This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000
జలపాతం పైన సింహళ రాజు కోట ఉంది .అది పర్వత రాజ్యం. హోరుగా ఉన్న జలపాతం ఎక్కి అడవి ని చేరుకున్నాడు .అక్కడ ఒక యువకుడిని పులి దాడి చేసింది .చుట్టూ ఉన్న సైనికులు ఆయన్ను కాపాడడానికి ప్రయత్నిస్తున్నారు ,కానీ ఆ బెబ్బులి ధాటికి తట్టుకోలేక పారిపోయారు. అప్పుడు శాతకర్ణి పులి పై దూకి దానిని నిలువరించారు . అప్పుడు ఆ యువకుడు కృతజ్ఞతలు చెప్పి తాను సింహళ దేశ యువరాజు అని చెప్పి రాజ్యానికి తీసుకెళ్లాడు. సింహళ రాజును కలిశాడు శాతకర్ణి .శాతకర్ణి కి ఘనసత్కారం చేసాడు రాజు. అప్పుడు శాతకర్ణి తాను శాలివాహన యువరాజు అని చెప్పి తనువచ్చిన కార్యం గురించి చెప్పాడు. సింహళ రాజు “ఆ మ్లేచ్చుల తో మాకు చిరకాల వైరం ఉంది, మీకు యుద్ధం లో నా నావికా దళం కావాలంటే ,మీరు నాకు ఒక సహాయం చేసిపెట్టాలి.”అన్నారు.
“ఈ రాజ్యం దగ్గర లో పిపిరి పర్వత శ్రేణి లో ఒక తెగ వారు నివసిస్తున్నారు .వారు నాగరికులకు దూరం గా ఉంటారు .వారి వద్ద మహాశక్తి ఉందని సమాచారం. ఆ శక్తి వల్ల వారు అతులిత బలధాములలాగా ఉంటారు. ఎంత ప్రయత్నించినా ఆ రహస్యాన్ని నేను ఛేదించలేకపోయాను. సింహళ దేశ బెబ్బులి ని మీరు ఒంటి చేత్తో మట్టికరిపించారు .మీరు మహా యోగి లాగా ప్రకాశవంతం గా ఉన్నారు. . గత కొన్నేళ్లుగా మా దేశం లో ఒక భయంకర మహమ్మారి పీడిస్తుంది, ఆ మహమ్మారికి విరుగుడు వారి వద్ద ఉందని మా రాజ్యగురువు చెప్పారు. ఈ పని చేస్తే మీకు జీవితాంతం రుణ పడి ఉంటాము .ఈ సాయం చేస్తే మీకు నా కుమార్తె ను ఇచ్చి వివాహం చేస్తాను” అని రాజు చెప్పారు .
శాతకర్ణి రాజు వద్ద సెలవు తీసుకుని పిపిరి పర్వతశ్రేణి లోకి పయనమయ్యాడు. నాగరిక వేషధారణ వదిలేసి శాతకర్ణి ఆ తెగ వద్దకు చేరుకున్నాడు . సైనికులు ఆ తెగకు కాపలాగా ఉన్నారు.శాతకర్ణి వంటి మీద వస్త్రాలు లేకుండా ఆ తెగ ఉండే చోటు వద్దకు చేరుకున్నాడు. అతనికి అక్కడ దట్టమైన అడవి తప్ప ఏం కనిపించలేదు.తురీయ స్థితి లోనుండి ధ్యానం చేయగా మసక గా ఒక గ్రామం కనపడింది.ఆ ప్రదేశం ఇంకా స్ప్రష్టంగా కనపడటానికి తురీయాతీత స్థితి కి చేరుకున్నాడు. శాతకర్ణి దివ్య తేజస్సు తో వెలిగిపోతున్నాడు. వేరే కాలప్రమాణం లోఉన్న పిపిరి తెగ వారు శాతకర్ణి తేజస్సు చూసి బాహ్య కాలప్రమాణం లోకి వచ్చి తమ లోకం లోకి తీసుకెళ్లారు. అప్పుడు అర్ధమైంది శాతకర్ణి కి ఈ రహస్య జీవులు ఎలా మిగిలిన ప్రపంచానికి తెలియకుండా ఉంటున్నారో ….. శాతకర్ణి వారి తెగ నాయకుడైన మాతంగ ధీశుని కలిశారు.
