This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000
వళ్ళు మండిపోతుంది రజనీకి, అరగంట క్రితం భర్తతో గొడవ అయ్యినప్పట్నుండీ. ఆ విషయం తనకు నచ్చదని ఎన్నోసార్లు చెప్పింది. వింటేగా. పైగా సరిగ్గా అప్పుడే మొదలెడతాడు. వళ్ళు మండిపోదా మరీ. అందుకే అలిగి వచ్చేసింది. అమ్మా, నాన్నా ఆ ఊరిలోనే ఉన్నారు.
అక్కడకి పోవడానికే బస్ స్టాప్ దగ్గర నిలబడింది. నూట పదహారో సారి తిట్టుకుంది మొగుడుని, “ఛీ…ఏం మగవాళ్ళో ఏమిటో.” అని. ఇంతలో పక్కనుండి ఎవరో అదే మాట అన్నారు. ఉలిక్కిపడి చూసింది. ఒక నలభై ఏళ్ళ స్త్రీ నిలబడి ఉంది. తారుడబ్బాకి చీర కట్టినట్టుగా ఉంది. ఆమె ఎవరినో చూస్తూ తిట్టుకుంటుంది. రజని తనని చూడగానే, “ఆడది కనిపిస్తే చాలు, ఈ మగ వెదవలు తినేసేటట్టు చూస్తారు. ఛీ.” అంది ఆమె. అంత కోపంలోనూ ఫక్కున నవ్వు వచ్చింది ఆమెకి. ఆమెని అంత తినేసే మగాడెవరా అని, ఆమె చూస్తున్న వైపు చూసింది.
బైక్ మీద కూర్చుని చూస్తున్నాడతను. అయితే ఆమెని కాదు తనని. టక్కున కళ్ళు తిప్పేసుకుని, “ఆ చూపులేంటో తినేసేటట్టు.” అనుకుంది. ఒక నిమిషం ఆగి ఓరగా చూసింది అతని వైపు. అది గమనించి చిన్నగా నవ్వాడతను. గుండె ఝల్లుమంది ఆమెకి. అటూ ఇటూ చూసింది, ఎవరైనా గమనిస్తున్నారేమోనని. తారుడబ్బా వెళ్ళిపోయింది. తాను తప్ప ఎవరూ లేరు అక్కడ. మళ్ళీ ఓరగా చూసింది అతనివైపు.
చిన్నగా గాలిలోకి ముద్దు విసిరాడు. ఆమెకి గుండె గుబగుబ లాడింది. తలతిప్పేసుకుంది. ఏమిటీ అతని ధైర్యం? కొంపదీసి దగ్గరకి గానీ వస్తాడా? అసలే చుట్టుపక్కల ఎవరూ లేరు. వస్తే ఏం చేయాలీ? అని ఆలోచిస్తూ ఉండగానే, బైక్ వచ్చి ఆగిన శబ్ధం వినిపించింది. “అమ్మో, వచ్చేసాడు.” అనుకుంటూ, కనుకొలకులలోంచి చూసింది. సరిగ్గా తన ముందే ఆపాడు బైక్. నెమ్మదిగా ఊపిరి పీలుస్తూ “ఎందుకు వచ్చాడూ? ఏమడుగుతాడూ?” అనుకుంటూ ఉండగా, అతనే అడిగేసాడు “ఎక్కడి వరకూ?” అని. “నీకెందుకూ?” అంది రజని విసురుగా. “ఒంటరిగా ఉన్నావు కదా, కంపెనీ ఇద్దామని.” అన్నాడతను. “నాకేం అవసరం లేదు.” అని మొహం తిప్పేసుకుంది రజని. “పోనీ ఎక్కడకి వెళ్ళాలో చెబితే డ్రాప్ చేస్తాను. రావచ్చు కదా.” అన్నాడు.
విసురుగా మళ్ళీ తిట్టబోయి అతని మొహం చూసి ఆగిపోయింది. అతను నవ్వుతున్నాడు. నవ్వుతుంటే చాలా బాగున్నాడు. ఆ నవ్వుతోనే అమ్మాయిలను పడగొట్టేయొచ్చు. “ఛీ, నేనేంటీ ఇలా ఆలోచిస్తున్నాను. తిట్టాలి కదా అతన్ని.” అనుకొని, మళ్ళీ అతని వైపు చూసింది. అతని మొహంలో అదే నవ్వు, మత్తుజల్లుతున్నట్టు. అదే నవ్వుతో “ప్లీజ్, వస్తే తీసుకెళతా.” అన్నాడు. లాభం లేదు, తను అతని నవ్వుకి పడిపోతున్నానన్న విషయం అర్ధం అయిపోతుంది ఆమెకి. ఎలాగైనా కంట్రోల్ చేసుకోవాలి, అనుకుంటూ పిడికిళ్ళను గట్టిగా మూసుకుంది.
“ఈ టైమ్ లో ఇలా వంటరిగా ఉంటే నీకే ప్రమాదం. నేను మంచివాడినే. నన్ను నమ్మొచ్చు.” అన్నాడతను. మళ్ళీ అతని వైపు చూసింది. కాస్త జాలిగా చూస్తున్నాడు. ఆమె మనసు కరగడం మొదలయ్యింది. అది గమనించి “అమ్మో, అతని నవ్వుకంటే ఈ చూపు మరీ డేంజరస్.” అనుకుంది. ఇంతలో అతను ఆమె చేయి పట్టుకున్నాడు. ఒక్కసారి షాక్ కొట్టినట్టయింది. “ప్లీజ్.” అన్నాడతను. అయితే ఈ సారి అతని మాటలో ఏదో ఆజ్ఙాపన వుంది. లాభంలేదు, తను అతనికి లొంగిపోతుంది.
