుడులూ పెద్ద ఇంట్రస్ట్ లేదు..

నేను రాను అంటున్నా మా నాన్న నన్ను పిర్రలమీద రెండు పీకి గుడికి తీసుకెళ్ళాడు..

నదిలో స్నానం చెయ్యమన్నారు.

నేను చెయ్యను అన్నాను.

మళ్ళీ నాన్న తిట్ల దండకం మొదలు పెట్టాడు.

అమ్మ నాన్నతో గొడవ పడుతోంది.

నాన్న నన్ను తిట్టటం ఆగలేదు.. అమ్మ నాన్నతో గొడవ పడటం ఆగలేదు.. జనం ఎవరి గొడవలో వాళ్ళున్నారు..

ఇదే టైంలో నా కళ్ళు నదిలో నుంచి పైకి లేస్తున్న ఒక పువ్వు మీద పడ్డాయి.

ఆ పువ్వు ఎలా వుందంటే.. కలల కొలనులోంచి కవ్విస్తున్నట్లుగా బయటికొచ్చిన తామరపుష్పంలా, అప్పుడే మబ్బుల మాటు నుండి బయటికి వస్తున్న చందమామలా.. కృష్ణమ్మ నదీ జలాలను పక్కకి తోసుకుంటూ పైకి లేచింది నా సుకుమారమైన కుసుమ కోమల లావణ్యమైన బుజ్జి…. అప్పటికి నాకు తనపేరు తెలీదు.. అందుకే బుజ్జి అని ముద్దుగా పిలుచుకున్నా…తనని చూడగానే ఏదో ఆనందం నాలో ఎప్పుడు లేని ఒక ఉత్సాహం తన ముఖం మీద లేలేత సూర్యుని కిరణాలు పడుతుంటే నాకంటే ముందు నా బుజ్జి నీ తాకుతావ అని సూర్యుడి మీదే కోపం వచ్చింది….

ఆ టైంలో నదిలో ఎవ్వరూ లేరు.. నా బుజ్జి మాత్రమే వుంది.. నేను మరో ఆలోచన లేకుండా వెళ్ళి నదిలోకి దిగాను.. మునకలేస్తున్నాను… ఆ కృష్ణమ్మ నీటిలో ఇంకా సుకుమారం గా కనిపించింది నా బుజ్జి, నేను ఇద్దరం కృష్ణ ఒడిలో.. మునకలేస్తున్నాం….నా బుజ్జిని తాకిన నీరు నన్ను తాకాలన్నదే నా కోరిక.. అలాగే తను మునిగి పైకి లేస్తూ నీటిని నోటితో పక్కకి ఉమ్ముతుండగా ఆ ఎంగిలి నీళ్ళు నా పై పడ్డాయి.. నిజానికి నా బుజ్జి నుంచి వచ్చిన తొలి స్పర్శ అదే నాకు..

అమ్మా.. దుర్గమ్మా.. ఎప్పటికైనా ఈ బెజవాడ బుల్లిని నాకు దక్కేలా చూడు తల్లీ అనుకున్నాను.. గుడిలో గంట మోగింది. మా నాన్న తిట్లు ఆగిపోయాయి.. ఒడ్డున నిలబడి అలాగే చూస్తున్నాడు మా నాన్న.. మా అమ్మ నాన్నతో గొడవ పడటం ఆపేసింది.. నన్నే చూస్తోంది.. నేను దుర్గమ్మకి దండం పెట్టుకుంటున్నా.. ఇంతలో మా నాన్న కూడా బట్టలు తీసి డాయరు మీద నదిలోకి దిగబోతున్నాడు.

అప్పటిదాకా బుజ్జి స్నానం చేసిన నీరు ఈయన స్పర్శతో అపవిత్రం అవ్వబోతున్నాయని నాకు అనిపించింది.. అప్పటికే బుజ్జి స్నానం చేసి ఆడవారు బట్టలు మార్చుకునే బాత్ రూమ్స్ లోకి వెళ్ళిపోయింది. నాకు తెలీదు బట్టలు మార్చుకోటానికి బాత్ రూమ్స్ లాంటివి వుంటాయని. అసలే బెజవాడకి మనం కొత్త… వచ్చీరాగానే ఈ కన్నె పుష్పం నన్ను బాగా ఆకట్టుకుంది..

మా నాన్న నదిలోకి దిగుతుండగానే నేను బయటికి వచ్చేశాను. అక్కడే డ్రస్సు మార్చుకుంటున్నాను….తను బట్టలు మార్చుకుని వచ్చి తను నన్ను చూసి చిన్నగా ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోయింది గుడి వైపుకు నేను తనని అల చూస్తూ ఉండిపోయా తర్వాత తెలిసింది తను నేను టవల్ లో చూసి నవ్వింది నేను సిగ్గు పడ్డాను తర్వాత అందరం కలిసి గుడికి వెళ్ళాం.. గుడిలో ఎక్కడైనా కనిపిస్తుందేమో అని వెతికాను కానీ నా బుజ్జి నాకు కనిపించలేదు. అంతే తనకోసం బెజవాడలోని వాడవాడా వెతకటం మొదలు పెట్టాను..

(కొనసాగుతుంది..)

This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000