శాతకర్ణి మాతంగా ధీశునితో ఎన్నో సైద్దాంతికపరమైన చర్చలు జరిపారు. కానీ వారి ఆలయంలోకి మాత్రం రానిచ్చేవారు కాదు.వారి దేవాలయం చాలా విశాలమైనది.ఒక పెద్ద సరస్సులో ఉంది. చాలా పురాతనమైనది. నాలుగు ప్రాకరాలు ఉన్నాయి. చుట్టూ దట్టమైన అడవులు, అడవి నుండి దేవాలయానికి కర్రల వంతెన ఉంది. ఆ ఆలయంలోకి బయట వారికి ప్రవేశం లేదని మాతంగధీశుడు తెలిపాడు. కొన్ని రోజులకు శాతకర్ణికి తెలిసింది, ప్రతీ నలభై ఒక్క సంవత్సరాలకు ఒక యోగి ఆ దేవాలయానికి వచ్చి అందరికీ ఉపదేశం చేస్తారని ఆయన సంరక్షణలోనే ఈ తెగ ఉన్నదని, ఈ ప్రజలకు కంటికి రెప్పలా కాపాడేది, ఆ యోగ శక్తి అని చెప్పారు. ఆ రోజు రానే వచ్చింది.ఆలయం బయట శాతకర్ణి తురీయ స్ధితిలో ఉన్నారు. యోగి పుంగవుని రాక కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.
అంతలో ఒక దివ్యకాంతి పుంజం గుడి బయట ఆవిర్భవించింది. యోగి పుంగవుడు ఆ కాంతిలోంచి వచ్చారు.ఆయన తురీయాతీత స్ధితిలో ఉన్న శాతకర్ణిని చూసి,అతన్ని యోగ విద్య నుండి లేపి,నాయనా నాతో పాటులోనికి రా అని లోపలికి తీసుకువెళ్ళారు. యోగితో శాతకర్ణి రావడం చూసి అందరూ ఆశ్చర్యపోయి,యోగికి నమస్కరించారు.అందరూ తమ తమ సందేహాలను యోగిని అడిగి నివృత్తి చేసుకుంటున్నారు. దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న యోగిని చూసి శాతకర్ణికి నోట మాట రావటంలేదు. యోగి పుంగవులు అందరికీ ఒక మంత్రం ఉపదేశం చేసాడు. యోగి చెబుతూ ఈ మంత్రం మనస్సులో అనుకుంటే నేను వారికి ప్రత్యక్షం అవ్వుతాను.కానీ మంత్రం చదివిన వ్యక్తి నాతో ఆత్మశక్తి పంచుకోగలిగిన వాడై ఉండాలి, లేకపోతే తన్ను తాను తెలుసుకున్నవాడై ఉండాలి అని అన్నారు. వెంటనే మాతాంగుల వారు, యోగిని అడిగారు,స్వామి, ఇతని పేరు శాతకర్ణి,అన్యులకు సాధ్యం కానీ ఈ ఆలయ ప్రవేశం ఇతని కెలా సాధ్యమయ్యింది అని అన్నారు. అప్పుడు యోగి,ఇతను మహానుభావుడు,చక్రవర్తి అంశతో పుట్టినవాడు. భగవతీ ఆలయంలో సుశిక్షితుడు.అంతకుమించి తురియ,తురీయాతీత స్ధితిని సాధించినవాడు.అతులిత బల సంపన్నుడు. అత్యంత పవిత్రమైన సోమవజ్రాన్ని కలవాడు. ఇతను రాజసూయ యాగ యోగo ఉన్నవాడు. మీ ఉపదేశం పూర్తి అయినది. శాతకర్ణి తప్ప మిగిలిన వారు, బయటకు వెళ్ళండి అని యోగి చెప్పారు.