అతనికి అది అర్ధమయినట్టు ఉంది. చేయి పట్టుకొని ఆమెని బైక్ దగ్గరకి లాగాడు. చేష్టలుడిగినట్టు కూర్చుండిపోయింది ఆమె బైక్ పై. అతను బైక్ ని ముందుకి పోనిచ్చాడు. అప్రయత్నంగా అతని నడుము పట్టుకుందామె. అతను వెనక్కి తిరిగి చిన్నగా నవ్వి, మళ్ళీ ముందుకు చూస్తూ బైక్ నడపసాగాడు. ఆమె ఆలోచిస్తూనే ఉంది. ఎందుకిలా లొంగిపోతుంది ఇతనికి? ఆమెకే అర్ధం కావడం లేదు. ఇంతలో ఒక స్పీడ్ బ్రేకర్ అడ్డురావడంతో చిన్నగా బ్రేక్ వేసాడతను. తూలి అతనిపై పడింది. తన స్థనాలు అతని వీపుకి హత్తుకోగానే, వళ్ళంతా కంపించింది.
మళ్ళీ బ్రేక్ వేస్తే బావుణ్ణు అనుకుంది. అంతలోనే, “ఛీ…ఇలా మగాళ్ళు కదా అలోచిస్తారు.” అనుకుంది. ఎందుకో తన మనసు, శరీరం వశం తప్పడం ఆమెకి తెలుస్తుంది. ఆమె ఆలోచనల్లో ఉండగానే, అతను ఒక ఇంటి ముందు బైక్ ఆపి, స్టేండ్ వేసి, వెళ్ళి తలుపు తాళం తీసి, ఆమెతో “రా..” అన్నాడు. మంత్ర ముగ్ధురాలిలా లోపలకి నడచింది. ఆమె లోపలకి రాగానే తలుపు గడియ పెట్టి, ఆమె చేయి పట్టుకొని నేరుగా పడకగదిలోకి తీసుకుపోయాడు. నాగస్వరం వింటున్న నాగుపాములా అతని వెనకే వెళ్ళిపోయింది. గదిలో ఆమెకి ఇష్టమైన లావెండర్ వాసన. ఆమె శరీరం ఇక పూర్తిగా అదుపుతప్పేసింది. అతను ఆమెని తన కౌగిలిలో బందించాడు. ఆమె చిన్నగా వణుకుతుంది. ఆమె వణుకు చూసి, ఆమెపై మత్తు జల్లేలా మళ్ళీ నవ్వుతూ, ఆమె పెదవులపై ముద్దుపెట్టాడు. జిమ్ అంది ఆమెకి. బదులుగా, గట్టిగా వాటేసుకుంది అతనిని.
ఆవేశంగా అతనిని చుట్టుకుపోతూ, అతనికి ధీటుగా ముద్దులు పెడుతూ, అతనికి సహకరించ సాగింది. ఇద్దరూ క్షణాల్లో నగ్నంగా మారిపోయారు. మంచంపై పడి మిన్నాగుల్లా పెనవేసుకుంటున్నారు. ఒకరినొకరు గిచ్చుకుంటున్నారు, కొరుక్కుంటున్నారు. శరీరంలో ప్రతీ అణువునూ స్పర్శిస్తున్నారు. రుచి చూస్తున్నారు. చివరికి ఒకరిలో ఒకరు కలసి పోయి, ఓటమి ఎరుగని యుద్దం చేసాక, అలసిపోయి ఒకరిపక్కన ఒకరు పడుకొని సేదతీరుతున్నారు. ఐదు నిమిషాలు సేదతీరిన తరువాత, ఆ కలయికను గుర్తు తెచ్చుకొని, ఆమె కళ్ళు మూసుకొని తీయగా నవ్వుకుంటుంది. అంతలో, అతను నెమ్మదిగా పైకి లేచి, దిండు కిందనుండి ఒక సిగరెట్ పేకెట్, అందులోంచి ఒక సిగరెట్ తీసి, నోటిలో పెట్టుకొని, అంటించి, ఒకసారి పీల్చి గాలిలోకి పొగ వదిలాడు.
ఆ వాసన ముక్కు పుటాలకి సోకగానే కళ్ళు తెరిచిందామె. సిగరెట్ తాగుతున్న అతన్ని చూడగానే సివంగిలా లేచి అతని మీద పడింది. “మై గాడ్, రజనీ…ప్లీజ్..ఈ ఒక్కసారే..” అంటున్నాడతను. “ఇందాక ఇందుకే కదా అలిగి మా పుట్టింటికి బయలుదేరానూ, ఏదో మాయజేసి మళ్ళీ తీసుకొచ్చేసావ్. మానతావా, మానవా?” అని, ఇక ఉక్రోషం పట్టలేక భోరున ఏడవసాగింది.
అతను చేతిలో ఉన్న సిగరెట్ నూ, సిగరెట్ పెట్టెనూ నలిపేస్తూ…”నువ్వు ఇందాక వెళ్ళినప్పుడే డిసైడ్ అయ్యా రజనీ మానేద్దామని. ఊరకే నిన్ను ఏడిపిద్దామని కాల్చా. కావాలంటే చూడు.” అన్నాడు. ఆమె చూసింది. అతని చేతిలో నలిగిపోయిఉన్న సిగరెట్ పేకెట్. అప్పుడు నవ్వింది చిన్నగా. ఆ నవ్వు చూసి, ముచ్చటగా ఆమె పెదవిపై ముద్దు పెట్టాడు.
(సిగరెట్ లేని ముద్దు హాయికరం.)
This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000