అప్పుడు యోగి ఇలా చెప్పారు,నాయనా నేను హనుమంతుడిని,పరశురాముడు స్ధాపించిన భగవతీ ఆలయ పరిరక్షకుడిని. మన జంబూద్వీపంలో సనాతన ధర్మ పరిరక్షకుడిని అరుణాచలంలో నీకు గాయాలు అయ్యినప్పుడు,నీటిలో మునిగిపోయినప్పుడు నిన్ను కాపాడింది నేనే,దక్షణామూర్తి అనే పండితుడిని నేనే,కిష్కిందలో నువ్వు కాపాడిన వృద్ధుడిని కూడా నేనే,నిన్ను అడుగడుగునా కంటికి రెప్పలా చూసుకున్నాను. అప్పుడు శాతకర్ణి హనుమంతునికి నమస్కరించి,మీ చేతిలో మలచబడ్డ శిల్పాన్ని నేను అని కన్నీరు పెట్టుకొని ఆ యోగ కాంతికి సాష్టాంగ నమస్కారం చేసారు. ఈ రహస్యాన్ని చాలా గోప్యంగా ఉంచాలి, మన జంబూద్వీప మనుగడకి పరశురాముని భగవతీ విశ్వవిధ్యాలయం పునాధి. నేను మహాబలి చక్రవర్తి ,జాంబవంతులవారు సరైన నాయకత్వం, పాలన, రాజ్యాభివృద్ధి కలిగేలా చూస్తున్నాము. ఇది ఎవ్వరికీ తెలియకుండా తరతరాలుగా చేస్తున్నాము.నీవు ఎవ్వరికీ ఈ విధానం చెప్పకూడదు అని చెప్పి. ఈ భూభాగాన్ని జంబుద్వీపాన్ని పరిరక్షించడానికి ఒక ఆయుధం నీకు ఇస్తాను అని చెప్పి అడవిలోకి తీసుకువెళ్ళారు. అక్కడ ఒక జలపాతం క్రింద ఒక గుడి ఉంది.అది రావణాసురుని గుడి, శివాలయం కూడా ఉంది. రావణసురుని గొప్పతనానికి మెచ్చి రాముడు ఆయనకు గుడి కట్టించారు. ఆ గుడి చాలా దట్టమైన అరణ్యంలో ఉంది అక్కడకు వెళ్ళి శాతకర్ణి, హనుమంతులవారు గుడిలో రహస్య మార్గంలోనికి వెళ్ళారు. ఆ రహస్య మార్గంలో ఇంకొక గుడి ఉంది.ఆ గుడిలోకి వెళ్ళి చూస్తే వజ్ర వైఢూర్యాలతో కూడిన రధం ఉన్నది.ఆ రధం ఎక్కి హనుమంతుల వారు ఆకాశంలోకి ఎగిరారు.పాదరసంలో పనిచేసే ఆ రాధాన్ని హనుమంతుల వారు శాతకర్ణికి ఇచ్చి అది ఎలా ఉపయోగించాలో చెప్పి అంతర్ధానమయ్యారు. ఆ రధం ఎక్కి శాతకర్ణి సింహళ రాజు వద్దకు వెళ్ళి తెగను ఒక యోగి కాపాడుతున్నారని చెప్పి ఆ రధాన్ని చూపించారు. ఇంతటి యోగ్యుడికి తన కుమార్తెను పెళ్ళి చేస్తానని చెప్పి, శాతకర్ణికి తన కుమార్తెను చూపించారు.అప్పుడు రాజు గారి పేరు దంతేశ్వరుడు అని తెలిసింది. గతం స్ఫురించి యువరాణిని చూసాడు శాతకర్ణి . అప్పుడు ఆమెను చూడగానే అరుణాచలం ముందు ఎదురైన అమ్మాయి అని గుర్తుకువచ్చింది. శాతకర్ణి, ఎంతో సంతోషించి, మన కర్మ కొలది అన్నీ జరుగుతాయని తలంచి,హనుమంతుడికి నమస్కరించారు. రాజ్యం స్దిరపరిచిన తర్వాత వస్తానని చెప్పి ఆయన నావికాదళాన్ని తనతో పంపాలని కోరాడు. అల్లుడి కోరికను వెంటనే తీర్చాడు సింహళ రాజు.
ఇంతలో శివస్వతి నుండి కబురు వచ్చింది ,”మ్లేత్యులు యవనులు పశ్చిమ తీరం పై ఆవరించి ఉన్నారని” అప్పుడు మహాబలి ఇచ్చిన పుస్తకాన్ని శాతకర్ణి తెరచి చూశాడు శత్రువుల బలం మనకంటే పెద్దది ,వారివి మూడంతస్తుల యుద్ధ నౌకలు ,మన నౌకా దళం చిన్నది అని తీవ్రంగా ఆలోచించసాగాడు సింహళ దేశం నుండి నౌకలు రావడానికి రెండు రోజుల సమయం పడుతుంది ఇంతలో వేళ్ళని ఎలా నిలువరించాలి అని సభ ఏర్పాటు చేసాడు వేగుల ద్వారా వారి సైన్యం పదివేలు నౌకలు అని తెలిసింది ,శాతవాహన బలం వెయ్యి మాత్రమే తన రహస్య మందిరం లో ఒక వ్యూహం రచించాడు యుద్ధ నౌకలు తీరాన్ని సమీపిస్తున్నాయి వెంటనే శాతకర్ణి పాములా పొడవుగా వున్న వంద చిన్న పడవలను రప్పించాడు,అవి మెరుపు వేగం తో కదులుతాయి. వాటిని బోర్లా పడుకోబెట్టి ఈదుకుంటూ మ్లేత్యుల నౌకలు చుట్టూ అర్ధచంద్రాకారం లాగా ఏర్పరిచారు శత్రువులకు పాముపడవలు తిరగబడి ఉండటం వలన ఒక తాడులాగా కనిపించాయి ఇంతలో సింహనాదం వినిపించింది పడవకు వేలాడదీసిన పీపాకు కట్టిన తాడు కత్తిరించారు ,కత్తులతో వాటి మూతలను తీసేసి వెనక్కి ఈదుకుంటూ వెళ్లిపోయారు గజఈతగాళ్ళు .
వెళ్లే ము కింది అంతస్తులో శత్రునౌకల తెడ్డువేసే వారిని బాణాలతో చంపేశారు నౌకలు ఎక్కడికక్కడే ఆగి పోయాయి శత్రువుల కంటికి పీపాలు తేలుతూ కనిపిస్తున్నాయి ఈటెల వర్షం కురిసింది శత్రు నౌకల నుండి …. వేలాది డాలులు నీటిపై తేలుతున్నాయి వాటిని వీపుకు కట్టుకుని ఈదుతూ తప్పించుకున్నారు శాతవాహనులు సముద్రమంతా నల్లగా తారుతో నిండిపోయింది ఆకాశం లో కారుమబ్బులు ఆవరించాయి ఇంతలో సముద్రం లో పిడుగు పడింది మెరుపులు మొదలయ్యాయి మెర్పుల వెలుతురులో శాతకర్ణి ఆకాశ వీధి లో రధం పై కనిపించాడు అది పిడుగు కాదు శాతకర్ణి సంధించిన నిప్పుల బాణం నౌకలు అగ్గి రాజుకున్నాయి ,వెనుక వున్న నౌకలు వెనక్కి తగ్గాయి ఇంతలో వెనుక నుంచి సింహళ నౌకలు రానే వచ్చాయి .అవి ఐదు అంతస్తుల నౌకలు .అవి మ్లేత్యుల నౌకను చుట్టు ముట్టాయి . చేసేది లేక యినుప గుండ్లు ప్రయోగించ సాగారు .ఇంతలో ఒక ధ్వజస్తంభం లాంటి దానిని నౌకకు ముందు వుంచి,పదునైన ఇనుప ధ్వజాన్ని తాడు సాయం తో ఒక్కో నౌక మీద వదిలారు .వెంటనే ఆ దెబ్బకు నౌకలు మునిగి పోయాయి .సుమిత్ర బాలి దీవుల నుండి సువర్ణ వర్మ కూడా సింహళ నావికా బలానికి సాయం వచ్చారు . మ్లేచ్చులు తమ సైన్య రక్తం సముద్ర నీటి తో ,తారుతో పాటు కలిసిపోవడం చూసి ,యవనులతో సహా ఓటమి అంగీకరించారు. విజయధ్వానాలు మిన్నుమింటాయి . ఇంతలో వర్తమానం అందింది నహపాణుడు దండెత్తి రాజ్య వైపు వస్తున్నాడని…. నహపాణుడు ఉత్తర దేశ సైన్యాలన్నీ కలిపి రెండు లక్షల సైన్యం తో యుద్దానికి బయలుదేరారు. శాతకర్ణి సైన్యం 40 వేలు మాత్రమే ….. శాతకర్ణి మహాబలి ఇచ్చిన పుస్తకం లోనించి బ్రహ్మాండమైన వ్యూహాన్ని రచించాడు . రాజ్యాన్ని ఎలాగైనా కాపాడుకోవాలని కోటకు రక్షణ కవచం లా అశ్వాలనూ ,ఏనుగులను నిలబెట్టాడు . ఏనుగులకు ముళ్ల కవచం ఏర్పాటు చేసాడు తొండానికి ఇనుప గొలుసుతో ముళ్ల ఇనుప గుండ్లు కట్టారు.ఏనుగు కు చుట్టూ పది అశ్వాలను, ఇరవై మంది సాయుధులను ఉంచారు .ఇలాంటివి వందయేనుగుల వరకు ఉంచారు. చుట్టూ దీర్ఘచతురస్రాకారం లో సైన్యాన్ని మోహరించారు. ముందు వరుస మధ్యలో ఖాళీ వదిలారు దీన్ని మండల వ్యూహం అంటారు ఈ వ్యూహాన్ని పసిగట్టి గరుడ వ్యూహం పన్నాడు నహపాణుడు . పక్షి ముక్కు ముందు వ్యూహాన్ని చీల్చేలా ,రెక్కలు రెండువైపులా చాచి మండల వ్యూహాన్ని రెండు వైపులా చుట్టుముట్టేలా పధకం వేశారు.
తమకు నాలుగు రెట్లు వున్న శత్రువులను ధైర్యం తో ఎదురు నిలిచారు శాతకర్ణి సైన్యం ముందుకు దూసుకువచ్చింది పక్షి ముందు భాగం అశ్వదళం తో, వెనుక నుండి బాణాల వర్షం కురిసింది శాతకర్ణి సేన మీదకు .అప్పుడు శాతకర్ణి సైనికులు తయారుచేసిన యుద్ధగజాలను ముందుకు వదిలారు. తొండాలకు కట్టిన ముళ్ల గుండ్ల తో శత్రు అశ్వాలపై విరుచుకు పడ్డాయి. ఊహించని పరిణామాలకి హుతాశులయ్యారు నాహాపణ సైన్యం . గరుడవ్యుహం ముక్కు పగిలిపోయింది శాతకర్ణి మధ్యలోంచి సింహం పైకి ఎక్కి ఉరిమి కత్తి తో ముందుకు ఉరికాడు కానీ నాహాపణ సైన్యం చండ ప్రచండం గా ఉన్నది. నిలువరించ లేకపోతున్నారు. శాతకర్ణి ఎగిరే రధం ఎక్కి భాస్వరం నిండిన గోళాలను ఆకాశంనుండి వదిలాడు. వాటిని నిప్పు బాణం తో కొట్టాడు.
This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000